పంచాయతీలకు సహాయం కొరకు నిధులను సమకూర్చే నిధి పేరు ఏమిటి?

1. 73 వ రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ?
ఎ . ఇతర వెనుకడిన వర్గాలకు 27 % రిజర్వేషన్
బి . మధ్య / జిల్లా స్థాయిలలోని పంచాయతీల అధ్యక్షులు సంబంధిత ఎన్నికైన సభ్యులలో ఒకరు , ఎన్నికైన సభ్యులు ద్వారా ఎన్నుకోబడాలి
సి . ఎస్సీలు / ఎస్టీల కొరకు రిజర్వేషన్
డి . స్థానిక సంస్థలకు ఏకరూపత కలిగిన 5 సంవత్సరాల కాల పరిమితి వీటిలో సరైనవి ఏవి?
1. ఎ
2. బి , సి & డి
3. ఎ , బి , సి & డి
4. ఎ మరియు బి

2. ఈ క్రింది కమిటీలలో ఏది జిల్లా స్థాయిలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల ఏర్పాటు ను సిఫారసు చేసింది ?
1. కోఠారి కమిటీలు
2. జి.వి.కె.రావు కమిటీ
3. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ
4. దంత్ వాలా కమిటీ

3. ఏ నిబంధన కింద పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర గవర్నర్ ఒక రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు ?
1. ఆరత రాజ్యాంగంలోని ప్రకరణ 243 - ఐ ప్రకారం .
2. గవర్నర్ యొక్క వివేచనాత్మక అధికారాల క్రింద
3. శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా
4. రాజ్యసభలో ఆమోదించబడిన ఒక తీర్మానం ద్వారా

4. పంచాయతీరాజ్కు సంబంధించిన 73 వ రాజ్యాంగ నిబంధన దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది వానిని పరిశీలింపుము ?
ఎ ) అన్ని స్థాయిల్లో సభ్యుల ప్రత్యక్ష ఎన్నికలు
బి ) గ్రామ స్థాయిలో ఛైర్పర్సన్ల ప్రత్యక్ష ఎన్నికలు
సి ) మధ్యస్థాయి & జిల్లా స్థాయిల్లో ఛైర్ పర్సన్ల పరోక్ష ఎన్నికలు
డి ) ఎన్నికలు నిర్వహించేందుకు తప్పనిసరి నిబంధన
పై వానిలో సరైనవి ఏవి ?
1. ఎ , బి మరియు సి
2. బి , సి మరియు డి
3. ఎ , సి మరియు డి
4. ఎ , బి మరియు డి

5. పంచాయతీరాజ్ దీనిముందు చేర్చబడినది ?
1. కేంద్ర జాబితా
2. ఉమ్మడిజాబితా
3. రాష్ట్ర జాబితా
4. అవశేష జాబితా

6 . 73 వ రాజ్యాంగ నిబంధన చట్టంలోని నిబంధన 243హెచ్ ప్రకారం రాష్ట్ర శాసనసభ పంచాయతీలకు సహాయం కొరకు నిధులను దీని నుండి సమకూర్చవచ్చు
1. రాష్ట్ర సంఘటిత నిధి
2. రాష్ట్రపతి ఆగంతక నిధి
3. భారత సంఘటిత నిధి
4. గవర్నర్ ఆగంతక నిధి

7. భారత రాజ్యాంగంలోని 9 వ భాగం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఈ క్రింది వానిలో ఏ అంశాలపై గవర్నర్ సిఫారసులు చేస్తుంది ?
ఎ . రాష్ట్రం విధించే పన్నుల ద్వారా సమకూరే నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య పంపిణీ చేయుట .
బి . పంచాయతీలకు అప్పగించే లేదా పంచాయతీలు సమకూర్చుకునే పన్నులను నిర్ణయించడం
సి . రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంటులు
కింద ఇవ్వబడిన కోడ్లు ద్వారా సరైన జవాబును గుర్తించుము ?
1. ఎ , బి మరియు సి
2. బి మరియు సి మాత్రమే
3. ఎ మరియు బి మాత్రమే
4. ఎ మరియు సి మాత్రమే

8. పంచాయతీలకు సంబంధించిన 11 వ షెడ్యూల్ లో కలిగియున్నది ?
1. 18 అంశాలు
2. 29 అంశాలు
3. 28 అంశాలు
4. 19 అంశాలు

9. నిబంధన 243 ( జి ) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. పంచాయతీలు స్వపరిపాలనా సంస్థలుగా పనిచేసేందుకు శాసనం ప్రకారం ద్వారా వాటికి అధికారం కల్పించాలి .
2. పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వ ఏజెంట్ల లాగా పనిచేసేందుకు శాసనం ద్వారా వాటికి అధికారం కల్పించాలి .
3 . గ్రామ పంచాయతీలు జిల్లా పంచాయతీలు జవాబుదారీగా ఉంటాయి .
4. పంచాయతీలు కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు పరిచే ఏజెన్సీలుగా పనిచేస్తాయి .

10. ఈ క్రింది వివరణలను పరిశీలించుము 73 వ సవరణ అనంతర కాలంలో వికేంద్రీకరణ జరగవలసినవి ?
ఎ ) నిర్ణయీకరణ
బి ) న్యాయ అధికారాలు
సి ) మొత్తం వ్యవస్థ
డి ) పరిపాలన అధికారాలు
పై వివరణలో ఏవి / ఏది సరైనవి ?
1. ఎ , బి మరియు సి
2. బి , సి మరియు డి
3. ఎ , బి మరియు డి
4. ఎ , సి & డి

11. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణను అనుసరించి రాష్ట్ర శాసనసభలు పంచాయతీలకు అధికారాలను మరియు విధులను దత్తం చేస్తాయి ?
1. 243 మరియు 243 - ఎ
2. 243 - జి మరియు 243- హెచ్
3. 243 - ఎ మరియు 243 - బి
4. 243 - డి మరియు 243 - ఎఫ్

12. రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రతి 5 సంవత్సరాలకు నియమించబడే రాష్ట్ర ఆర్థిక సంఘం నిశ్చయపరచునది ?
1. రాష్ట్ర అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచేందుకు రాష్ట్ర ఆర్థిక వనరులు
2. రాష్ట్ర పన్ను ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల ( గ్రామీణ & పట్టణ ) మధ్య పంపిణీ చేయు విధానం & స్థానిక సంస్థలకు అందించే సహాయ గ్రాంట్ల విధానం .
3. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల యొక్క బడ్జెటరీ అవసరాలు
4. రాష్ట్ర పంచవర్ష ప్రణాళికను రూపొందించుటకు రాష్ట్ర అభివృద్ధి అవసరాలు

Answers ::
1 ) 2 , 2 ) 2 , 3 ) 1 , 4 ) 3 , 5 ) 3 , 6 ) 1 , 7 ) 1 , 8 ) 2 , 9 ) 1 , 10 ) 3 , 11 ) 2 , 12 ) 2

Post a Comment (0)
Previous Post Next Post