మహిళల మధ్యహ్నా భోజనం పథకం లక్ష్యం ఏమిటీ ?

1. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) ప్రభుత్వం ఆస్పత్రులకు వచ్చే రోగులకు నిర్ధేశించిన వైద్య పరీక్షలు , సేవలు పూర్తిగా ఉచితంగా , ఉత్తమ నాణ్యత ప్రమాణాలతో సేవలు అందిస్తారు
బి ) ఎన్టీఆర్ వైద్య సేవ కొరకు 800 కోట్లు నుంచి 900 కోట్లు ఖర్చుపెడుతున్నారు
సి ) రాష్ట్రంలో 500 మంది వైద్యులు 1000 మంది నర్సులను నయమించి రోగులకు వైద్యులను అందుబాటులోకి తేవడం
డి ) అన్నియూ

2. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించే ప్రతి బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా చేర్చడానికి 278 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు
బి ) ఈ తల్లి బిడ్డలు ఎక్స్ప్రెస్ వాహనాలు బాలింత స్త్రీలను శిశువును మరియు ఒక సహాయకురాలును ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా తీసుకెళ్ళనున్నాయి
సి ) బాలింతలు ఈ సదుపాయం 102 నెంబర్క ఫోన్ చేయడం ద్వారా వినియోగించుకోవచ్చు
డి ) అన్నియూ

3. పంట సంజీవని పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టడం
బి ) పంట సంజీవని ద్వారా నీటి వనరులు పెంపు భూగర్భజలాల మట్టాలు అందుబాటులోకి రావడం
సి ) నీటిని నిల్వ చేయడం వల్ల భూమిలోకి ఇంకి , భూగర్భజలాల మట్టాలు పెరుగుతాయి
డి ) అన్నియూ

4. దుల్హన్ పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) పేద ముస్లీం బాలికల వివాహం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టింది .
బి ) 50 వేలు ఆర్థిక సహాయం చేస్తుంది .
సి ) ఈ పథకం కింద 3,200 మందికి లబ్దిదారులకు 16 కోట్ల రూపాయలు విడుదల చేసారు .
డి ) అన్నియూ

5. చంద్రన్న చేయూత పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) 20 కోట్లతో 10 వేల మంది నిరుద్యోగ ఎస్.సి. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
బి ) వీరిలో 70 % శాతం మందికి ఉపాధి నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన 14,91,733 కుటుంబాలకి ఇప్పటి వరకు 61.64 కోట్ల రాయితీ వచ్చింది .
సి ) ఎ & బి
డి ) ఏదీకాదు

6. దీపం పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) గ్రామీణ నిరుపేద , బలహీన వర్గాల మహిళలు కట్టెలు , బొగ్గు వంటి చెరుకు ఆధారంగా ఎంతో కష్టంతో పంట చేసుకోవడం వల్ల వారంతా నేత్ర సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు .
బి ) గ్రామలలో మౌలిక వసతుల కల్పన
సి ) యంత్రాలతో పాటు ఐరీస్ రీడర్లు ఏర్పాట్లు
డి ) అన్నియూ

7. ఇ - పాస్ పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టం చేయాలి .
బి ) తూ॥గోదావరి జిల్లాలో 100 చౌకధరల దుకాణాలలో చేపట్టి ఇ - పాస్ పైలట్ ప్రాజెక్ట్ కూడా విజయవంతం
సి ) ఎ & బి
డి ) ఏదీకాదు

8. చంద్రన్న దళితబాట పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) సి.సి. రోడ్లు , డ్రైనేజీ రోడ్లు , వ్యవస్థ మౌలిక వసతుల కోసం రెండేళ్లలో 1061.97 కోట్లు ఖర్చు పెట్టింది .
బి ) గ్రామలలో మౌలిక వసతుల కల్పన
సి ) ఎ & బి
డి ) ఏదీకాదు

9. మహిళల మధ్యహ్నా భోజనం పథకం లక్ష్యం ?
ఎ ) సంక్షేమ వసతి గృహాలకు కూరగాయలు , పాలు సప్లయ్ చేసే అవకాశాన్ని స్వయం సహాయక సంఘాలకే ప్రభుత్వం యిచ్చింది .
బి ) ప్రజా పంపిణీ వ్యవస్థ మెరకుగు పరిచారు .
సి ) ఎ & బి
డి ) ఏదీకాదు

10. ఇంకుడు గుంతలు ప్రధాన లక్ష్యం ?
ఎ ) తాగునీటి అవసరాలు తీర్చడం 
బి ) సాగునీటి అవసరాలు తీర్చడం
సి ) ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడం
డి ) అన్నియూ

11. చంద్రన్న రైతుక్షేత్రం పథకం లక్ష్యం ?
ఎ ) పంటల ఉత్పాదకత పెంచడం
బి ) నాణ్యతను నసేద్య విధానాలు ప్రోత్సహించడం
సి ) 16.080 హెక్టార్ల విస్తీర్ణంలో 1608 చంద్రన్న రైతు క్షేత్రాలు నెలకొల్పారు .
డి ) అన్నియూ

12. అభయం పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) మహిళలు , విద్యార్థినులపై రోజురోజుకు అఘయిత్యాలు అధికమైన దృష్ట్యా వీటిని అరికట్టడం
బి ) మహిళల రక్షణ కోసం 15 నిమిషాల్లో స్పందించేలా దీనిని రూపొందించారు .
సి ) & బి
డి ) ఏదీకాదు

13. ఈ క్యాబినేట్ పథకం ప్రధాన లక్ష్యం ?
ఎ ) మంత్రులెవరు పేపర్ వినియోగించకుండా ఐ - ప్యాడ్ తో క్యాబినేట్ నిర్వయించడం
బి ) పి.డి.ఎస్ . పటిష్ట పరచడం
సి ) పరిపాలన పారనదర్శకత
డి ) ఏదీకాదు

Answers ::
1 డి 2. డి 3. డి 4. డి 5. సి 6. ఎ 7. సి 8. సి 9. ఎ 10. డి  11. డి 12. సి 13. ఎ 

Post a Comment (0)
Previous Post Next Post