రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎవరి చేత తొలగించబడతారు ?

1. ఈ క్రింది వానిలో 73 వ రాజ్యాంగ సవరణ కలుగజేయునది .
ఎ . ఇతర వెనుకబడిన తరగతుల వారికీ పంచాయతీలలో 27 % సీట్లు రిజర్వేషన్
బి . మాధ్యమిక లేదా జిల్లా స్థాయిలలోని పంచాయతీలలో ఎన్నికైన సభ్యులు తమలో నుండి ఒకరిని తామే ఛైర్పర్సన్ ఎనుకోనుట.
పై వివరణలలో ఏది / ఏవి సరైనవి.
1 ) బి మాత్రమే
2 ) ఎ మరియు బి కూడా
3 ) ఎ మాత్రమే
4 ) ఎ కాదు మరియు బి కాదు

2. పంచాయతీలను ఏర్పాటు చేసిన రాజ్యాంగ ( 73 వ సవరణ ) చట్టం ఈ క్రింద నిబంధనలలో వేటిని కూడా చేసింది ?
ఎ . పంచాయతీ నిర్వర్తించవలసిన 29 అంశాల జాబితాలను కలిగిన ఒక నూతన షెడ్యూల్డ్ XI ను రాజ్యంగానికి చేర్పు .
బి . పంచాయతీ నిర్వర్తించవలసిన 18 అంశాల జాబితాలను కలిగిన ఒక నూతన షెడ్యూల్డ్- XI ను రాజ్యంగానికి చేర్పు .
సి . నియోజక వర్గాల పద్దుల నిర్ణయంకు సంబంధించిన చట్టాల చెల్లుబాటును కోర్టులు ప్రశ్నించుటపై నిషేదం
డి . పంచాయతీలలోని మొత్తం సీట్ల సంఖ్యలో మూడింట ఒక వంతు కాకుండా సీట్లును మహిళలకు రిజర్వు చేయడం ( షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు రిజర్వు చేయబడిన సీట్లు సంఖ్యను మినహాయించి )
క్రింది ఇవ్వబడిన సంకేతం ద్వారా సరియైన జవాబును గుర్తింపుము ?
1 ) ఎ సి
2 ) బి , డి
3 ) ఎ , సి
4 ) ఎ

3. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎవరి చేత తొలగించబడతారు ?
1. రాష్ట్ర గవర్నర్ చేత
2. రాష్ట్ర అసెంబ్లీ చేత
3. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తొలగించుటకు పాటించు విధానంలో
4. రాష్ట్ర ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశం ద్వారా

4. కథనం- I : 73 వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రక్రియలో అత్యున్నత స్థితి ( పరాకాష్ట ) .
కథనం- II : గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించి , స్వపరిపాలనా సంస్థలుగా అవిపని చేయడానికి అవసరమైన అధికారాలను ప్రాధికారములను కల్పించేందుకు రాజ్యం చర్యలు తీసుకోవాలి .
కోడులు :
1. రెండు కథనములు విడివిడిగా సరైనవి మరియు కథనం- II అనేది కథనం- I కి సరైన వివరణ.
2. రెండు కథనములు విడివిడిగా సరైనవి కానీ కథనం- II అనేది కథనం- I కి సరైన వివరణ కాదు .
3. కథనం- I సరైనది కాని కథనం- II తప్పు .
4. కథనం- I తప్పుకానీ కథనం- II సరైనది .

5.73 వ రాజ్యాంగ సవరణ యొక్క విప్లవాత్మక లక్షణాల దృష్ట్యా ఈ క్రింది వానిని పరిశీలింపుము ?
ఎ . పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ హెూదా ప్రధానం చేయడం .
బి . పంచాయతీరాజ్ సంస్థలకు తప్పనిసరి ఎన్నికలు .
సి . గ్రామీణ భారతదేశంలో అధికారాలు కలిగిన ప్రభుత్వం యొక్క మూడవ అంచెను ప్రవేశపెట్టడం .
డి . ప్రతి స్థాయిలోని పంచాయతీలలో సీట్ల మరియు అధ్యక్ష స్థానాలలో మహిళలకు 33 % రిజర్వేషన్ కల్పించడం .
వీటిలో ఏవి సరైనవి ?
1 ) ఎ మరియు డి
2 ) ఎ , బి మరియు సి
3 ) సి మరియు ఎ
4 ) ఎ , బి , సి మరియు డి

6. ఈ క్రింది వాటిని పరిశీలింపుము .
ఎ ) రాజ్యాంగ 73 వ సవరణ చట్టం , 1992 ద్వారా 11 వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడినది .
బి ) భారత రాజ్యాంగ 11 వ షెడ్యూల్డ్ భారత రాజ్యాంగ ప్రకరణ -243 ( W ) సంబంధించినది .
పై వ్యాఖ్యలలో ఏవి / ఏది సరైనవి ?
1 ) ఎ & బి
2 ) బి
3 ) ఎ
4 ) ఏదీకాదు

7. పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణ , అధికారాలు మరియు అప్పగించవల్సిన విధలు అధ్యయనం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ క్రింది కమిటీలను పరిశీలింపుము ?
ఎ . సంతాన కమిటీ
బి . అశోకెమెహతా కమిటీ
సి . బల్వంత్ రాయ్ కమిటీ
డి . జి.వి.కె రావు కమిటీ
ఈ క్రింది వానిలో ఏది వాటి యొక్క సరియైన కాలానుక్రమం ?
1. సి , బి , డి , ఎ
2. సి , ఎ , బి , డి
3. బి , ఎ , సి , డి
4. బి , డి , సి , ఎ

8. ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ?
ఎ . నిబంధన 243 -డి ప్రకారం , ప్రతి పంచాయతీలోను మూడింట ఒక వంతు సీట్లు షెడ్యూల్డ్ కులాలను మరియు షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకించబడినది .
బి . ప్రతి పంచాయతీలో షెడ్యూల్డ్ కులాలకు మరియు షెడ్యూల్డ్ తెగలకు వాటికి రిజర్వు చేయబడిన మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు సీట్లకు తక్కువ కాకుండా ఆయా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలకు రిజర్వు చేయబడినవి .
సి . పంచాయతీలలో ప్రతిస్థాయి వద్ద మొత్తం చైర్ పర్సన్ పదవుల సంఖ్యలో మూడింట ఒకవంతుకు తక్కువ కాకుండా మహిళలకు రిజర్వు చేయబడినవి .
పై వివరాలలో ఏవి సరైనవి ?
1 ఎ & బి మాత్రమే
2. బి & సి
3. ఎ & సి
4. ఎ , బి & సి

9. 73 వ రాజ్యాంగ నిబంధన చట్టంలో రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలి వేయబడినది ఏది ?
1. అన్ని స్థాయిలో అన్ని పదవులను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా పూరించుట
2. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కలుగ జేయుట
3. పంచాయతీలలో మహిళలకు మూడింట ఒక వంతు వరకు సీట్ల
4. వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ / ఎస్టీ సీట్ల రిజర్వేషన్ .

10. పంచాయతీల ఖాతాల నిర్వహణ మరియు వాటి ఆడిట్కు సంబంధించిన నిబంధనలను ఎవరు రూపొందిస్తారు ?
1. ఆ రాష్ట్ర శాసనసభ
2. భారత కంప్టోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్
3. సంబంధిత రాష్ట్ర ఆర్థిక సంఘం
4. జిల్లా కలెక్టర్

Answers ::
1 ) 1 , 2 ) 3 , 3 ) 3 , 4 ) 2 , 5 ) 4 , 6 ) 3 , 7 ) 2 , 8 ) 2 , 9 ) 2 , 10 ) 1 

Post a Comment (0)
Previous Post Next Post