ముద్ర బ్యాంక్ ఎప్పుడు ప్రారంభం ?

1. స్కిల్ ఇండియా లబ్ధిదారులు ఎవరు ?
ఎ ) వెల్డర్లు , చర్మకారులు
బి ) వడ్రంగి పనివారు , తాపి పనివారు
సి ) నేతకారులు , స్వర్ణకారులు
డి ) అన్నియూ

2. స్కిల్ ఇండియా ప్రధానలక్ష్యం ఏమిటి ?
ఎ ) యువతలో నైపుణ్యాన్ని పెంచటం
బి ) ఉపాధికల్పన
సి ) పేదరిక నిర్మూలన
డి ) అన్నియూ

3. స్వచ్ఛభారత్ ప్రారంభం అయినది ఎప్పుడు ?
ఎ ) అక్టోబర్ 2 , 2014
బి ) అక్టోబర్ 3 , 2014
సి ) అక్టోబర్ 4 , 2014
డి ) అక్టోబర్ 5 , 2014

4. స్వచ్ఛభారత్ ఏ ప్రణాళికలో ప్రవేశ పెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 వ ప్రణాళిక
డి ) ఏదీ కాదు

5. స్వచ్ఛభారత్ ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఎ ) పరిసరాల పరిశుభ్రత మరియు పౌరులను భాగస్వాములను చేయడం
బి ) బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం
సి ) వ్యర్థాల నిర్మూలన
డి ) అన్నియూ

6. స్మార్ట్ సిటీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ ) ఏప్రిల్ 29 , 2015
బి ) ఏప్రిల్ 28 , 2015
సి ) ఏప్రిల్ 27 , 2015
డి ) ఏదీకాదు

7. స్మార్ట్ సిటీల లక్ష్యం ఏమిటి ?
ఎ ) మెట్రోనగరాలపై పెరిగిన ఒత్తిడిని తగ్గించడం
బి ) సాంకేతిక పరిజ్ఞానం తేవడం
సి ) 100 స్మార్ట్ సిటీలు నిర్మించడం
డి ) పై అన్నియు

8. బేటీ బచావో - బేటీ పఢావో పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు .
ఎ ) జనవరి 22 , 2015
బి ) ఫిబ్రవరి 22 , 2015
సి ) మార్చి 22 , 2015
డి ) ఏప్రిల్ 23 , 2015

9. బేటీ బచావో - బేటీ పఢావో పథకం లక్ష్యం ఏమిటి ?
ఎ ) బాలికల పట్ల వివక్షతను తొలగించడం
బి ) భ్రూణ హత్యలను అరికట్టడం
సి ) బాలికల విద్యను ప్రోత్సహించడం
డి ) అన్నియూ

10. బేటీ బఛావో - బేటీ పఢావో ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 వ ప్రణాళిక
డి ) అన్నియూ

11. ముద్ర బ్యాంక్ ఎప్పుడు ప్రారంభం ?
ఎ ) ఏప్రిల్ 8 , 2015
బి ) ఏప్రిల్ 9 , 2015
సి ) ఏప్రిల్ 10 , 2015
డి ) ఏదీకాదు

12. ముద్ర బ్యాంక్ లక్ష్యం ఏమిటి ?
ఎ ) చిన్న వ్యాపారులకు ఋణ సదుపాయం కల్పించడం
బి ) చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం
సి ) అతివృష్టి , అనావృష్టి ఏర్పడినప్పుడు రైతులకు రుణ సదుపాయం కల్పించారు
డి ) అన్నియూ

13. ప్రధానమంత్రి సురక్షభీమా యోజన పథకం ప్రారంభం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) మే 9 , 2015
బి ) 12 వ ప్రణాళిక
సి ) 11 వ ప్రణాళిక
డి ) ఎ బి

14. ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకం లక్ష్యం ఏమిటి ?
ఎ ) పేదలకు తక్కువ ప్రీమియంతో ప్రమాద జీవిత భీమా కల్పించడం
బి ) ఋణాలు ఇవ్వడం
సి ) ఎ బి
డి ) ఏదీకాదు

15. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమాయోజన ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు ?
ఎ ) 10 వ ప్రణాళిక
బి ) 11 వ ప్రణాళిక
సి ) 12 ప్రణాళిక
డి ) ఏదీ కాదు

Answers ::
1. డి 2. డి 3. ఎ 4. సి 5. డి 6. ఎ 7. సి 8. ఎ 9. డి 10. సి 11. ఎ 12. డి  13. ఎ  14. ఎ 15. సి

Post a Comment (0)
Previous Post Next Post