భారత అటవీ సంపద ముఖ్యమైన అంశాలు... నోట్స్...

    మడ అడవుల ::

    * నదీ ముఖద్వారాలు , ఉప్పునీటి కయ్యలు ఉన్న ప్రాంతాలలో , అధిక లవణీయత గల ప్రాంతాలలో పెరుగుతాయి .

    * పశ్చిమబెంగాల్లోని టైడల్ అడవులకు సుందర్బన్ వనాలు అని పేరు రావడానికి కారణం అక్కడ విస్తరించి ఉన్న సుంద్రి వృక్షాలే .

    * మన దేశంలో అధికంగా మడ అడవులు గల రాష్ట్రం - పశ్చిమబెంగాల్ .

    * మన దేశంలో మడ అడవులు అధికంగా విస్తరించిన ప్రాంతాలు సుందర్బన్స్ తరువాత బిత్తర కనిక .

    * ప్రపంచంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న ఖండం - ఆసియా ఖండం ( 42 % )

    మడ అడవుల ఉపయోగాలు ::

    1. సముద్ర క్రమక్షయ నివారణ
    2. తుఫాన్ , సునామీ ప్రభావాన్ని తగ్గిస్తాయి
    3. మడ అడవులు జీవవైవిధ్య కేంద్రాలు

    * ఖండ ఆవరణానికి , సముద్ర ఆవరణానికి మధ్య పోషకాల మార్పిడిలో సంధాన సేతువుగా పనిచేస్తాయి .

    చిత్తడి నేలలు ( Wetlands ) ::

    * చిత్తడినేలలు పరివర్తన ఆవరణ వ్యవస్థలు

    * ఇవి నీరు , భూమితో కలిసే ప్రదేశంలో ఏర్పడును .

    * ప్రకృతి వనరులను దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చెప్పవచ్చు . ప్రకృతి వనరులు రెండు రకాలు . అవి :
    1. పునరుత్పత్తి వనరులు  2. పునరుత్పత్తి చెందని వనరులు

    * పునరుత్పత్తి వనరులు : ప్రకృతి వనరులలో వినియోగించుకున్న కొలదీ తరిగిపోయి మరల ప్రకృతిచే భర్తీ చేయబడ వనరులు : కొన్నింటిని తాయి . ఇటువంటి వనరులను పునరుత్పత్తి వనరులు అంటారు . ఉదా : గాలి , నీరు , అటవీ సంపద .

    * పునరుత్పత్తి చెందని వనరులు : ప్రకృతి వనరులలో కొన్ని వినియోగించిన కొలదీ తరిగిపోయి , పునరుత్పత్తికావు . వీటిని పునరుత్పత్తి చెందని వనరులు అంటారు . ఉదా : బొగ్గు , చమురు , ఇంధన వాయువులు మొదలైనవి .

    అటవీ సంపద ( Forest Resources ) ::

    * ప్రబలంగా వృక్షాలు , దృఢమైన కలపయుత వృక్ష సముదాయం విస్తృతంగా గల ప్రదేశాన్ని అడవి అంటారు .

    * Forest అను పదం ' Foris ' అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది . Foris అనగా వెలుపలి ప్రదేశం .

    * ప్రకృతి మానవాళికి , సమస్త ప్రాణులకు అందించిన వరప్రసాదం అడవులు . అంతు లేని ఖజానాతో మానవులకే కాకుండా సమస్త జీవరాశికి ఆశ్రయమిచ్చింది అడవులే . మన భారతీయ సంస్కృతిలో ఆరాధనీయమైనది అడవి .

    * National Forest Policy - 1952 ప్రకారం భూవిస్తీర్ణంలో 33 % అడవులు ఉండాలి . కాని మన దేశంలో 21.71 % మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి .

    * 1900 సంవత్సరం నాటికి ప్రపంచంలో 700 కోట్ల హెక్టార్ల అడవులు విస్తరించి ఉండేవి . ప్రస్తుతం అవి సుమారు 237 కోట్ల హెక్టార్లకు తగ్గిపోయింది . అడవుల వల్లనే పర్యావరణం పరిరక్షించబడుతుంది . కిరణజన్య ' సంయోగ క్రియ ద్వారా చెట్లు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను వదిలిపెడతాయి .

    * అడవులు మేఘాలను ఆకర్షిస్తాయి . అడవుల చల్లదనానికి మేఘాలు సాంద్రీకరించి వర్షిస్తాయి . అడవులు వల్ల నేల కోతకు గురికాకుండా నేల సారవంతాన్ని కాపాడుటనే Soil Conservation ( భూసార పరిరక్షణ ) అంటారు .

    * ప్రస్తుతం అడవుల విస్తీర్ణం దృష్ట్యా భారత్ ప్రపంచంలో 10 వ స్థానంలో ఉంది . భారతదేశంలో అడవులను వర్షపాతం ఆధారంగా వర్గీకరిస్తారు . అవి :

    1. సతత హరిత అరణ్యాలు ( Tropical Evergreen Forest ) : వీటిలో 200 సెం.మీ. వర్షపాతం , 900 మీ . కంటే ఎక్కువ ఎత్తుగల ప్రదేశాలలో పెరుగుతాయి . ఇక్కడ నాణ్యమైన , దృఢమైన కలప లభిస్తుంది . ఈ అడవుల్లో జీవవైవిధ్యత అధికంగా ఉంటుంది . ఇవి ముఖ్యంగా పశ్చిమ కనుమలు , దక్షిణ హిమాలయ ప్రాంతం , అస్సోం , పశ్చిమబెంగాల్ , అండమాన్ నికోబార్ దీవుల్లో మరియు ఈశాన్య భారత్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి .

    2. ఆకురాల్చే అడవులు ( లేదా ) ఋతుపవన అడవులు ( Monsoon ( or ) Decid - uous Forests ) : ఇవి ముఖ్యంగా 100-200 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు పెరుగుతాయి . ఈ అడవులలోని కలప గట్టిదనం కలిగి ఉంటుంది . ఈ అడవుల్లో చెట్లు వెడల్పు ఆకులను కలిగి శీతాకాలానికి ముందు వేసవి కాలంలో ఆకులను రాల్చుతాయి . ఇవి ముఖ్యంగా మధ్యప్రదేశ్ , ఒడిశా , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ , కర్ణాటక , తమిళనాడు మరియు మహారాష్ట్రల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి .

    3. పర్వత అరణ్యాలు ( Mountain Forests ) : ఇవి ముఖ్యంగా 120 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతంలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి . ఇవి ఎక్కువ ఎత్తులో పెరుగుతాయి . వీటి విస్తరణ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని నీలగిరి , దొడబెట్ట , అన్నైముడి , పర్వత ప్రాంతాలు మరియు హిమాలయాలలో విస్తరించి ఉన్నాయి .

    4. చిట్టడవులు ( Bushes ) : ఈ అడవులు 50 సెం.మీ. - 100 సెం.మీ. వర్షపాత ప్రాంతాలలో పెరుగును . ముఖ్యంగా రాజస్థాన్ , గుజరాత్ , కర్ణాటక , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి .

    5. మాంగ్రూన్ అడవులు : నదీ ముఖ ద్వారాలు , ఉప్పునీటి కయ్యలు ఉన్న ప్రాంతాలలో అధిక లవణీయత గల ప్రాంతాలలో పెరుగుతాయి .

    * అడవుల నిర్మూలనను పూర్తిగా నిషేధించిన తొలి దేశం నార్వే . + 1952 లో అడవుల సంరక్షణకు భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని తీసుకొచ్చింది . దీని ప్రకారం 33.3 % . అడవుల విస్తీర్ణం ఉండాలి . దీనిని 1988 లో సవరించింది . " .

    * భారత ప్రభుత్వం 1954 లో UNDP ఆధ్వర్యంలో చంద్రాపూర్ , నైనిటాల్లో వనీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది .

    * భారత ప్రభుత్వం 5 వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా సామాజిక అడవుల పెంపకాన్ని చేపట్టారు . దీని కొరకు 1978 లో సామాజిక అడవుల చట్టం చేయబడింది .

    * భారత ప్రభుత్వం 1980 లో అటవీ సంరక్షణ చట్టం చేసింది .

    * 10 వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 25 % అటవీ విస్తీర్ణం లక్ష్యంతో నేషనల్ ఎపారెస్టేషన్ ప్రోగ్రామ్ని భారత ప్రభుత్వం చేపట్టింది . దీనిలో భాగంగా నేషనల్ ఎపారెస్టేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్ బోర్డు ‘ ( NAEB ) ని 1992 లో ఏర్పాటు చేశారు .

    * రానున్న 20 సంవత్సరాలలో అటవీ విస్తీర్ణం యొక్క శాతాన్ని 33.3 % పెంచాలనే లక్ష్యంతో 1999 లో నేషనల్ ఫారెస్టు యాక్షన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది .

    * అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాలకు వాడాలంటే కేంద్ర పర్యావరణ , అటవీ మరియు శీతోష్ణస్థితి మార్పుల మంత్రిత్వశాఖ అనుమతి తప్పనిసరి .

    * అడవుల ప్రాధాన్యతను , ఆ అడవులలో బిర్సాముండా యొక్క పోరాటాన్ని చిత్రించి మహాశ్వేతాదేవి రాసిన పుస్తకం అరణ్యేర్ అధికార్ .

    * కేంద్ర ప్రభుత్వం 2016 లో CAMPA ( Compensatory Afforestution Fund_Management and lanning Authority ) చట్టాన్ని తీసుకురావడం జరిగింది .

    * CAMPA లో భాగంగా అటవీ భూమిని వాడుకునే డెవలపర్స్ డబ్బు చెల్లిస్తారు . ఈ డబ్బును అటవీయేతర భూములలో అడవులను పెంచడానికి వాడతారు .

    * మియావాకీ పద్ధతి ( Miyawaki Method ) : ఇది జపాన్లో కనబడే అటవీకరణ ( Afforestration ) పద్ధతి . దీనిలో స్థానిక మొక్కలను గుర్తించి నాలుగు వరుసలుగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుస్తారు . అవి పొదలు , చిన్న వృక్షాలు , పెద్ద వృక్షాలు మరియు వృక్ష ఛత్రం ( Canopy )

    * ప్రపంచంలో మొత్తం అటవీ విస్తీర్ణం- 31 %

    * భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం - 24.71 %

    * తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం - 94.05

    * ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు 1. రష్యా , 2. బ్రెజిల్ , 3. కెనడా

    * ప్రతి మెట్రో నగరంలో పచ్చదనం 16 % ఉండాలి .

    * అత్యధికంగా మొత్తం భారతదేశంలో విస్తరించిన అడవులు ఆకురాల్చు అడవులు .

    అటవీ సంబంధిత చట్టాలు మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ::

    * ఆర్టికల్ -21 ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించాలి ( అందులో అడవి సంబంధిత అంశాలు ఉన్నాయి ) ఆర్టికల్ -48 ఎ - ఆదేశిక సూత్రాలలో ప్రభుత్వాలు అడవి సంపద గురించి చెప్పడం జరిగింది .

    * ఆర్టికల్ -51 ఎ- ప్రాథమిక విధులలో కూడా అటవి గురించి రాజ్యాంగంలో పొందు పరిచారు .

    * భారత అడవుల చట్టం - 1927

    * అటవీ సంరక్షణ చట్టం - 1980

    * గిరిజన అటవీ హక్కుల చట్టం -2006

    * గట్టి కలపను ఇచ్చే అరణ్యాలు- సతత హరిత అరణ్యాలు

    * మెత్తని కలపను ఇచ్చే అరణ్యాలు- శృంగాకార అరణ్యాలు

    * వంట చెరుకుకు ప్రసిద్ధి గాంచిన అరణ్యాలు - ముళ్ల / చిట్టడవులు .

    * వాణిజ్య పరంగా ప్రసిద్ధి గాంచిన అరణ్యాలు ఆకురాల్చు అరణ్యాలు

    * కలపకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం - జమ్ముకశ్మీర్

    * లక్కకు ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం- జార్ఖండ్

    * రెసిన్స్క ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం- అరుణాచల్ ప్రదేశ్

    * వంట చెరుకుకు ప్రసిద్ధి గాంచిన రాష్ట్రం - కర్ణాటక

    * తునికికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం- మధ్యప్రదేశ్

    అటవీ పరిశోధనా కేంద్రాలు ( Forest Research Centres ) ::

    * ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - డెహ్రాడూన్

    * ఇనిస్టిట్యూట్ ఆఫ్ అండ్ జోన్ ఫారెస్ట్ రీసెర్చ్ - జోధ్పూర్

    * ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ - భోపాల్

    * ఫారెస్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ - డెహ్రాడూన్

    * ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - జబల్పూర్

    * టెంపొరేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ - సిమ్లా .

    * సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్ & ఎన్విరాన్మెంట్ - అలహాబాద్

    * ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ - డెహ్రాడూన్

    * భారత అటవీ నివేదిక ( India State of Forestr Report ISFR . 2021 ) : ఈ నివేదికను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది .

    * ఈ నివేదిక తయారీలో కీలకపాత్ర వహించేది ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( డెహ్రాడూన్ ) ప్రస్తుతం 17 వ నివేదికను 2022 జనవరిలో విడుదల చేయడం జరిగింది .

    * ఈ నివేదికను విడుదల చేయు మంత్రిత్వ శాఖ కేంద్ర పర్యావరణం , అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేశారు .

    * మొదటి నివేదికను 1987 లో విడుదల చేశారు .

    * 2001 నివేదిక ( 17 వది ) ప్రకారం దేశంలో విస్తీర్ణం 7,13,789 చ.కి.మీ. ( 21.71 % ) . ఇది 2019 లో 7,12,249 చ.కి.మీ. ( 21.67 % ) కలదు .

    * దేశంలో మొత్తం అటవీ , పొదలు , చెట్ల విస్తీర్ణ శాతం 26.04 % కలదు .

    * అడవుల విస్తీర్ణం అత్యధికంగా గల రాష్ట్రాలు . 1. మధ్యప్రదేశ్ , 2. అరుణాచల్ ప్రదేశ్ , 3. ఛత్తీసడ్ , 4. ఒడిషా

    * అడవుల విస్తీర్ణం అత్యల్పం గల రాష్ట్రాలు . 1. హర్యానా , 2. పంజాబ్ , 3. గోవా , 4. సిక్కిం

    * అడవుల విస్తీర్ణం అత్యధికంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు . 1. జమ్ముకశ్మీర్ , 2. అండమాన్ నికోబార్ దీవులు , 3. లడఖ్ , 4. డామన్ డయ్యూ

    * అడవుల విస్తీర్ణం అత్యల్పంగా గల కేంద్ర పాలిత ప్రాంతాలు . 1. ఛండీఘర్ , 2. లక్షదీవులు , 3. పుదుచ్చేరి , 4. న్యూఢిల్లీ

    * అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 1. మిజోరాం ( 84.53 % ) 3. మేఘాలయ ( 76.03 % ) . 2. అరుణాచల్ ప్రదేశ్ ( 79,33 % ) 4. మణిపూర్ ( 74.34 % )

    * అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలు 1. హర్యానా ( 3.63 % ) 2. పంజాబ్ ( 67 % ) 3. రాజస్థాన్ ( 4.87 % ) 4. ఉత్తరప్రదేశ్ ( 6,15 % )

    * అడవుల శాతం ఎక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతాలు , 1. లక్షదీవులు ( 90,33 % ) 2. అండమాన్ నికోబార్ ( 81.75 % )   3. జమ్ముకశ్మీర్ ( 39,15 % ) 4. దాద్రానగర్ హవేలి మరియు డమన్ డయ్యు ( 37 % )

    * అడవుల శాతం తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతాలు .1. లడఖ్ ( 1.35 % )  2. పుదుచ్చేరి ( 10,68 % ) 3. ఢిల్లీ ( 12.15 % ) 4. చండీఘర్ ( 20,97 % )

    * దేశంలో మాంగ్రూవ్ ( మాడా / టైడల్ ) అడవులు విస్తరించి ఉన్న రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య- 12

    * అత్యధికంగా మాంగ్రూవ్ అడవులు ఉన్న రాష్ట్రం - పశ్చిమబెంగాల్ .

    * ప్రపంచంలో అత్యధికంగా మాంగ్రూవ్ అడవులు ఉన్న దేశాలు . 1. ఇండోనేషియా , 2. బ్రెజిల్ , 3. ఇండియా

    * అత్యల్ప మాంగ్రూవ్ అడవులు ఉన్న రాష్ట్రం - పుదుచ్చేరి . గత నివేదికతో పోలిస్తే అత్యధికంగా మాంగ్రూవ్ అడవులు పెంచిన రాష్ట్రం ఒడిశా . దేశంలో మీడా అడవుల విస్తీర్ణం మొత్తం 4992 చ.కి.మీ. ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వులు కలవు .

    * ఈ నివేదికలో కొత్తగా చేర్చిన అంశం టైగర్ రిజర్వులలో గల అటవీ విస్తీర్ణం అనే అంశాన్ని చేర్చారు . అత్యధిక టైగరులు గల రిజర్వు మరియు అత్యధిక సాంద్రత గల రిజర్వు జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వు ఉత్తరాఖండ్ .

    * ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని మొత్తం పులులలో 65 % మాత్రమే టైగర్ రిజర్వుల్లో మాత్రమే ఉన్నాయి . భారతదేశంలోని మొత్తం అడవుల్లో టైగర్ రిజర్వు విస్తీర్ణ శాతం 7.8 % మాత్రమే కలవు .

    * అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం గల టైగర్ రిజర్వు - ఫక్కే టైగర్ రిజర్వు ( 96 % ) అరుణాచల్ ప్రదేశ్లో కలదు . అత్యధిక అటవీ విస్తీర్ణం గల టైగర్ రిజర్వు నాగార్జున- శ్రీశైలం టైగర్స్ .

    * దేశంలో గత రెండు సంవత్సరాల్లో 2261 చ.కి.మీ. పెరిగింది .

    * అడవుల విస్తీర్ణంలో గరిష్ట అభివృద్ధి సాధించిన రాష్ట్రాలు . 1. ఆంధ్రప్రదేశ్ , 2. తెలంగాణ , 3. ఒడిషా , 4. కర్ణాటక , 5. తమిళనాడు

    * ఈ నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం పెంచిన మెగాసీటీల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది .

    * 17 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం వాటి భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతానికి పైగా ఉన్నది .

    జల వనరులు ::

    * ఈ భూగోళంపైన మరియు దాని చుట్టూ ఉన్న పరిసరాలలో ఉండే నీటి వనరులను జల వరణము ( Hydrosphere ) అంటారు .

    * నీరు తిరిగి ఉత్పత్తి కాబడే సహజ వనరు ( Renewable resource ) నీరు వాడిన కొలది తరిగిపోయే వర్షాల ద్వారా భర్తీ చేయబడు సహజ వనరు .

    * నీటి యొక్క అధ్యయనాన్ని హైడ్రాలజీ అంటారు . నీరు అనేది ఒక హైడ్రోజన్ అణువు , విశ్వద్రావణి .

    * ప్రపంచ నీటి లభ్యతలో 4 % మాత్రమే భారత దేశంలో ఉన్నాయి .

    * నీటి సమస్యను నివారించడానికి భారత ప్రభుత్వం National Water Resource Council ద్వారా 1987 లో జాతీయ జల విధానాన్ని ఏర్పాటు చేసింది .

    * 2012 లో నూతన జాతీయ జలవిధానం ప్రకటించారు .

    * మన దేశంలో ఎనిమిదో వంతు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాలుగా గుర్తించ బడ్డాయి .

    * భారతదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే వరదల బీభత్సాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 1954 లో జాతీయ వరద నివారణ పథకాన్ని ప్రవేశపెట్టింది .

    * రాజేంద్రసింగ్ను ' వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేర్కొంటారు .

    * హైడ్రోజన్ ఇంధనం : దీనిని 21 వ శతాబ్దపు ఇంధనం అని పిలుస్తారు . నీరు జల విశ్లేషణం చెందేటప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ అయాన్ల నుంచి అత్యధికంగా శక్తిని ఉత్పత్తి చేయును .

    * వాయుశక్తి : ఈ శక్తి ఉత్పత్తి చేయడానికి 18 కి.మీ. / గంట గాలి వేగం కావాలి . మన దేశంలో ఈ శక్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు తమిళనాడు , గుజరాత్ , కర్ణాటక .

    * భూగర్భోష్ణశక్తి : భూమి పొరలలోకి ట్యూబ్ను పంపి నీటిని ఆవిరి రూపంలో మార్చి టర్బైన్లను తిప్పి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు .

    * సముద్ర అలల శక్తి : సముద్ర అలలకు మార్గ మధ్యలో విద్యుత్ టర్బైన్లను అమర్చినప్పుడు జనరేటర్ యందు విద్యుత్ ఉత్పత్తి జరుగును .

    * భారతదేశంలో తొలిసారిగా బయోగ్యాసన్ను ప్రారంభించిన ప్రదేశం - కోల్కతా .

    * ప్రపంచంలో మొదటిసారిగా పర్యావరణం అనేది హక్కుగా రాజ్యాంగంలో గుర్తించిన దేశం - ఈక్వెడార్ .

    * అడవులు అనేవి జీవం ఉన్నవిగా గుర్తించిన మొదటి దేశం సాలిడార్ .

    * ప్రపంచంలో మొదటిసారిగా కార్బన్ పన్ను ( టాక్స్ ) విధించిన దేశం న్యూజిలాండ్ .

    * నదులనేవి జీవం ఉన్నవిగా గుర్తించిన మొదటి దేశం - న్యూజిలాండ్ .

    * ప్రపంచంలో మొదటిసారిగా వాతావరణ ఎమర్జెన్సీని విధించిన దేశం - బ్రిటన్ . - ఎల్ . . ప్రపంచంలో వాతావరణ ఎమర్జెన్సీని విధించిన రెండో దేశం - ఐర్లాండ్ .

    * జాతిపిత గాంధీజీ చెప్పినట్లు మన భూమి మనందరి అవసరాలనైతే చక్కగా తీర్చగలదు కాని ఏ ఒక్కరి దురాశలను కాదు .

    శీతోష్ణస్థితి మార్పులు ::

    * ' శీతోష్ణస్థితి అనగా ఒక భౌగోళిక ప్రాంతంలోని సగటు వాతావరణ స్థితిని దీర్ఘ కాలికంగా లెక్కించడం .

    * UNEP ప్రకారం సహజ , మానవ ఖనిజ కారణాల ద్వారా ప్రపంచ శీతోష్ణస్థితిలో సంభవిస్తున్న పరిశీలించదగ్గ అసాధారణ మార్పును శీతోష్ణస్థితి మార్పు అంటారు .

    ఆమ్ల వర్షాలు ::

    * పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు మండించడం వలన మరియు వాహనాల నుండి నైట్రోజన్ ఆక్సైడ్స్ , సల్ఫర్ ఆక్సైడ్స్ ( NO ) లాంటి కాలుష్యకాలు విడుదలై వాతావరణంలోని తేమతో చర్యనొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం , నత్రికామ్లం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరడాన్నే ఆమ్ల వర్షాలు అంటారు .

    * ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదటగా వాడినది రాబర్ట్ ఆంగోస్ స్మిత్ .

    * ఐపీసీసీ ప్రకారం వర్షపు నీటి యొక్క pH విలువ 5.6 కన్నా తక్కువగా ఉంటే దానిని ‘ ఆమ్ల వర్షం ' అంటారు .

    * మొదటిసారిగా ఆమ్లవర్షాన్ని ఇంగ్లండ్ ని మాంఛెస్టర్లో గుర్తించారు .

    * ఆమ్ల వర్షంలో 70 % సల్ఫ్యూరిక్ ఆమ్లం ( H , SO , ) మరియు 30 % నత్రికామ్లం ( HNO ) ఉంటుంది . ఆమ్ల వర్షాలు మొక్కల పత్రాలపై పడితే వాటి పత్రహరితం క్షీణించి ఉత్పాదకత తగ్గుతుంది .

    * ఆమ్ల వర్షాల కారణంగా చారిత్రక కట్టడాలపై పగుళ్లు , గుంతలు ఏర్పడి అంద విహీనంగా పసుపు లేదా నలుపు రంగులోకి మారుతున్నాయి . దీనినే stone lepracy అంటారు .

    * మధురలోని నూనె శుద్ధి కర్మాగారం నుండి వెలువడిన వాయువులు ఆమ్ల వర్షానికి కారణమై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాలరాతి కట్టడం ( తాజ్మహల్ ) కళా విహీనమై పోతుంది .

    * చారిత్రక కట్టడాల గోడల చుట్టూ ఆమ్ల ప్రభావాన్ని తగ్గించే క్షార జల కుండీలు ఏర్పాటు చేయాలి .

    * భారతదేశంలో మొదటగా ఆమ్ల వర్షాలు కురిసినట్లుగా నమోదైన ప్రదేశం ముంబై ( 1974 ) 

    * ఆమ్ల వర్ష ప్రభావం వలన మానవుల నాడీ మండల వ్యవస్థ దెబ్బతిని వ్యాధులు సోకుతాయి .

    ఓజోన్ క్షీణత ( Ozone Depletion ) ::

    * భూమిని అతినీలలోహిత కిరణాల బారి నుండి తప్పించే వాయువు ఓజోన్ , వాతావరణంలో కనిపించే సహజ వాయువులలో ఓజోన్ వాయువు ఒకటి .

    * ఓజోన్ రసాయన ఫార్ములా 0³ , ఇది మూడు ఆక్సిజన్ అణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది .

    * ఓజోన్ను డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు . ఈ పరికరాన్ని డాబ్సన్ స్పెక్ట్రోమీటర్ అంటారు .

    * ఓజోన్ పరిరక్షణకు 1987 సెప్టెంబర్ 16 న మాంట్రియాల్ ప్రొటోకాల్ ఆవిర్భవించిన రోజును పురస్కరించుకొని ప్రతియేటా సెప్టెంబర్ 16 న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు .

    * ఓజోన్ పొర వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ వాతావరణంలో ఉంటుంది .

    * ట్రోపోస్ఫియర్లో ఓజోన్ వాయువు పొగ మంచు ( స్మాగ్ ) ను ఏర్పరచి వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది . అందువలన ట్రోపోస్ఫియర్ ని ఓజోన్ వాయువును Bad Ozone అని అంటారు .

    * స్ట్రాటో ఆవరణంలో ఉండే ఓజోన్ వాయువు భూమిని అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి కాపాడును . కావున స్ట్రాటోస్ఫియర్ ఆవరణంలో గల ఓజోన్ వాయువును Good Ozone అని అంటారు .

    * ఓజోన్ పొర అత్యంత ప్రమాదకరమైన uv - B , uv - C కిరణాలను అడ్డుకుంటుంది . కేవలం uv - A కిరణాలను మాత్రమే తన ద్వారా ప్రసరింపచేస్తుంది .

    * ఓజోన్ అనేది లేత నీలం రంగులో ఉండే వాయు పదార్థం .

    * ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు క్లోరోఫ్లోరో కార్బన్ ( CFC's ) : క్లోరిన్ , ఫ్లోరిన్ , కార్బన్ అణువుల సమ్మేళనంతో ఏర్పడిన పదార్థాలను ' క్లోరోఫ్లోరో కార్బన్స్ ' అంటారు . ఇవి ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్ , ఏసీ , మంటలను ఆర్పే సిలిండర్స్ వాడే సాల్వెంట్లలో అధికంగా ఉపయోగిస్తారు .

    * ఒక్కొక్క క్లోరిన్ అణువు ఒక లక్ష ఓజోన్ అణువులను ఆక్సిజన్గా మారుస్తుంది .

    * క్లోరిన్ కంటే ప్రమాదకరమైనది బ్రోమిన్ ( Br ) . ఒక క్లోరిన్ కంటే ఇది 100 రెట్లు అధికంగా ఓజోన్ పొరను నాశనం చేస్తుంది .

    * క్లోరోఫ్లోరో కార్బన్స్ ( CFC ) లను ప్రియాన్ వాయువు అని పిలుస్తారు . 

    నైట్రిక్ అక్సైడ్ ( NO ) : ఓజోన్ క్షీణతకు ఈ వాయువు కూడా కారణమే .

    * సాధారణంగా ఓజోన్ రంధ్రం ఆర్కిటిక్ , అంటార్కిటికా ప్రాంతాలలో ఏర్పడుతుంది .

    * అంటార్కిటికాలో ఓజోన్ రంధ్రానికి కారణం అయ్యే మేఘాలు పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ మేఘాలు .

    * ఓజోన్ పొర క్షీణతను అరికట్టడానికి యూఎస్ఓ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు 1. వియన్నా కన్వేషన్ -1985 2. మాంట్రియల్ ప్రొటోకాల్ - 1987 3. లండన్ సదస్సు -1992 4. కిగాలి ఒప్పందం - 2016

    * ఓజోన్ అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది . గ్రీకులో దీనికి అర్ధం వాసన . ఓజోన్ పొర చెడు వాసన కలిగి ఉంటుంది .

    * Hydro Fluoro Carbons ( HFC ) లు ఓజోన్కు హాని కలిగించవు . అందుచేత వీటిని పర్యావరణ బంధువులు అంటారు .

    * మానవుడు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వల్ల వాతావరణం లోనికి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పెరిగి భూగోళ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ' గ్లోబల్ వార్మింగ్ ' అంటారు . శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రత పెరగడాన్ని 1850 వ సంవత్సరం నుండే గమనించారు .

    * వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ సౌర శక్తిని గ్రహించి దాని పరావర్తనాన్ని అడ్డుకుంటుంది .

    * భూతాపానికి కారణం మీథేన్ , నైట్రస్ ఆక్సైడ్ , క్లోరోఫ్లోరో కార్బన్లు . గ్రీన్ హౌస్ ఎఫెక్టును మొదటిసారిగా 1827 లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసఫ్ ఫోరియర్ కనుగొన్నాడు . వాతావరణాన్ని వేడి చేయడంలో మొదట కార్బన్ డై ఆక్సైడ్ ఉండగా తరువాత బ్లాక్ కార్బన్ ఉంది .

    * భూతాపానికి కారణమయ్యే వాయువులు కార్బన్ డై ఆక్సైడ్ , మిథేన్ , నైట్రస్ ఆక్సైడ్ , సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ , హైడ్రో ఫ్లోరో కార్బన్ , క్లోరోఫ్లోరో కార్బన్ , నీటి ఆవిరి , ఫర్ ఫ్లోరో కార్బన్లు .

    * ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల్లో ఉత్తర అమెరికా నుండి 33.2 % విడుదల అవుతున్నాయి .

    * 1992 ధరిత్రీ సదస్సులో గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ల విడుదలకి రూపొందించింది . తరువాత క్యోటోప్రోటోకాల్ విడుదల చేశారు .

    * పారిశ్రామిక దేశాలు తమ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడానికి కార్బన్ ట్రేడింగ్ ను అనుసరించాలి .

    * కార్బన్ ట్రేడింగ్ అనగా ఒక టన్ను కార్బన్ విడుదల లేదా టన్ను కార్బన్ డై ఆక్సైడ్కు సమానమైనటువంటి ఇతర గ్రీస్వాస్ వాయువుల విడుదల తగ్గింపునకు సంబంధించి మార్పులు చేయడాన్ని కార్బన్ ట్రేడింగ్ విధానం అంటారు .

    * ప్రపంచ కార్బన్ ట్రేడింగ్ మార్కెట్ దాదాపుగా 800 కోట్ల డాలర్ల వరకు ఉంది . మొదటి స్థానంలో చైనా , రెండవ స్థానంలో భారత్ అతిపెద్ద కార్బన్ క్రెడిట్ విక్రేతలుగా ఉన్నారు . ప్రపంచంలో అత్యధిక తలసరి కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేస్తున్న దేశం ఖతార్ .

    * ప్రపంచంలో కార్బన్ టాక్స్ను ప్రవేశపెట్టిన దేశం - న్యూజిలాండ్ .

    * వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగే కొద్దీ సముద్ర నీటిలో కరిగే కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు కూడా పెరుగుతుంది . ఫలితంగా సముద్ర నీటిలో కార్బోనిక్ ఆమ్లం పెరిగి నీరు ఆమ్లయుతంగా మారుతుంది . దీనిని ఓషన్ అసిడిఫికేషన్ ( Ocean Acidification ) అంటారు .

    * ప్రపంచ Green House Gases ( BHG ) ఉద్గారాలలో భారత్ 3 వ స్థానంలో ఉంది .

    * అన్నాహజారే చేసిన జల సంరక్షణ కృషి ఒక అద్భుతం . రాలేగావ్ సిద్ధి గ్రామంలో చెక్ డామ్లు నిర్మించడం వంటి జల సంరక్షణ చర్యల ద్వారా ఆ గ్రామాన్ని హరితయుతంగా తీర్చిదిద్దాడు .

    * ప్రపంచంలో మొదటి సంశ్లేషిత లేదా కృత్రిమ ప్లాస్టిక్ బెక్ట్ .

    * గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే రెండవ ప్రధాన వాయువు మీథేన్ . మన దేశంలో 20 % లాండ్ ఫిల్లింగ్ నుండే ఉద్ఘారించ బడుతుంది .

    * రీసైక్లింగ్ చెందుతున్న ప్లాస్టిక్ పదార్థానికి రంపపు పొట్టును కలపడం వల్ల రూపొందించే పదార్థాన్ని ఉడ్ ప్లాస్టిక్ అంటారు .

    * బయోగ్యాస్లో అధికంగా ఉండే వాయువు మీథేన్ , మీథేనన్ను మార్ష్ గ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అని అంటారు . * ఎడారీకరణ : వివిధ రకాల శీతోష్ణ , మానవ కార్యకలాపాల వల్ల శుష్క , అర్ధ శుష్క తేమ గల ప్రాంతాలలోని భూమి హీనదశకు ( Degradation ) వెళ్లడమే ఎడారీకరణ .

    Post a Comment (0)
    Previous Post Next Post