కేంద్ర ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీ...

    సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్ నెలాఖరులో ఎంఎస్ఎంఈ ( మైక్రో , స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ) సుస్థిర సర్టిఫికేషన్ పథకాన్ని ప్రారంభించింది . 

    * ఈ పథకం సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలన్నీ తాము తయారు చేసే ఉత్పత్తులలో ఎలాంటి లోపాలు , ప్రతికూల ప్రభావాలు లేకుండా ( జీరో డిఫెక్ట్ , జీరో ఎఫెక్ట్ లేదా జెడ్ స్ఈడీ ) ఉండే పద్ధతులను అనుసరించేలా చేసేందుకు సహాయపడుతుంది . అంతే కాకుండా ఈ సర్టిఫికేషన్ పొందేందుకు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించి వాటికి ఈ అంశంలో ఛాంపియన్లుగా గుర్తింపు లభించేలా చేస్తుంది . 

    * సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలు ఈ సర్టిఫికేషన్ పొందడానికి మూడు స్థాయిలలో పని చేయవలసి ఉంటుంది . 

    సర్టిఫికేషన్ స్థాయి ::

    1. కాంస్య పతకం సర్టిఫికేషన్ స్థాయి 

    2. రజత పతకం సర్టిఫికేషన్ స్థాయి 

    3. స్వర్ణ పతకం 

    * ఏ విధమైన లోపాలు , ప్రతికూల ప్రభావాలు లేకుండా ఉత్పత్తి చేస్తామని ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత ఆ పరిశ్రమలు ఈ సర్టిఫికేషన్ స్థాయిల కోసం దరఖాస్తు చేసు కోవచ్చు . ప్రతి స్థాయిలోనూ పేర్కొన్న అర్హతలను సాధించినట్లు నిరూపించగలిగితే లేదా సాధించగలమనే నమ్మకం కలిగితే ఆ స్థాయిలకు దరఖాస్తు చేసుకోవచ్చు . సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమలు తమ ఉత్పత్తి కార్యకలాపాలలో రకమైన లోపాలు , ప్రతికూల ప్రభావాలు లేకుండా విలువలను కాపాడతామని తమకు తాము నిర్ణయించుకోవడమే ఈ ప్రతిజ్ఞకు వెనుక అసలు కారణం . 

    * ఈ పథకం కింద సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలు సర్టిఫికేషన్ పొందితే కొన్ని రకాల సబ్సిడీలు పొందగలుగుతాయి . ఈ సబ్సిడీలు సూక్ష్మ పరిశ్రమలకు 80 శాతం , చిన్న పరిశ్రమలకు 60 శాతం , మధ్య తరహా పరిశ్రమలకు 50 శాతం లభిస్తాయి . 

    * ఈ సర్టిఫికేషన్ పథకం కింద సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు వివిధ కన్సల్టెన్సీ సేవలు , తదితరాల కోసం ఐదు లక్షల రూపాయల నిధిని అందుబాటులో ఉంచుతారు . వాటి సాయంతో ఈ సంస్థలు ఏ రకమైన లోపాలు , ప్రతికూల ప్రభావాలు లేకుండా తమ పారిశ్రామిక కార్యకలాపాలను పరిశుభ్రమైన పద్ధతిలో సాగించేలా సాయపడతారు . 

    * ఇంకా ఈ సర్టిఫికేషన్ కింద వివిధ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు , ఆర్థిక సం స్థలు అందుబాటులోకి తెచ్చిన ఇతర మినహాయింపులు , ప్రోత్సాహకాలను కూడా ఈ పరిశ్రమలు ఉపయోగించుకోవచ్చు . ' ఎంఎస్ఎంఈ కవచ్ ' పేరుతో కోవిడ్ 19 సహాయ కార్యక్రమం కింద ఉచితంగా సర్టిఫికేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు .

    పథకంలోని అంశాలు ::

    * పారిశ్రామిక చైతన్యం కలిగించడం , సంబంధిత కార్యక్రమాల వర్క్ షాపుల నిర్వహణ .

    * శిక్షణా కార్యక్రమాలు .

    * అంచనా వేయడం , సర్టిఫికేషన్ .

    * సమస్యలు తెలుసుకోవడం .

    * ప్రయోజనాలు , ప్రోత్సాహకాలు .

    * ప్రజా సంబంధాలు , ప్రచారం , ప్రకటనలు , బ్రాండ్ల ప్రచారం .

    * డిజిటల్ వేదికలు .

    ప్రయోజనాలు ::

    * జెడ్ఆస్ఈడీ సర్టిఫికేషన్ పొందడం ద్వారా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలు కాలుష్యాన్ని , వ్యర్థాలను బాగా తగ్గించుకుని , ఉత్పాదకత పెంచుకోగలుగుతాయి . వాతావరణ పరమైన చైతన్యాన్ని కూడా మెరుగు పరచుకోగలుగుతాయి . ఇంకా ఇంధనాన్ని ఆదా చేయడం , సహజ వనరులను అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవడం , మార్కెట్లు విస్తరించుకోవడం మొదలైన ప్రయోజనాలు పొందగలుగుతాయి . 

    జీరో డిఫెక్ట్ - జీరో ఎఫెక్ట్ ( జెడ్ ఈడీ ) పథకం ::

    * ఈ పథకాన్ని 2016 వ సంవత్సరంలో సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది . ఇది సమగ్ర , సమీకృత సర్టిఫికేషన్ వ్యవస్థతో కూడిన పథకం . 

    * దీని ద్వారా సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమల ఉత్పాదకత పెరగడం ; ప్రమాణాలు మెరుగు పడటం ; కాలుష్యం తగ్గడం ; ఇంధన సామర్థ్యం పెరగడం ; ఆర్థికాభివృద్ధి ; మానవ వనరుల అభివృద్ధి ; సాంకేతికతల స్థాయి పెరగడం ; మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ మొదలైనవన్నీ సాధ్యపడతాయి . భారత్లో జెడీ సంస్కృతి అభివృద్ధి చేయడానికి , అమలు చేయడానికి దీన్ని ప్రవేశపెట్టారు . 

    * జీరో డిఫెక్ట్ అంటే ఏ విధమైన లోపాలు లేకుండా వస్తువులు , సేవలను తయారు చేయడం . దీన్ని వినియోగదారులపై దృష్టి కేంద్రీకరించి రూపొందించారు . అంతే కాకుండా వ్యర్థాలు కూడా చాలా తక్కువగా ఉండే పద్ధతి . 

    * జీరో ఎఫెక్ట్ అంటే వాయు కాలుష్యం , జల కాలుష్యం , ఘన పదార్థాల కాలుష్యం వీలైనంత తక్కువగా ఉండేలా చూడడం . అంతే కాకుండా సహజ వనరుల వృధాను వీలైనంతగా అరికట్టడం . అంటే వాతావరణంపైన , పరిసరాలపైన అతి తక్కువ ప్రభావాలు ఉండేలా చూడడం . 

    * సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలలో లోపాలు లేకుండా , పర్యావరణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉత్పత్తి జరిగేలా ఆ వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం . 

    * సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలు మంచి ప్రమాణాలతో కూడిన వస్తువులను ఉత్పత్తి చేయడం ; అందుకోసం మంచి ప్రమాణాలు కలిగిన పరికరాలు , వ్యవస్థలు , ఇంధన సామర్థ్యం కలిగిన పద్ధతులు ఉపయోగించడం ; నిరంతరంగా తమ ఉత్పత్తుల ప్రమాణాలను , వినియోగించే పద్ధతుల ప్రమాణాలను పెంచుకుంటూ కొనసాగేలా చూడడం ఇతర లక్ష్యాలు . 

    * జెడ్ఆస్ఈడీ సర్టిఫికేషన్ రంగంలో వృత్తి నిపుణులను రూపొందించడం ; మేకిన్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కూడా ఈ పథకం ఆశయాలు . సూక్ష్మ , చిన్న , మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న ఇతర చర్యలు...

    1. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం .

    2. సాంప్రదాయక పరిశ్రమల పునర్నిర్మాణ నిధి పథకం .

    3. కొత్త ఆవిష్కరణలు , గ్రామీణ పరిశ్రమలు , వ్యాపారాలను ప్రోత్సహించే పథకం .

    4. సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు క్రమానుగత రుణాలు అందించి , వడ్డీలు తగ్గించే పథకం .

    5. సూక్ష్మ , చిన్న పరిశ్రమలకు రుణ గ్యారెంటీ పథకం .

    6. ఛాంపియన్స్ పోర్టల్

    Post a Comment (0)
    Previous Post Next Post