' శూన్య సమయం ' అంటే ఏమిటి ?

1. భారత సంచి నిధి దేని కొరకు ఏర్పాటు చేయబడినది ?
1. ఆదాయ పన్ను మరియు కార్పోరేటు పన్ను
2. అన్ని ఋణాల నుంచి సేకరించిన ద్రవ్యము
3. భారత ప్రభుత్వం యొక్క అన్ని రెవెన్యూ జమలు
4. ఆదాయ పన్ను మరియు కార్పోరెట్ పన్ను

2 . విధించిన వ్యయం కూడుకొని ఉన్నది ?
1. భారత ప్రభుత్వం చెల్లించవలసిన ఋణభారము
2. కొందరు ఉన్నత అధికారుల జీతాభత్యలు
3. ఏదైనా న్యాయస్థానము , లేదా ట్రిబ్యునల్ తీరును , ఆదేశమును లేదా ప్రధానంను సంతృప్తి పరుచుటకు కావలసిన మొత్తం
4. పైవన్నీయు

3. భారత సంచిత నిధి నుండి వ్యయాల అంచనాలను బడ్జెట్లో పొందుపరచవలెను మరియు లోక్సభచే ఓటింగ్ అవసరముంది . అవి ఏ రూపంలో సమర్పించబడును ?
1. మూలధన బడ్జెట్
2. నిధుల కొరకు డిమాండ్లు
3. రెవెన్యూ బడ్జెట్
4. ప్రభారమైన వ్యయము

4. ' శూన్య సమయం ' అంటే ఏమిటి ?
1. బడ్జెట్పై చర్చకు కేటాయించిన నిర్థిష్ట సమయము
2. ప్రశోత్తరములు సమయం ముగిసినప్పటికీ ఖచ్చిత సమయం
3. ఒక బిల్లు పై రెండు దశల చర్చల మధ్య కాలంలో లాంఛన ప్రాయంకాని చర్చలకు కేటాయించి సమయం
4. ప్రశోత్తరముల సమయంనకు మరియు కార్యక్రమ పట్టికలో తరువాతి కార్యక్రమును మధ్యగల సమయం

5. అనుబంధ నిధుల కొరకు డిమాండ్ల , తప్పక సమర్పించబడవలెను & సభ ద్వారా ఆమోదించబడవలెను ?
1. సంచిత నిధి నుండి ద్రవ్యం విడుదల చేసిన తరువాత
2. కాగ్ నివేదికను సమర్పించిన తరువాత
3. సంబంధించిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందు
4. కొనసాగింపు సంవత్సరం బడ్జెట్ ఆమోదించక ముందు

6. పార్లమెంట్ ఆర్థిక బిల్లు ప్రక్రియ అనిర్ణీతంగా ఉన్నపుడు తాత్కాలికంగా పన్నులను సేకరించే చట్టం , 1931 ప్రభుత్వానికి ఇంత కాలానికి పన్నులు సేకరించుకునే అధికారం కల్పించింది .
1. 60 రోజులు
2. 30 రోజులు
3. 50 రోజులు
4. 75 రోజులు

7. పార్లమెంట్ ప్రక్రియ అనుసారం చర్చ రహిత ఓటింగ్ అను పదము అర్థము అది స్పీకర్ ?
1. ఒక సభ్యుడిని తన దుష్ప్రవర్తన మందలించటం 
2. సభా సమయం ముగియక ముందే వాయిదా వేయటం
3. జరుగుతున్నా సభా వ్యవహారము ఆపేసి , అంశంను ఓటు కొరకు పెట్టటము 
4. ఒక తీర్మానంపై ఓటింగ్కు అనుమతించక పోవటం

8 . ఈక్రింది వానిలో ఏ వ్యయాలు భారత సంచిత నిధిపై చార్జీ చెయబడతాయి ?
1. లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల జీతాల మరియు భత్యములు
2. రాష్ట్రపతి జీతము & ఇతర భత్యములు & అతని కార్యాలయ సంబంధిత ఇతర వ్యయాలు
3. రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల జీతములు మరియు భత్యములు
4. పైవన్నీయు

9. ద్రవ్య బిల్లు వీటితో వ్యవహరించును ?
1. భారత సంచిత నిధి సంరక్షణ
2 . భారత ఆగంతుక నిధి నుండి ద్రవ్యం విడుదల
3. భారత ప్రభుత్వ ద్రవ్య బుణము కొరకు ఏదైనా హామీ ఇచ్చుట
4. పైవన్నీ

10. ఈ క్రింది వాటిలో ఏది వాయిదా తీర్మానానికి సంబంధించినది కాదు ?
1. అత్యవసర అంశము
2. సాధారణ ప్రజా ప్రయోజన అంశము
3. సభా హక్కులపై ప్రశ్న లేవని అంశము
4. సాధారణ షరతులలో రూపొందించబడిన అంశము

11. ద్రవ్య బిల్లు ఏసభలో ముందగా ప్రవేశపెట్టాలి ?
1. ఏ సభలోనైనా
2. రాజ్యసభలో మాత్రమే
3. లోక్సభలో మాత్రమే
4. ఉభయసభల సంయుక్త సమావేశంలో

12. సుమారు ఎంత జనాభాకు ఒక్కో లోక్సభ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు ?
1. 5 లక్షలు
2. 7 లక్షల 50 వేలు
3. 10 లక్షలు
4. 15 లక్షలు

13. భారత పార్లమెట్ దిగువసభను ఏమంటారు ?
1. హౌస్ ఆఫ్ పీపుల్
2. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్
3. లెజిస్ట్రేటివ్ కౌన్సిల్
4. లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ

14. అదనపు కోర్టులను సృష్టించడానికి పార్లమెంటు అనుమతిపిస్తున్న నిబంధన ఏది ?
1. 240
2. 245
3.247
4. 260

15. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభలోని గరిష్ట సభ్యుల సంఖ్యను 545 కి పెంచారు ?
1. 32 వ
2. 31 వ
3. 42 వ
4. ఏది కాదు

Answers ::

1 ) 3 , 2 ) 4 , 3 ) 2 , 4 ) 4 , 5 ) 3 , 6 ) 4 , 7 ) 3 , 8 ) 4 , 9 ) 4 , 10 ) 4 , 11 ) 3 , 12 ) 2 , 13 ) 1 , 14 ) 3 , 15 ) , 2

Post a Comment (0)
Previous Post Next Post