PACS అంటే ఏమిటీ? ఆంధ్రప్రదేశ్ బిట్స్...

1 . 5 వ ఆర్థిక గణనం 2005 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యవస్థాపక యూనిట్లలో ( ఎంటర్ప్రైజేస్ ) గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాటి శాతం .
1 ) 28 శాతం
2 ) 72 శాతం
3 ) 30 శాతం
4 ) 70 శాతం

2 . 1990-91 తో పోలిస్తే 2008-09 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకులు జారీ చేసిన తలసరి ఋణాలు ( దీర్ఘకాల మరియు స్వల్పకాల )
1 ) తగ్గినవి
2 ) పెరిగినవి
3 ) స్థిరంగానున్నవి
4 ) రిపోర్టు చేయబడలేదు

3 . ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు ( PACS )
1 ) 2949
2 ) 5748
3 ) 6748
4 ) 8748

4 . 5 వ ఆర్థిక గణన 2005 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనున్న వ్యవస్థాపక యూనిట్ల సంఖ్య ?
1 ) 28.96 లక్షలు
2 ) 28.96 కోట్లు
3 ) 28.96 మిలియన్లు
4 ) 28.96 బిలియన్లు

5 . 1997-98 తో పోలిస్తే 2008-09 లో ఆంధ్రప్రదేశ్లోని సహకార సంస్థలు సమకూర్చిన మొత్తం ఋణాల్లో వ్యవసాయానికి సమకూర్చిన దీర్ఘకాల ఋణాలు
1 ) పెరిగినవి
2 ) తగ్గినవి
3 ) స్థిరంగానున్నవి
4 ) రిపోర్టు చేయబడలేదు

6 . 1997-98 తో పోలిస్తే 2008-09 లో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సమకూర్చిన మొత్తం ఋణాల్లో వ్యవసాయానికి సమకూర్చిన దీర్ఘకాల ఋణాలు
1 ) స్థిరంగానున్నవి
2 ) పెరిగినవి
3 ) తగ్గినవి
4 ) రిపోర్టు చేయబడలేదు

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న మరియు అతిచిన్న పారిశ్రామిక సంస్థలు పారిశ్రామిక క్షీణతకు గురికావడానికి కారణం సరైన మౌలిక సదుపాయాల లేమి , ముడిసరుకుల లభ్యత తక్కువ , సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడంతో పాటు
1 ) అధిక ప్రాంతీయ పన్నులు
2 ) సరైన అప్పుల సదుపాయం లేకపోవడం
3 ) శిక్షణ పొందిన పనివారు లేకపోవడం
4 ) తక్కువ సబ్సిడీలు ఉండడం

8. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పరిశ్రమల సంస్థలలో సరాసరి వృద్ధిరేటు 1977-78 మరియు 2006-07ల మధ్య
1 ) 0.26 శాతం
2 ) 1.23 శాతం
3 ) 3.11 శాతం
4 ) 0.87 శాతం

9. ఆంధ్రప్రదేశ్లో 2005-10 మధ్య పారిశ్రామిక పెట్టుబడుల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటమే కాక క్రింది వానిలో ఏ సదుపాయం కలుగజేస్తుంది .
1 ) తక్కువ వడ్డీ రేటుతో అప్పు
2 ) ఆధునిక సాంకేతిక
3 ) మంచి మార్కెట్ సౌకర్యాలు
4 ) పైవన్నీ

10. ప్రభుత్వం లేదా ప్రైవేట్ వ్యక్తులతో నిర్వహించబడే చిన్నతరహా పరిశ్రమలకు సహాయపడేందుకు అవకాశం కల్పించే లక్ష్యంతో మార్చి 1 , 1961 న ఏర్పాటైన సంస్థ .
1 ) ఎ.పి.ఐ.ఐ.సి
2 ) ఎ.పి.ఐ.డి.సి
3 ) ఎ.పి.ఎస్.ఐ.డి.సి
4 ) ఎ.పి.ఎస్.ఎఫ్.సి

11 . 10 వ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక ఖర్చులో పరిశ్రమలు మరియు గనుల వాటా ? 

1 ) 4.77 శాతం
2 ) 3.56 శాతం
3 ) 2.67 శాతం
4 ) 3.98 శాతం

12. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సర్వే 2007-08 ప్రకారం రాష్ట్రంలో ఇవ్వబడిన ఋణాలలో సహకార సంఘాల వాటా
1 ) 16.77 శాతం
2 ) 22.35 శాతం
3 ) 25.22 శాతం
4 ) 19.68 శాతం

13 . ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు ప్రత్యక్షంగా అతి తక్కువ రేటుకు వడ్డీని ఇచ్చు కాలం ?
1 ) స్వల్పకాలిక
2 ) దీర్ఘకాలిక
3 ) స్వల్ప మరియు దీర్ఘకాలిక
4 ) స్వల్ప మరియు మధ్యకాలిక

Answers ::
1.2 2.2 3.1 4.1 5. 2 6.2 7.1 8.1 9.4 10.3 11.4 12.4 13.4

Post a Comment (0)
Previous Post Next Post