చిన్నారులకు హోంవర్క్ ఇవ్వొద్దని తీర్పునిచ్చిన హైకోర్టు?

1. కింది వానిలో ఐక్యరాజ్యసమితిలో సరికానిది
ఎ ) మొత్తం 193 దేశాలు
బి ) 6 ప్రధానమైన రంగాలు
సి ) ఐక్యరాజ్యసమితి పతకం రెండు అలీవ్ కొమ్మలతో మూడు వృత్తాలు , ఐదు గీతలతో రూపొందించారు
డి ) రాక్ పెల్లార్ బ్రదర్స్ రాజ్యాంగాన్ని రూపొందించారు
ఎ ) ఎ , బి సరైనవి
బి ) బి , సి సరైనవి
సి ) అన్ని సరైనవి
డి ) ఎ , బి , సి సరైనవి

2. కింది వానిలో జి -5 దేశాలతో సంబంధం కలదు
ఎ ) సౌతాఫ్రికా , మెక్సికో , భారత్ , బ్రెజిల్ , రష్యా
బి ) బ్రెజిల్ , చైనా , భారత్ , మెక్సికో , సౌతాఫ్రికా
సి ) చైనా , జర్మనీ , జపాన్ , ఫ్రాన్స్ , భారత్
డి ) భారత్ , చైనా , సౌతాఫ్రికా , మెక్సికో , ఫ్రాన్స్

3. . 2018 మే 30 నుంచి జూన్ 1 వరకు నరేంద్ర మోదీ ఇండోనేషియా , సింగపూర్ , మలేషియా దేశాలు సందర్శిం చారు . ఇండోనేషియా దేశంతో భారత్ ఏ ఏ అంశాలపై ఒప్పందం అంగీకరించింది
ఎ ) ఆర్థిక , తీర ప్రాంత అభివృద్ధి , వాణిజ్యం , పెట్టుబడులు , ఉగ్రవాదం నిర్మూలన
బి ) ఉగ్రవాదం నిర్మూలన , పెట్టుబడులు , విద్యరంగం , శాస్త్ర , సాంకేతిక రంగం
సి ) రక్షణ రంగం , శాస్త్ర సాంకేతిక రంగం , మానవ హక్కుల రంగం
డి ) మానవ హక్కుల రంగం , నేరస్థుల అప్పగింత , రాజకీయ

4. నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పర్యటిస్తూ ఉగ్రవాద నిర్మూలన పై మే 30 నాడు ప్రత్యేకంగా చర్చించారు
ఎ ) మలేషియా
బి ) ఇండోనేషియా
సి ) సింగపూర్
డి ) జపాన్

5. 2018 సం . మే 30 నాడు నేపాల్ లో బాతుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి నది . దీనికి కారణమైన వైరస్
ఎ ) హెచ్ 9 ఎన్ 1
బి ) హెచ్ 1 , ఎన్ 1
సి ) హెచ్ 5 , ఎన్ 1
డి ) హెచ్5 ఎమ్ 3

6. నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో ఇండోనేషియా దేశాన్ని ఎన్ని సార్లు సందర్శించారు
ఎ ) 1
బి ) 2
సి ) 3
డి ) 4

7. ` చిన్నారులకు హోంవర్క్ ఇవ్వొద్దని తీర్పునిచ్చిన హైకోర్టు
ఎ ) కోల్కతా
బి ) మద్రాస్
సి ) హైద్రాబాద్
డి ) బెంగళూరు

8. కింది వానిని జతపర్చుము
ఎ ) జకో విడోడే 1 ) సింగపూర్
బి ) మాథ్యూ మహ్మద్ 2 ) ఇండోనేషియా
సి ) అలీమా యాకోబ్ 3 ) మలేషియా
డి ) బియాజ్ కెనాల్  4 ) క్యూబా
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -3 , బి -1 , సి -2 , డి -4
డి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4

9. కింది వానిలో నాటో సంస్థ లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 29. 2018 ఏప్రిల్ 4 కు ఈ సంస్థ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యింది
ఎ ) 65
బి ) 69
సి ) 70
డి ) 71

10. కింది వానిని జతపర్చుము
ఎ ) పత్రిక స్వేచ్చలో మొదటిస్థానం 1 ) నార్వే
బి ) పర్యావరణం అభివృద్ధి సూచీకలో రెండో స్థానం 2 ) ఫ్రాన్స్
సి ) అవినీతి రహిత దేశం 3 ) డెన్మార్క్
డి ) రక్షణ రంగానికి అత్యధిక నిధులను కేటాయిస్తున్న దేశం 4 ) అమెరికా
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -3 , బి -1 , సి -2 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

Answers ::
1.డి 2. బి 3.ఎ 4.బి 5.సి 6. బి 7. బి 8.డి 9.బి 10. ఎ

Post a Comment (0)
Previous Post Next Post