అంతర్జాతీయ ఎకానమీ ముఖ్యమైన అంశాలు...

    అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) తాజాగా విడుదల చేసిన ' ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ ' ( ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు ) నివేదిక 2022-23 సంవత్సరానికి భారత స్థూల జాతీయోత్పత్తి ( జీడీపీ ) వృద్ధిరేటును 8.2 శాతానికి తగ్గించింది . అయినా ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే . చైనా వృద్ధి రేటు ( 4.4 శాతం ) కంటే మనది దాదాపు రెట్టింపు ఉంది .

    ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలు ::

    * 2021 లో ఇదే కాలానికి భారత వృద్ధి రేటు 9 శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కగట్టింది . తాజా నివేదికలో దాన్ని 0.8 పాయింట్లు తగ్గించింది . 2021 లో భారత వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదయింది . 2023-24 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుందని ప్రస్తుతం అంచనా వేశారు .

    * ఇంధన ధరలు , ఇతర దిగుమతి వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా భారత కరెంట్ ఖాతా లోటు 2022-23 సంవత్సరంలో 3.1 శాతానికి పెరుగుతుందని ( 2021-22లో 1.6 శాతం ) అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కగట్టింది .

    * రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల వాణిజ్యంలో ప్రతికూల పరిస్థితులు , ఇతర సమస్యల కారణంగా అనేక ఇతర దేశాల మాదిరిగానే భారత్ కూడా సమస్యలు ఎదుర్కొంటోంది . ఆహారధాన్యాల ధరలు , ఇంధన ధరలు భారీగా పెరగడం , వాణిజ్య లోట్లు భారీగా పెరిగిపోవడం జరుగుతోంది . అంతే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగిస్తున్న కారణంగా బయట దేశాల్లో డిమాండ్ కూడా తగ్గుతోంది .

    అంతర్జాతీయ పరిస్థితులు ::

    * 2022 , 23 సంవత్సరాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 3.6 శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి లెక్కగట్టింది . 2022 జనవరిలో వేసిన అంచనా కంటే ఇది వరసగా 0.8 శాతం , 0.2 శాతం తక్కువ . అంతర్జాతీయ వృద్ధి రేటు తగ్గడం వల్ల భారత వృద్ధి రేటు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి . ఎందుకంటే అంతర్జాతీయ డిమాండ్ తగ్గితే భారత్ నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి . రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వల్ల నేరుగా ఏర్పడుతున్న సమస్యల కారణంగా ఇలా జరుగుతోంది .

    * అంతే కాకుండా కోవిడ్ 19 సంక్షోభం వల్ల చైనా , యూరప్ దేశాలలో కీలకమైన తయారీ రంగ పరిశ్రమలలో లాక్ డౌన్ల కారణంగా ఉత్పత్తి , డిమాండ్ , వృద్ధిరేటు కూడా తగ్గిపోయాయి . అందువల్ల అవి ఆ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి .

    ఐఎంఎఫ్ సిఫార్సులు ::

    * అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య రంగంపై కఠినంగా నిబంధనలు పెట్టాలనీ ; ద్రవ్యోల్బణం పెరిగి పోకుండా నిలుపు చేయాలనీ ; యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరాలలో ఏర్పడుతున్న అడ్డంకులను తగ్గించాలనీ ఐఎంఎఫ్ సిఫార్సు చేసింది . ఈ యుద్ధం వల్ల కోవిడ్ అనంతర రికవరీ బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందనీ , వృద్ధి రేటు తగ్గి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయనీ హెచ్చరించింది .

    * అన్ని దేశాల ద్రవ్య రంగాలు , వ్యవస్థలు పెరుగుతున్న ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ , దేశీయ ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని సూచించింది . ప్రభుత్వాలు పేద ప్రజలు దెబ్బ తినకుండా లక్షిత గృహాలకు వివిధ రకాలుగా ఆర్థిక సహాయం అందించాలనీ , పెరుగుతున్న ధరలను వారు ఎదుర్కోగలిగేలా సాయపడాలనీ సూచించింది .

    అంతర్జాతీయ ద్రవ్య నిధి ::

    * అంతర్జాతీయ ద్రవ్య నిధి , ప్రపంచ బ్యాంకు సంస్థలను 1945 లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధంలో దెబ్బ తిన్న దేశాల పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు . అమెరికాలోని బ్రెట్టన్ వుడ్స్లో జరిగిన సదస్సులో ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల వీటిని బ్రెట్టన్ వుడ్స్ కవలలుగా పిలుస్తారు .

    * అంతర్జాతీయ ద్రవ్య నిధిలో 189 సభ్య దేశాలు ఉన్నాయి . అంటే దాదాపుగా ప్రపంచంలోనే అన్ని దేశాలు ఇందులో సభ్య దేశాలు . భారత్ ఇందులో 1945 డిసెంబర్ 27 వ తేదీన చేరింది . దీని ప్రధాన లక్ష్యాలు అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో సుస్థిరత ఉండేలా చూడటం వివిధ మారక ద్రవ్యాల వ్యవస్థలను , అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థలను సక్రమంగా నడిచేలా చూడడం ; తద్వారా వివిధ దేశాలు , వాటి పౌరుల మధ్య ఆర్థిక కార్యక్రమాలు సజావుగా నడిచేలా చూడటం .

    * అంతర్జాతీయ ద్రవ్యనిధి విధులను 2012 వ సంవత్సరంలో సవరించారు . అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత మీద ప్రభావం చూపే స్థూల ఆర్థిక , ద్రవ్య రంగ కార్యకలాపాలను కూడా అందులో చేర్చారు .

    * అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసే నివేదికలు...
    1. ప్రపంచ ఆర్థిక సుస్థిరతా నివేదిక
    2. ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ అంటే ఏప్రిల్

    ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ నివేదిక ::

    * ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మీద అంతర్జాతీయ ద్రవ్యనిధి జరిపిన అధ్యయన వివరాలను ఇందులో ప్రచురిస్తుంది . దీన్ని సామాన్యంగా ఏడాదికి రెండుసార్లు అక్టోబర్ నెలలలో ప్రచురిస్తుంది . ఇందులో ప్రపంచ వ్యాప్తంగా స్వల్పకాలిక , మధ్యకాలిక ఆర్థిక వ్యవహారాల గురించి విశ్లేషణలు , అంచనాలు ఉంటాయి .

    * ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైన విశ్లేషణలు , అంచనాలను మరింత తరచుగా ప్రచురించాలన్న డిమాండ్ మేరకు ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ అవుట్లుక్ నివేదికను జనవరి , జూలై నెలలలో కూడా ప్రచురించడం ప్రారంభించింది .

    Post a Comment (0)
    Previous Post Next Post