కేంద్ర మంత్రి మండలి ముఖ్యమైన బిట్స్

1 . కేంద్ర మంత్రుల జీతాలు మరియు భత్యములు ఎలా నిర్ణయించబడతాయి ?
1. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రాలయం ద్వారా
2. పార్లమెంట్ ద్వారా
3. కేబినేట్ సచివాలయం ద్వారా
4. ఆర్థిక మంత్రాలయం ద్వారా

2 . లోక్సభకు ప్రధానమంత్రి మరియు కేబినేట్ వహించు జవాబుదారీతనం లేదా బాధ్యత అనేది
1. ఎన్నికల సమయంలోనిది
2. పరోక్షమైనది
3. ప్రత్యక్ష , నిరంతర మరియు సమిష్టి అయినది
4. అనియమితమైనది

3 . కేంద్రం యొక్క కార్య నిర్వహక అధికారం కింది వారిలో ఎవరిలో నిహితం అయి ఉంటుంది ?
1. కేంద్ర కేబినేట్
2. కేంద్ర మంత్రి మండలి
3. భారత రాష్ట్రపతి
4. ప్రధానమంత్రి భారత రాజ్యాంగ నిబంధనలలో

4 . ఈ కింది ఏ నిబంధనలో మంత్రి మండలి సమిష్టి బాధ్యత నియమము పొందుపరచబడినది ?
1. నిబంధన 78
2. నిబంధన 77
3. నిబంధన 74
4. నిబంధన 75

5 . ఈ కింది భారత రాజ్యాంగ లక్షణాలలో ఏది , వాస్తవ కార్యనిర్వాహణ అధికారం ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలిలో నిహితం అయి ఉందన్న నిజాన్ని తెలియజేస్తుంది
1. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
2. ప్రాతినిథ్య శాసన వ్యవస్థ
3. సార్వతిక వయోజన ఓటు
4. సమాఖ్య వ్యవస్థ

6 . రాష్ట్రపతి తన విధులను లేదా అధికారాలను వినియోగించుటకు , రాష్ట్రపతి సంతృప్తి మేరకు అని రాజ్యాంగం కోరినపుడు అంటే దాని అర్థం
1. రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత సంతృప్తి
2 . పార్లమెంట్ సభ్యుల సంతృప్తి
3. మంత్రి మండలి యొక్క సంతృప్తి
4. పై వేవి కావు .

7 . భారత రాజ్యాంగం ప్రకారం ఒక వేళ రాష్ట్రపతి కోరితే , మంత్రి ద్వారా నిర్ణయం తీసుకోబడి మంత్రి మండలి పరిగణించని అంశంను మంత్రి మండలి పరిగణనకు సమర్పించటం ప్రధానమంత్రి బాధ్యత ఇది దీని నిశ్చయపరుస్తుంది
1. మంత్రి మండలితో సంబంధం లేకుండా మంత్రి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వతహా సిద్ధి అధికారం
2. సమానులలో ప్రథముడుగా ప్రధానమంత్రి యొక్క స్థాయి
3. సమిష్టి బాధ్యత
4. మంత్రి నిర్ణయాన్ని నిర్వీర్యం చేయుటకు రాష్ట్రపతికి గల అధికారం

8 .ఈ కింది వానిలోని ఏ రాజ్యాంగ సవరణ చట్టం / చట్టాలు భారత రాష్ట్రపతి , మంత్రి మండలి నిర్ణయాలకు కట్టుబడాలని ఖరారు చేసింది / చేశాయి ?
1. 40 వ & 41 సవరణలు
2. 43 వ సవరణ చట్టం
3. 40 వ సవరణ చట్టం
4. 42 వ మరియు 44 వ సవరణ చట్టాలు

9 . రాజ్యాంగ నిబంధన 74 అనుసారం , మంత్రుల ద్వారా రాష్ట్రపతి ఇ్వవబడిన సలహాలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
1. దీనిని హైకోర్టులో విచారణ చేయరాదు
2. దీనిని ఏ న్యాయస్థానములనైన విచారణ చేయవచ్చును
3. దీనిని సుప్రీంకోర్టులో విచారణచేయవచ్చును
4. దీనిని ఏ న్యాయ స్థానములో విచారణ చేయరాదు

10. రాష్ట్రవతితో మంత్రి మండలి గల సంబంధంతో వ్యవహరించే రాజ్యాంగ నిబంధనల విశ్లేషణకు సంబంధించిన భారత రాజ్యాంగ నిబంధనలు ఏవి ?
1. నిబంధనలు 72,73 మరియు 76
2. నిబంధనలు 74,75 మరియు 78
3. నిబంధనలు 73,76 మరియు 78
4. నిబంధనలు 71,75 మరియు 78

11. ఈ క్రింది వానిలో ఏది మంత్రి మండలికి సంబంధించి సరైనది కాదు?
1. దాని సభ్యులు మరియు వారి హెూదాలు ప్రధానమంత్రి ద్వారా నిర్ణయించబడినాయి
2. అది రాజ్యాంగం ద్వారా గుర్తించబడినది
3. దాని పని తీరు అనేది రాజ్యాంగ నిబంధన అనుసారం
4. దాని సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించలేదు

12. ఈ కింది వాటిలో సరియైనది ఏది ?
ఎ . కేంద్ర పాలనకు సంబంధించిన మంత్రి మండలి అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి సమాచారం ఇవ్వాలి
బి . రాష్ట్రపతి , శాసన ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారంను కోరవచ్చు .
సి . రాష్ట్రపతి ఒక మంత్రి నిర్ణయం తీసుకున్న ఏదైనా అంశంను మంత్రి మండలికి సమర్పించమని నిర్దేశించవచ్చు
డి . రాష్ట్రపతికి మంత్రి మండలిని సంబోధించేందుకు మరియు సందేశాన్ని పంపించేందుకు హక్కు కలదు
వీటిలో ఏది / ఏవి సరైనవి
1 ) ఎ మాత్రమే
2 ) బి మరియు సి
3 ) ఎ , బి మరియు సి
4 ) ఎ , బి , సి & డి

13 . ఈ కింది వాటిలో వేటిని భారత రాజ్యాంగం ప్రస్తావించలేదు ?
ఎ . మంత్రుల రాజీనామా
బి . ఉప ప్రధానమంత్రి పదవి
సి . మంత్రి మండలి
డి . సమిష్టి బాధ్యత
1 ) ఎ మరియు బి
2 ) బి మరియు సి
3 ) సి మరియు డి
4 ) ఎ మరియు సి

14. ఈకింది వ్యాఖ్యలను పరిశీలింపుము ?
ఎ . కేంద్ర మంత్రి మండలి లేకుండా రాష్ట్రపతి విధి నిర్వహించలేరు .
బి . సొలిసిటర్ జనరల్ , కేంద్ర ప్రభుత్వం యొక్క అత్యున్నత న్యాయ అధికారి
సి . కేంద్ర మంతి మండలి , ప్రధానమంత్రి మరణ లేదా రాజీనామా చేసిన కాలవ్యవధి వరకు విధులను నిర్వహించవచ్చు
డి . ప్రధాన మంత్రి గైర్హాజరు అయిన సమయంలో , కేవలం గృహ మంత్రి మాత్రమే కేంద్ర మంత్రి మండలి అత్యవసర సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు .
పైన పేర్కొనబడిన వ్యాఖ్యలలో ఏది / ఏవి సరియైనవి ?
1 ) ఎ మాత్రమే
2 ) ఎ , మరియు బి
3 ) ఎ , బి , మరియు
4 ) ఎ , బి , సి మరియు బి

Answers ::

1 ) 2 , 2 ) 3 , 3 ) 3, 4 ) 4 , 5 ) 1 , 6 ) 3 , 7 ) 3 , 8 ) 4 , 9 ) 4 , 10 ) 2 , 11 ) 3 , 12 ) 3 , 13 ) 1 , 14 ) 1

Post a Comment (0)
Previous Post Next Post