భారత ప్రభుత్వం ప్రారంభించిన నది నగరాల కూటమి వేదిక నోట్స్...

    నవంబర్ నెలాఖరులో భారత జలశక్తి మంత్రిత్వ శాఖ , గృహ , నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కలిసి ' నదీ నగరాల కూటమి ' పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశాయి . భారత్లో నదీ తీరాల్లో ఉన్న నగరాల్లో నదుల సుస్థిర నిర్వహణకు సంబంధించి వివిధ ఆలోచనలు , కొత్త భావనల గురించి పరస్పరం చర్చలు జరుపుకుని , సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం కోసం ఏర్పాటైన ప్రత్యేక వేదిక ఇది . 

    * ఈ కూటమి ప్రధానంగా మూడు స్థూలమైన అంశాల మీద దృష్టి కేంద్రీకరి స్తుంది . అవి- నెట్ వర్కింగ్ , సామర్థ్యాల పెంపు , సాంకేతిక సహాయం . 

    * ఈ కూటమిలోని సభ్య నగరాల పేర్లు - డెహ్రాడూన్ , హరిద్వార్ , రిషీకేశ్ , శ్రీనగర్ , బెగుసరాయ్ , భగల్పూర్ , ముంగేర్ , పాట్నా , బరంపురం , హుగ్లీ - చిన్సురా , హౌరా , జంగీపూర్ , మహెస్థల , రాజమహల్ , సాహిబ్ గంజ్ , అయోధ్య , బిజ్నూర్ , ఫరుఖాబాద్ , కాన్పూర్ , మధుర , బృందావనం , మీర్జాపూర్ , ప్రయాగరాజ్ , వారణాసి , ఔరంగాబాద్ , చెన్నై , భువనేశ్వర్ , హైదరాబాద్ , పూనా , ఉదయపూర్ , విజయవాడ . 

    * నదీ నగరాల కూటమి ప్రారంభించేందుకు ' పరిశుభ్ర గంగ జాతీయ మిషన్ ' , ' నగర వ్యవహారాల జాతీయ సంస్థ ' కూడా సమన్వయంగా కలిసి పని చేశాయి . 

    * ఈ కూటమి ప్రధాన లక్ష్యాలు ఇందులోని నగరాలలో ఉన్న నదుల సుస్థిర నిర్వహణ ; అందుకోసం అత్యవసరమైన సమాచారాన్ని పరస్పర మార్పిడి చేసుకోవడం , సమస్యలపై చర్చలు జరపడానికి ఇది వేదికగా పని చేస్తుంది . 

    * ఇంకా - నదీ సంబంధిత అంశాలు , సంబంధిత జాతీయ విధానాలు , ఇతర అవసరమైన కార్యక్రమాలను స్థానికంగా ఉపయోగించుకోవడానికి కలిసి పని చేయడం మరో లక్ష్యం . 

    * నగరాలలోని నదుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి , ఆ నగరాలకు ప్రత్యేకమైన రంగాలవారీ వ్యూహాలను అభివృద్ధి చేయడం ; తద్వారా సుస్థిరమైన నదుల నిర్వహణకు నగరాలను సంసిద్ధం చేయడం తదితర లక్ష్యా దీనికి ఉన్నాయి . 

    ఈ వేదిక అవసరం ఏమిటి? 

    * ఈ వేదిక ద్వారా వివిధ నగరాలకు తమ ప్రాంతాల్లోని నదులకు సంబం ధించిన విజయాలు , వైఫల్యాలు , ప్రజలకు వాటితో సంబంధాలు మొదలై న వాటి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది . నగర యంత్రాంగాల కు అక్కడ ప్రవహించే నదులకు సంబంధించిన అంశాలలో కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది . తద్వారా ఆ నదీ బేసిన్లలో నివసించే ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వాటిని అనుసరించే అవకాశం లభిస్తుంది . 

    * మున్సిపాలిటీల పాలనా యంత్రాంగాలు నదులకు సంబంధించిన సరికొత్త కార్యక్రమాల గురించి తెలుసుకోవడం , పరస్పర స్ఫూర్తిని అందించుకోవడం మొదలైన వాటికి ; నదులకు సంబంధించి ఆయా నగరాలు పాలనా అంశాలను బలోపేతం చేసుకునే అవకాశం ; తద్వారా వాటిలో జీవన పరిస్థితులు మెరుగై బయట నుంచి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించే అవకాశం పెరుగుతాయి . 

    * నగరాలలోని నదుల పునరుద్ధరణలో ఆయా నగరాల పాలనా యంత్రాం గం , ప్రజలు బాధ్యతగా ఉండాలి . వీటిని తప్పనిసరిగా నిర్వహించాలనే ఉద్దేశంతో కాకుండా అభివృద్ధి కార్యక్రమంగా భావిస్తూ పని చేయాలి . నగరాలలో జల వలయం , పర్యావరణ పరిస్థితులు మెరుగుపరచడం మొదలైన వాటి దృష్టితో సమీకృత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించ వలసిన అవసరం ఉంది . 

    * ప్రస్తుతం అన్ని ప్రాంతాలలోనూ నదుల పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం - నగరాలలోని ప్రజలు , పాలనా యంత్రాంగాల వైఖరి . అందుకే వాటి పునరుద్ధరణ కార్యక్రమాలలో కూడా వారే కీలకపాత్ర పోషించడం అవసరం . నగర నిర్మాణాల ప్రణాళికలు రూపొందించే సమయంలో అక్కడ ఉన్న నదులకు సంబంధించి సున్నితమైన వైఖరి అవలంబించాల్సిన అవసరాన్ని అందరికీ తెలియజేసి చైతన్య పరచవలసి ఉంది . 

    ఈ తరహా ఇతర కార్యక్రమాలు ::

    1. నమామి గంగ కార్యక్రమం : జాతీయ నది అయిన గంగ పరిరక్షణ , పునరుద్ధరణల కోసం అందులోని కాలుష్యాన్ని సమర్ధవంతంగా తొలగించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సమీకృత పరిరక్షణా కార్యక్రమం . 

    2. గంగా కార్యాచరణ ప్రణాళిక : భారత అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ 1985 వ సంవత్సరంలో మొట్టమొదటగా ప్రారంభించిన నదీ కార్యాచరణ ప్రణాళిక ఇది . గంగా నదిలోకి గృహ వ్యర్థాలు , పారిశ్రామిక వ్యర్ధాలు ఎక్కువగా చేరకుండా ఆపడం ; వాటిని మళ్లించడం , శుద్ధి చేయడం ; తద్వారా నదిలోని నీటి ప్రమాణాలను పెంచడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు . 

    3. జాతీయ నది గంగా బేసిన్ అథారిటీ : దీన్ని భారత ప్రభుత్వం 2009 వ సంవత్సరంలో వాతావరణ పరిరక్షణ చట్టం - 1986 లోని మూడవ సెక్షన్ కింద ఏర్పాటు చేసింది . 

    4. పరిశుభ్ర గంగా నిధి : గంగా నదిని పరిశుభ్రం చేసేందుకు వ్యర్ధ జలాల పరిశుద్ధ కేంద్రాల ఏర్పాటు ; నదిలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం మొదలైన లక్ష్యాలతో 2014 లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు . 

    5. భువన్ - గంగ వెబ్ అప్లికేషన్ : గంగానదిలోకి ప్రవేశించే కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం , ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చూడడానికి దీన్ని ఏర్పాటు చేశారు . 

    6. వ్యర్థాలను పారవేయడంపై నిషేధం : 2017 వ సంవత్సరంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ గంగానదిలో ఏ రకమైన వ్యర్థాలను పారవేయకుండా నిషేధం విధించింది .

    Post a Comment (0)
    Previous Post Next Post