ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తన అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?

1. ఈ క్రింది వాటిని జతపరచండి ?
1. నిబంధన 324 ( ఎ ) ఆర్థిక సంఘం
2. నిబంధన 344 ( బి ) వెనుకబడిన వర్గాల కొరకు కమిషన్
3. నిబంధన 280 ( సి ) అధికార భాషా సంఘం
4. నిబంధన 340 ( డి ) ఎన్నికల సంఘం
1 . 1 - ఎ 2 - బి 3 - సి 4 - సి
2. 1 - డి 2 - సి 3 - ఎ 4 - బి
3. 1 - సి 2 - డి 3 - బి 4 - ఎ
4. 1 - బి 2 - ఎ 3 - డి 4 - సి

2. ఎన్నికల సంఘంలోని ఎన్నికల కమిషనర్ల సంఖ్య దీని ఆధారంగా రాష్ట్రపతి కాలానుగుణంగా ఎప్పుటికప్పుడు నిర్ణయించవచ్చు ?
1. ప్రధానమంత్రి సలహా
2. ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా
3. పార్లమెంట్ చేత చేయబడిన శాసనం
4. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సలహా

3. ఈ క్రింది ఎవరు సిఫారసు లేనిదే ఒక ఎన్నికల కమీషనరు పదవి నుండి తొలగించరాదు ?
1. ప్రధాన ఎన్నికల కమిషనర్
2. న్యాయ శాఖ మంత్రి
3. రాష్ట్రపతి
4. సుప్రీంకోర్టు

4. ఈ క్రింది వానిలో ఎన్నికల జాబితాను తయారు చేయు బాధ్యతను కలిగి ఉండునది ?
1. కేంద్ర ప్రభుత్వం
2. స్థానిక పరిపాలన
3. రాష్ట్ర ప్రభుత్వం
4. ఎన్నికల సంఘం

5. పార్లమెంట్లోని ఏదైనాసభకు చెందిన ఒక సభ్యుని అనర్హతకు సంబంధించిన వివాదంపై తన నిర్ణయాన్ని తెలిపే ముందుగా భారత రాష్ట్రపతి ఈ క్రింది వారిలో ఎవరి అభిప్రాయాన్ని తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది ?
1. ఎన్నికల సంఘం
2. భారత సోలిసిటర్ జనరల్
3. భారత అటార్నీ జనరల్
4. సుప్రీంకోర్టు

6. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ?
1. 6 సంవత్సరాలు
2. 4 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు , వీటిలో ఏది ముందు అయితే అది  .
5 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు , వీటిలో ఏది ముందు అయితే అది.

7. లోక్సభ ఎన్నికలలో ఈ క్రింది వారిలో ఎవరు ఎన్నికల కేంద్రంను బందీ చేయడం కారణంగా ఎన్నిక యొక్క వాయిదా లేదా ఎన్నికను ఉపసంహరణ చేయు ఆదేశాన్ని జారీ చేయగలరు ?
1. భారత ఎన్నికల సంఘం
2. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
3. ప్రధాన ఎన్నికల కమిషనర్
4. నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి

8 . ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ?
ఎ . ఎన్నికల సంఘంలోని ఎన్నికల కమిషనర్ల సంఖ్య రాష్ట్రపతిచే కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయించబడుతుంది .
బి . భారత రాజ్యాంగం యొక్క నిబంధనల ప్రకారం ఒక ప్రాంతీయ కమిషనర్ ఎక్కడైతే ఉద్యోగంలో ఉన్నాడో ఆ రాష్ట్ర గవర్నర్ సిఫారసు చేస్తే తప్ప అతడు పదవి నుండి తొలగించబడదు .
పై వివరణలలో ఏది / ఏవి సరైనవి.
1. ఎ మాత్రమే
2 . బి మాత్రమే
3. ఎ మరియు బి కూడా
4. ఎ కాదు మరియు బి కాదు

9 . ఈ క్రింది ఏ నిబంధన దేశంలో ఒక ఎన్నికల సంఘాన్ని ఏర్పరచాలని సూచించింది ?
1. 324 ( 5 ) నిబంధన
2. 324 ( 6 ) నిబంధన
3. 324 ( 4 ) నిబంధన
4. 324 ( 1 ) నిబంధన

10. కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు ఉండాలని సూచించిన కమిటీ ?
1. తార్కుండే కమిటీ
2. పాలనా సంస్కరణల సంఘం
3. దినేష్ గో స్వామి కమిటీ
4. జాతీయ న్యాయ కమిషన్

11. ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తన అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
1 . సెఫాలజీ
2 . హెమటాలజీ
3. ఫ్రినాలజీ
4. ఆంధ్రపాలజీ

12. మొదటి ప్రధాన ఎన్నికల కమిషన్ ఎవరు ( 1950 – 1958 ) వరకు ?
1. కె.వికె సుందరం
2. నాగేంద్ర సింగ్
3. సుకుమార్ సేన్
4. వి.ఎస్.పంత్

Answers ::

1 ) 2 , 2 ) 3 , 3 ) 1,4 ) 4 , 5 ) 1 , 6 ) 3 , 7 ) 1 , 8 ) 1 , 9 ) 4 , 10 ) 2 , 11 ) 1 , 12 ) 3

Post a Comment (0)
Previous Post Next Post