కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి పధకాలు

1.ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమైన తేదీ ?
ఎ ) ఆగష్టు 28 , 2014
బి ) ఆగష్టు 29 , 2014
సి ) ఆగష్టు 30 , 2014
డి ) పై అన్నీ

2. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 12 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 10 వ ప్రణాళిక
డి ) 9 వ ప్రణాళిక

3. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం లక్ష్యం ఏమిటి ?
ఎ ) అల్ప ఆదాయ వర్గాలకు ప్రాథమిక ఆర్థిక సేవలు అందించడం
బి ) కనీస మొత్తం లేకుండానే బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం
సి ) ఎ, బి
డి ) ఏదీకాదు

4. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్ని ఖాతాలు తెరిచారు ?
ఎ ) 15.59 కోట్లు
బి ) 16 కోట్లు
సి ) 17 కోట్లు
డి ) 1.5 కోట్ల

5.మేకిన్ ఇండియా ప్రారంభమైనది ఎప్పుడు ?
ఎ ) ఆగష్టు 28 , 2014
బి ) 25 సెప్టెంబర్ 2014
సి ) 26 డిసెంబర్ 2014
డి ) 27 సెప్టెంబర్ 2014

6. మేకిన్ ఇండియా ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ ) పెట్టుబడులను భారత్లోకి ఆకర్షించడం
బి ) కంపెనీలు తమ సరుకులను ఇక్కడే ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహించడం
సి ) ఉపాధికల్పన
డి ) అన్నియూ

7. మేకిన్ ఇండియా పథకం ఏ ప్రణాళికలలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 ప్రణాళిక
డి ) 13 వ ప్రణాళిక

8. డిజిటల్ ఇండియా పథకం ఏ ప్రణాళికలో ప్రవేశ పెట్టారు ?
ఎ ) 12 వ ప్రణాళిక
బి ) 10 వ ప్రణాళిక
సి ) 11 వ ప్రణాళిక
డి ) అన్నియూ

9. డిజిటల్ ఇండియా పథకం లక్ష్యాలు ఏమిటి?
ఎ ) గ్రామీణ ప్రాంతాలలో అంతర్జాల సేవలు మెరుగుదలకు , గ్రామీణస్థాయిలో హార్డ్వేర్ , సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ప్రోత్సహించడం
బి ) ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచడం
సి ) గ్రామాల్లో పాఠశాలల్లో ఐటి శిక్షణ
డి ) అన్నియూ

10. స్కిల్ ఇండియా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 9 వ ప్రణాళిక
బి ) 10 వ ప్రణాళిక
సి ) 11 వ ప్రణాళిక
డి ) 12 వ ప్రణాళిక

Answers :: 
1. ఎ 2. ఎ 3. సి 4. ఎ 5. బి 6. డి 7. సి 8. ఎ 9. డి 10. డి

Post a Comment (0)
Previous Post Next Post