కేంద్ర ప్రభుత్వం కొత్త ఓం స్మార్ట్ పథకం పూర్తీ విశ్లేషణ (కరెంట్ అఫైర్స్ నోట్స్)

సముద్ర సంబంధిత సేవలు , మోడలింగ్ , అనువర్తనం , వనరులు , సాంకేతికతల పథకం ( ఓషన్ సర్వీసెస్ , మోడలింగ్ , అప్లికేషన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ లేదా ఓ స్మార్ట్ ) పేరు గల పథకాన్ని 2021-26 మధ్య కాలంలో కొనసాగించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ 2021 నవంబర్ 4 వ వారంలో ఆమోదం తెలిపింది . ఇది సముద్రాలలో పరిశోధనలు , ముందస్తు వాతావరణ హెచ్చరికల వ్యవస్థల ఏర్పాటు మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ప్రభుత్వ పథకం .
* దీన్ని 2018 ఆగస్టులో ప్రారంభించారు . సముద్ర సంబంధిత అభివృద్ధి కార్యకలాపాలు , సాంకేతికతలు , సేవలు , వనరులు , శాస్త్రీయ ' విజ్ఞానం , అధ్యయనాలు మొదలైన వాటిని పెం పొందించడం ; నీలి ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు , అంశాలకు సంబంధించిన కార్యక్ర మాలు అమలు చేయడం ; వాటికి అవసరమైన సాంకేతిక సహాయం అందించడం లక్ష్యాలుగా దీన్ని ప్రారంభించారు .
* ఇందులో ఏడు ఉప పథకాలు ఉన్నాయి . వాటిని కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వశాఖ కింద ఉన్న వివిధ స్వయంప్రతిపత్తి గల సంస్థలు అమలు జరుపుతున్నాయి . ఆ ఉప పథకాలు సముద్ర సాంకేతికతలు ( ఓషన్ - టెక్నాలజీ ) ; ఓషన్ మోడలింగ్ , సంబంధిత సేవలు ( ఓషన్ మోడలింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ) ; సముద్ర పరిశీలక నెట్వర్క్ ( ఓషన్ సర్వీసెస్ ) ; సముద్ర పరిశీలక నెట్వర్క్ ( ఓషన్ అబ్జర్వేషన్ నెట్వర్క్ ) ; సముద్రంలో జీవేతర వనరులు ( ఓషన్ నాన్ లివింగ్ రిసోర్సెస్ ) సముద్రంలో జీవ వనరులు , వాటి పర్యావరణ వ్యవస్థలు ( మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ) ; తీరప్రాంత పరిశోధనలు , నిర్వహణ ( కోస్టల్ రీసెర్చ్ అండ్ ఆపరేషన్ ) , పరిశోధక వాహనాలు లేదా నౌకల నిర్వహణ ( మెయింటెనెన్స్ ఆఫ్ రీసెర్చ్ వెస్సల్స్ ) .

ఓ - స్మార్ట్ పథకం లక్ష్యాలు ::

* భారత ప్రత్యేక ఆర్థిక మండలంలో ఉన్న సముద్రాలలోని జీవవనరులకు , వాటి చుట్టూ ఉన్న వాతావరణంతో వాటి సంబంధాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తయారు చేయడం .
* దేశంలోని తీర ప్రాంత జలాలలో ఆరోగ్య రక్షణ అంచనాల కోసం క్రమం తప్పకుండా సముద్ర జలాల్లో కాలుష్యాల స్థాయిని పర్య వేక్షించడం ; తీర ప్రాంతాలలో సహజమైన , మానవ కార్యకలాపాల వల్ల వచ్చే మార్పుల కారణంగా అక్కడ నేల కొట్టుకు పోవడాన్ని అంచనా వేసే ' తీర ప్రాంత మ్యాప్లను రూపొందించడం .
* భారత్కు చుట్టుపక్కల గల సముద్రజలాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటందుకు అత్యాధునిక సముద్ర పరిశీలక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ; సముద్ర సాంకేతికతల సంబంధిత కార్యకలా పాలను పరీక్షించడంలో సాయపడడం .
* ఆ తరహా సమాచారం అవసరమైన వినియోగ దారులకు అనుగుణంగా సముద్ర సంబంధిత సమాచారాన్ని , సలహాలను , హెచ్చరికలను , డేటాను ఉత్పత్తి చేయడం ; దాన్ని సమాజ ప్రయోజనాల దృష్ట్యా సరఫరా చేయడం .
* సముద్రంలో వాతావరణం గురించి ముందస్తు హెచ్చరికలు , పునర్ విశ్లేషణా వ్యవస్థలను అత్యంత కచ్చితత్వంతో అభివృద్ధి చేయడం .
* సముద్ర సంబంధిత పరిశోధనల కోసం ఉపగ్రహాలు అందించే సమాచారం ద్వారా గణాంకాలు అభివృద్ధి చేయడం ; తీరప్రాంత పరిశోధనలలో మార్పులను పర్యవేక్షించడం .
* తీరప్రాంత కాలుష్యాన్ని , వివిధ సముద్రగర్భ ప్రాజెక్టులు , సాంకేతిక ప్రదర్శనలు మొదలైన వాటి నిర్వహణ కోసం తీర ప్రాంత పరిశోధనా నౌకలను ఏర్పాటు చేసి , వాటి నిర్వహణకు సాయపడడం .
* సముద్రంలోని జీవ వనరుల వివరాలు తెలుసు కునేందుకు కొత్త సాంకేతికతల అభివృద్ధి ; మంచినీరు , సముద్రంలోంచి విద్యుత్ ఉత్పత్తి కోసం సాంకేతికతల అభివృద్ధి ; సముద్రగర్భం లో తిరిగే వాహనాల సాంకేతికతల అభివృద్ధి .
* బల్లాస్ట్ జలశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం . సముద్రంలో ఒక చోటి నుండి మరొక చోటికి ప్రయాణించే రవాణా నౌకలు ఒక ప్రాంతం లోని సముద్ర జలాలను వేరే ప్రాంతాలకు తీసుకుపోయి బల్లాస్ట్ జలాలుగా అక్కడ వదిలి పెట్టడం వల్ల ఆ ప్రాంతాలలో కొత్త సముద్ర జీవజాతులను ప్రవేశపెట్టడం జరుగుతోంది .
* అక్కడ ఆ కొత్త జాతులు విస్తృతంగా వ్యాపించి అక్కడి సముద్ర పర్యావరణ వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయి . దీన్ని నిరోధించడానికి వదిలిపెట్టే బల్లాస్ట్ జలాలను ఎక్కడికక్కడ నౌకలు పరిశుభ్రం చేసే కేంద్రాలు ఏర్పాటు చేయడం అవసరం . ఈ పథకం కింద వాటి ఏర్పాటుకు కృషి జరుగుతుంది .
* హిందూ మహా సముద్ర బేసిన్లో ఐక్యరాజ్య సమితి భారత్కు 75,000 చ.కి.మీ. వైశాల్యం గల ప్రాంతాన్ని పాలీ మెటా నాడ్యూల్స్ తవ్వకాల కోసం కేటాయించింది . అక్కడ వీటి కోసం సముద్రగర్భంలో 5500 మీటర్ల లోతు లో తవ్వకాలు జరిపి గ్యాస్ హైడ్రేట్ల కోసం అన్వేషణలు జరిపే కార్యక్రమాలు కూడా ఈ పథకం కింద నిర్వహిస్తారు . ఈ కార్యక్రమం భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగినది . అంతర్జాతీయంగా సముద్ర రంగంలో భారత సామర్థ్యాల పెంపునకు కూడా ఇది సాయ పడుతుంది .
* నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగంగా సము ద్ర వనరులను సుస్థిర పద్ధతిలో , సమర్థవం తంగా ఉపయోగించుకునేందుకు ఈ పథకం అవకాశాలు కల్పిస్తుంది . తద్వారా ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 14 వ లక్ష్యం సాధనకు మార్గం సుగమం చేస్తుంది .
* సముద్రాలలో సంభవించే విపత్తులు అంటే తుపాన్లు , సునామీలు తదితరాల కోసం ముం దస్తు హెచ్చరికలు అందించేందుకు అత్యాధు నిక వ్యవస్థలు గల ' భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రాన్ని ( ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లేదా ఇన్కాయిస్ ) ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు .

Post a Comment (0)
Previous Post Next Post