రాజ్యసభకు లోక్ సభతో దేనిలో సమాన అధికారాలు కలవు ?

1. రాజ్యసభకు లోక్ సభ తో దేనిలో సమాన అధికారాలు కలవు ?
1. రాజ్యాంగంను సవరించడంలో
2. ప్రభుత్వంను తోలగించడంలో
3. కోత తీర్మానాలు చేయడం
4. కొత్త అఖిల భారత సర్వీస్లను ఏర్పాటు చేసే విషయంలో

2. ప్రతి రాష్ట్రంలో నియోజక వర్గాల హద్దు రేఖలను నిర్ణయింపు మరియు వివిధ రాష్ట్రాలకు లోక్సభ స్థానాల కేటాయింపును చేపట్టేది ?
1. రిజిష్టర్ జనరల్
2. ఎన్నికల సంఘము
3. రాష్ట్రాల పునర్వవస్థీకరణ కమిషన్
4. డీలిమిటేషన్ కమిషన్

3. ఈ క్రింది వానిలో ఏది ప్రతి ఇతర తీర్మానం కంటే ప్రాధాన్యత కలిగినది క్రింది వానిలో ఏది ?
1. వాయిదా తీర్మానం
2. అరగంట చర్చ
3. ఉభయసభల సంయుక్త తీర్మానం
4. సావధాన తీర్మానం

4. నిధులకు కొరకు డిమాండ్లు దీని నుండి మాత్రమే ఉత్పన్నమవును ?
1. అంచనాల సంఘం ఛైర్మన్
2. ప్రతిపక్ష నాయకుడు
3. కార్యనిర్వహక శాఖ
4. అధికార పార్టీ సభ్యుడు కాకుండా ఎవరైన సభ్యుడు

5. భారత సంచిత నిధికి ప్రభారమైన వ్యయము
1. రాజ్యసభ ఓటుకు సమర్పించబడదు
2. పార్లమెంట్ ఓటుకు సమర్పించబడదు
3. రాష్ట్రపతి అనుమతికి సమర్పించబడదు .
4. పార్లమెంట్ ఓటు కొరకు సమర్పించబడును

6. బడ్జెట్ యొక్క సాధారణ ఆమోదం అనిర్ణీతిలో ఉన్నప్పుడు , రాబోయే ఆర్థిక సంవత్సరం వ్యయా అంచనాలలోని భాగంకు సంబంధించి పార్లమెంట్ ద్వారా కల్పించబడే అనుధానమును ఇలా పిలుస్తారు ?
1. లాంఛన ప్రాయ కోల్
2. ఓట్ అన్ అకౌంట్
3. కోత తీర్మానం
4. వినియోగ ఖాతా

7. బడ్జెట్ సాధారణ ఆమోదం అనిర్ణీత స్థితిలో ఉన్నపుడు పార్లమెంట్ ద్వారా ముందస్తు నిధుల మంజూరీ చేయునపుడు దానిని ఏమని పిలుస్తారు .
1. ఖాతా పై ఓటు
2. పరపతి పై ఓటు
3. లాంఛన ప్రాయ అనుధానం
4. అనుబంధ అనుధానం

8. ఆర్థిక కోత తీర్మానం , నిధుల కొరకు డిమాండ్ ద్వారా ప్రతిపాదించిన వ్యయమును ఈ మొత్తానికి తగ్గించాలని కోరుతుంది ?
1. ఒక నిర్ధారించబడని మొత్తం
2. ఒక రూపాయి
3. ఒక నూరు రూపాయలు
4. ఒక నిర్దిష్ట మొత్తం

9. ఒక సాధారణ బిల్లును పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి నివేదించినపుడు , దానిని దీని ద్వారా ఆమోదించాలి ?
1. ఉభయసభల మొత్తం హాజరైన మరియు ఓటేసిన మొత్తం సభ్యులలో మూడింట రెండువంతుల ఆధిక్యం
2. ఉభయ సభల మొత్తం సభ్యులతో సాధారణ ఆధిక్యం
3. ఉభయ సభల మొత్తం హాజరైన మరియు ఓటేసిని సభ్యులలో సాధారణ అధిక్యం
4. ఉభయ సభల మొత్తం సభ్యులతో మూడింట రెండు వంతుల ఆధిక్యం

10. " చట్టానికి అధికృతమై మినహా ఎలాంటి పన్నును విధించరాదు మరియు సేకరించరాదు ” దీనిని కల్పించిన భారత రాజ్యాంగ ప్రకరణ ఏది ?
1. ప్రకరణ 265
2. ప్రకరణ 264
3. ప్రకరణ 210
4. ప్రకరణ 215

11. బడ్జెట్ సందర్భంలో " చర్చ రహిత ఓటింగ్ అను దేనికి సంబంధించి ఉపయోగిస్తారు .
1. ఆర్థిక బిల్లు
2. సంచిత నిధి భారమునకు
3. డిమాండ్ల ఓటింగ్
4. వినియోగాధికార బిల్లు

12. ప్రశ్నోత్తరముల సమయం తరువాత సభలో మౌఖిక రూపంలో ప్రశ్న అడిగితే దానిని ఎలా పిలుస్తారు ?
1. నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు
2. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు
3. స్వల్ప వ్యవధి ప్రశ్న
4. అనుబంధ ప్రశ్న

Answers ::

1 ) 1 , 2 ) 4 ,  3 ) 1 , 4 ) 3 , 5 ) 2 , 6 ) 2 , 7 ) 3 , 8 ) 4 , 9 ) 3 , 10 ) 1 , 11 ) 3 , 12 ) 4

Post a Comment (0)
Previous Post Next Post