కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏది దాని యొక్క స్వంత హైకోర్టు కలిగి ఉంది ?

1 . ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రం యొక్క హైకోర్టు న్యాయాధికార పరిధిలో ఉంచినది క్రింది వానిలో ఏది / ఎవరు ?
1. భారత ప్రధాన న్యాయమూర్తి
2. భారత రాష్ట్రపతి
3. సంబంధిత కేంద్ర పాలిత ప్రాంతం పరిపాలకుడు
4. భారత పార్లమెంట్

2 . ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టాలలో ఏది ? ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేక హెూదా కల్పిస్తుంది మరియు , ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగం అని పునర్మామోదిష్టం చేసింది ?

1. 67 వ సవరణ చట్టం
2. 59 వ సవరణ చట్టం
3 . 3. 69 వ సవరణ చట్టం
4. 62 వ సవరణ చట్టం

3 . ఈ కింది వానిలో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏది దాని యొక్క స్వంత హైకోర్టు కలిగి ఉంది .
1. చంఢీగఢ్
2. పుదుచ్చేరి
3. లక్షద్వీప్
4. ఢిల్లీ

4. ఈ క్రింది వాటిలో ఏవి కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుకు గల కారణాలు ?
ఎ . సాంస్కృతిక విశిష్టత
బి . వెనుకబడిన ప్రజల యొక్క సంరక్షణ
సి . రాజకీయ & పరిపాలనా పర్యాలోచనలు
డి . గిరిజన ప్రజల యొక్క ప్రత్యేక ఆధరణ .
సరైన దానిని గుర్తించండి ?
1. ఎ.బి
2. బి.సి. & డి
3. ఎ , సి , డి
4. ఎ , బి , సి & డి

5. రాష్ట్రవతి ఈ ప్రాంతాల ప్రగతి , శాంతి మరియు సుపారిపలన కోసం నియమ నిబంధనలను చేయవచ్చు
ఎ . లక్షద్వీప్
బి . చంఢీగఢ్
సి . డామన్ & డయ్యు
డి . దాద్రా మరియు నగర్ హవేలీ
ఇ . అండమాన్ మరియు నికోబర్ దీవులు
ఈ కింది వాటిలో సరైనది గుర్తించండి ?
1. ఎ , బి
2. బి , సి
3. ఎ , బి , సి , డి
4. ఎ , సి , డి , ఇ

6 . పుదుచ్చేరి విషయంలో ఈ సందర్భంలో మాత్రమే భారత రాష్ట్రపతి నిబంధనల ద్వారా శాసనం చేయడగలరు ?
1. శాసన సభ దాని కొరకు తీర్మానాన్ని ఆమోదించనపుడు
2. లెఫ్టినెంట్ గవర్నర్ అతనిని ఆ విధంగా చేయమని అభ్యర్ధించినప్పుడు
3. పార్లమెంట్ దాని కొరకు ఒక తీర్మానాన్ని ఆమోదించినపుడు
4. శాసన సభ తాత్కాలికంగా రద్దు చేయబడినప్పుడు లేదా రద్దు చేయబడినప్పుడు

7. పార్ట్ ' సి ' మరియు పార్ట్ ' డి ' రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసినది ?
1. 14 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 7 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 16 వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 5 వ రాజ్యాంగ సవరణ చట్టం

8. ఈ కింది వానిని పరిశీలింపుము ?
ఎ . కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన కొరకు గల రాజ్యాంగ నిబంధనలు ఆర్జించిన ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి
బి . భారత రాజ్యాంగం ఆర్జించిన భూభాగాల పరిపాలన కొరకు ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉన్నది .
పై వాటిలో ఏది / ఏవి సరైనవి.
1. ఎ , మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ మరియు బి
4. ఏదీకాదు

9 . ఈ క్రింది వాటిని గమనించుము ?
ఎ . కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు పార్లమెంట్ 3 జాబితాల ( రాష్ట్ర జాబితాతో సమా ) లోని ఏ అంశంపైన అయిన శాసనలు చేయగలదు .
బి . ఒక కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకుడు భారత రాష్ట్రపతి యొక్క ప్రతినిధి కాని , గవర్నర్ వలె రాజాధినేత కాడు .
పై వానిలో ఏది / ఏవి సరైనవి.
1. ఎ మాత్రమే
2. ఎ మరియు బి
3. ఎ కాదు & బి కాదు
4. బి మాత్రమే 

Answers ::

1 ) 4 , 2 ) 3 , 3 ) 4,4 ) 4,5 ) 4 , 6 ) 4 , 7 ) 2 , 8 ) 1 , 9 ) 2

Post a Comment (0)
Previous Post Next Post