కేంద్ర ప్రభుత్వ కొత్త పధకం భారత గౌరవ పథకం.... పూర్తీ సమాచారం... నోట్స్

    భారత గౌరవ పథకం....

    2021 నవంబర్ మూడో వారంలో భారత రైల్వే శాఖ ' భారత్ గౌరవ్ ' పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది . దేశంలో పర్యాటక రంగంలో గల అవకాశాలను భారీ ఎత్తున ఉపయోగించుకునేందుకు ఈ పథకం కృషి చేస్తుంది .

    కీలకాంశాలు ::

    * ఈ పథకం ద్వారా రైల్వే శాఖలో ' పర్యాటకం ' పేరుతో ఒక కొత్త విభాగం ఏర్పాటైంది . ఇప్పటివరకు రైల్వే శాఖలో ప్రయాణికులు , సరకు రవాణా అనే రెండు విభాగాలు మాత్రమే ఉంటూ వచ్చాయి . తాజా పథకంతో పర్యాటక విభాగాన్ని కూడా అందులో చేర్చినట్లు అయింది . ఈ పర్యాటక విభాగంలో నడిపించనున్న రైళ్లు మామూలు రైళ్ల మాదిరిగా ఖచ్చితమైన కాల ప్రణాళికతో నడిచే తరహావి కావు . ప్రస్తుతం ఐఆర్సీటీసీ నడిపిస్తున్న ' రామాయణ ఎక్స్ప్రెస్ ' మాదిరిగా విభిన్నంగా ఉంటాయి .
    * పర్యాటక సర్క్యూట్ రైళ్ల పేరుతో ఈ కొత్త రైళ్లను నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించింది . వీటిని ఐఆర్సీటీసీ , ప్రైవేటు సంస్థలు కూడా ఆయా మార్గాల్లో నడుపుతాయి .
    * ఇవి ఒక ప్రత్యేక అంశం ఆధారంగా నడిచే రైళ్లుగా ఉంటాయి . అంటే ఒక ప్రత్యేక ప్రాంతం లేదా యాత్రా స్థలంతో సంబంధం కలిగి ఉండే రైళ్లు . ఉదాహరణకు ' గురుకృప ' రైలు అంటే గురునానక్ తో సంబంధం గల స్థలాలన్నింటికీ వెళుతుంది . ' రామాయణ ఎక్స్ప్రెస్ ' అంటే శ్రీరాముడి జీవిత చరిత్రకు సంబంధించిన స్థలాలన్నింటికీ ప్రయాణిస్తుంది .
    * వీటిని నడపడానికి ప్రైవేటు సొసైటీలు , ట్రస్టులు , కన్సార్టియంలు , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు . ఆయా ప్రత్యేక పర్యాటక ప్రాంతాలలో నడపడానికి ప్రణాళికను రూపొందించుకోవచ్చు . ఈ సేవలు అందించేందుకు ముందుకు వచ్చే సంస్థలు పర్యాటకులకు రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి , పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అవసరమైన ఇతర ఏర్పాట్లు , చారిత్రక , వారసత్వ స్థలాలకు రవాణా చేసే వాహనాలు , టూర్ గైడులు మొదలైన వాటన్నింటితో కూడిన ప్యాకేజీలను రూపొందించి ప్రయాణికులకు అందిస్తాయి .

    ఈ పథకం వల్ల ప్రయోజనాలు ::

    * భారత్లో గల సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని , అద్భుతమైన చారిత్రక స్థలాలను దేశంలోని ప్రజలందరికీ పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడానికి కూడా ఈ రైళ్లు ఉపయోగిస్తాయి . దేశంలో పర్యాటక రంగంలో ఉన్న అపరిమిత అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది . ఈ తరహా ఇతర పథకాలు
    1. స్వదేశ్ దర్శన్ పథకం
    2. ప్రసాద్ పథకం
    3. బౌద్ధ యాత్రా స్థలాల పథకం
    4. దేఖో అప్నా దేశ్ కార్యక్రమం

    భారత్లో పర్యాటకం ::

    * భారతదేశంలో పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా ముఖ్యమైన అంశం . ఇది ఇటీవల పలు సంవత్సరాలుగా వేగంగా పెరుగుతోంది . ప్రపంచ యాత్రా , పర్యాటక మండలి గణాంకాల ప్రకారం - 2020 వ సంవత్సరంలో భారత్లో యాత్రా , పర్యాటక పరిశ్రమ జీడీపీలో 121.9 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది . 2028 సంవత్సరానికి ఇది 512 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా .
    * మన దేశంలో పర్యాటక పరిశ్రమ జీడీపీకి నేరుగా అందించే సొమ్ము 2019-2028 మధ్యకాలంలో ఏడాదికి 10.35 శాతం చొప్పున పెరుగుతూ పోతుందని అంచనా వేశారు . యాత్రా పర్యాటక పోటీతత్వ నివేదిక -2019 ప్రకారం ప్రపంచంలోని మొత్తం 140 దేశాల జాబితాలో భారత్ స్థానం 34 గా ఉంది . అంటే పర్యాటక రంగంలో దేశం జరుపుతున్న కృషి సత్ఫలితాలు ఇస్తోందని భావించవచ్చు .

    విపత్తుల నిర్వహణపై అయిదవ ప్రపంచ కాంగ్రెస్ ::

    విపత్తుల నిర్వహణపై అయిదవ ప్రపంచ కాంగ్రెస్ 2021 నవంబర్ మూడవ వారంలో ఢిల్లీలో జరిగింది . దీనికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించి ప్రసంగించారు .
    * ఈ ప్రసంగంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏ రకం విపత్తులలో అయినా మొట్టమొదటగా ప్రతిస్పందించే దేశం భారత్ అని మళ్లీ మళ్లీ నిరూపితమవుతూ వస్తోందని పేర్కొన్నారు . ఇలా మొదటి ప్రతిస్పందనా దేశంగా భారత్ ఉండడం ప్రాంతీయంగా ఎదుగుతున్న భారత సామర్థ్యాలకు , నాయకత్వ పాత్రకు గుర్తింపు అని అభిప్రాయపడ్డారు .
    * హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భవిష్యత్ ప్రణాళికలతో కూడిన ' సాగర్ ' ( సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ) ప్రాంతీయంగా మన దేశ ప్రత్యేక దృష్టిని ప్రతిబింబించే కార్యక్రమం . ఇందులో ఇటు దేశీయ ప్రయోజనాలు , అటు ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి . అవి...
    1. హిందూ మహా సముద్ర తీర దేశాల మధ్య ఆర్థిక , భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం
    2. భూ , సముద్ర ప్రాంతాలను పరిరక్షించేందుకు సామర్థ్యాలను పెంపొందించడం
    3. సుస్థిరమైన ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయడం
    4. నీలి ఆర్థిక వ్యవస్థను ఉమ్మడిగా ప్రోత్సహించడం
    5. ప్రకృతి సహజమైవి కాకుండా సాంప్రదాయేతర విపత్తులు , అంటే సముద్ర దొంగలు , తీవ్రవాదం మొదలైన వాటి కోసం ఉమ్మడిగా కృషి చేయడం .

    * హిందూ మహా సముద్రంలో భారత్కు గల ప్రత్యేక స్థానం వల్లే కాకుండా మన దేశానికి గల సాయుధ దళాల సామర్థ్యాల కారణంగా విపత్తుల ప్రతిస్పందన , కూడా ఉపశమన కార్యక్రమాలు , మానవతా సాయం అవసరమైన సమయాలలో మన దేశం వెంటనే గణనీ యంగా సాయం అందించ గలుగు తోంది .
    * ప్రాంతీయంగా , అంతర్జాతీయంగా విపత్తులు , సంక్షోభాల సమయంలో నివారణకు , నిర్వహణకు , ఉప శమన చర్యలకు భారత్ తమ అన్ని రకాల వనరులను అంది స్తూ , అంతర్జాతీయ స్థాయిలో బాధ్యతాయుతమైన పాత్ర పోషి స్తోంది .
    * భౌగోళిక రాజకీయ అంశాలు , కోవిడ్ 19 , తదితర సాంప్రదాయ , సాంప్రదాయేతర సంక్షోభాలు , సవాళ్ల సమయంలో భారత్ ముందంజె వేసి నాయకత్వ స్థానంలో నిలుస్తూ వస్తోంది . పొరుగున ఉన్నవే కాకుండా అంతర్జాతీయంగా చిన్నవైన దేశాలకు అవసరమైన విధంగా సాయం అందిస్తోంది .

    మొదటి ప్రతిస్పందనా దేశంగా కృషి ::

    * విపత్తుల నిర్వహణ , ఉపశమనం , సంక్షోభాల సమయంలో సంసిద్ధంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వివిధ దేశాలతో కలిసి సముద్రంలోనూ , వెలుపలా నావికా , వైమానిక విన్యాసాలు జరుపుతూ వస్తోంది .
    * పొరుగు దేశాలతో సంబంధిత సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం , సామ ర్ధ్యాల పెంపు కోసం కృషి చేయడం జరుగుతున్నాయి . 2004 సునామీ సమయంలోనూ , 2015 నేపాల్ భూకంప సమయంలోనూ భారత్ వాటి వల్ల ప్రభావితమైన దేశాలకు తక్షణ సాయం అందించడంలో కీలక పాత్ర పోషించింది .
    * దేశంలో బలమైన విపత్తుల నివారణా , నియంత్రణా , ఉపశమన నైపుణ్యా లు కలిగిన సంస్థలు , బృందాలను ఏర్పాటు చేస్తోంది . ఇందుకోసం 2016 వ సంవత్సరంలో విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం కోసం ఒక కూటమి ( కోలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీడీఆర్ ) ఏర్పాటును ఢిల్లీలో విపత్తుల ప్రమాదాల తగ్గింపుపై జరిగిన ఆసియా మంత్రిత్వ సమావేశంలో ప్రతిపాదించింది .

    సాంప్రదాయేతర విపత్తులు ::

    * 2008 వ సంవత్సరంలో గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ప్రాంతంలో సముద్ర దొంగల ను ఎదుర్కొనేందుకు మన దేశం 30 నౌకలను మోహరించింది . వాటి సాయంతో ఆ ప్రాంతం గుండా 1500 లకి పైగా రవాణా నౌకలు సురక్షితంగా వెళ్లేలా సాయపడింది .
    * ఈ ప్రాంతంలో ఘర్షణల అనంతరం ఉపశమనం , పునరావాసాలకు కూ డా మన దేశం ఎంతగానో సాయపడుతూ వస్తోంది . ప్రాంతీయంగా ఘర్ష ణల అనంతరం ఆయా దేశాలకు నిపుణులను పంపడం , నిధులు అందిం చడం వంటి వాటికి ముందు ఉంటోంది . ఇందుకు ఉదాహరణలుగా శ్రీలంక , ఆఫ్ఘనిస్తాన్ కు అందించిన సాయం గురించి చెప్పుకోవచ్చు .
    * విపత్తులను ఎదుర్కొనే అంశంలో అంతరిక్ష , కమ్యూనికేషన్ , జీవ ఇంజనీ రింగ్ , వైద్య , కృత్రిమ మేధస్సు రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మరింత సమర్థ ' వంతంగా పని చేసే అవకాశం లభిస్తుంది.
    * కోవిడ్ 19 సంక్షోభం తర్వాత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు జరుగుతున్న కృషిపై సమీక్ష జరిపి పునరాలోచన చేయ వలసి ఉంటుంది . ఆ లక్ష్యాల సాధనకు అంతర్జాతీయ , దేశీయ స్థాయిలో కొత్త వ్యూహాలను అమలు చేయవలసి ఉంది .
    * హిందూ మహా సముద్ర ప్రాంతంలో మొట్టమొదటి ప్రతిస్పందనా దేశంగా మన స్థానాన్ని లోతుగా అధ్యయనం చేసి మరింత ప్రోత్సాహం అందించవలసి ఉంది . అందుకోసం అవసరమైన వనరులు , సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కృషిని పెంచే అవకాశాలు ఉన్నాయి .

    విపత్తుల నిర్వహణపై ప్రపంచ కాంగ్రెస్ ::

    * ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి విప త్తుల నిర్వహణా కార్యక్రమాలకు సంబంధించిన పరిశోధ కులు , విధానకర్తలు , కార్యకర్తలు , తదితరులను ఒకే వేదికపై సమావేశపరిచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు . వీరంతా ఒక వేదికపై విపత్తులకు సంబంధించిన వివిధ సమస్యలు , సవాళ్లు , నిర్వహణ , తదితర అంశాల గురించి చర్చిస్తారు .
    * విపత్తులు , ప్రమాదాల గురించి మరింత లోతుగా అర్థం చేసుకుని , ముందస్తు హెచ్చరికలు , ప్రణాళికలు , ఇతర చర్యలు తీసుకో వడం ; విపత్తులను తట్టుకునే విధమైన మౌలిక వసతులు . ఏర్పాటు చేయడం మొదలైన వాటిని ప్రోత్స హించడం ఈ సమావేశ ప్రధాన లక్ష్యం .

    Post a Comment (0)
    Previous Post Next Post