అంతర్జాతీయ సదస్సులు ( International Summits )... నోట్స్...


    స్టాక్ హోమ్ ::

    * సమావేశం 1972 , జూన్ 5 న నార్వేలోని స్టాక్ హోం నగరంలో జరిగిన ' మానవుడు - పర్యావరణం ’ అనే సదస్సులో 152 దేశాలు పాల్గొన్నాయి .

    * ఈ సదస్సులో పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ UNEP ( United National Environmental Programme )

    * పర్యావరణ పరిరక్షణ కోసం యూఎన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం .

    * ఈ సదస్సుకు గుర్తుగా ఇది ఏర్పాటైన జూన్ 5 వ తేదీని పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము .

    బ్రాంట్ లాండ్ కమిషన్ ::

    * దీనినే ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ అని కూడా అంటారు .

    * దీనిని 1983 లో నార్వే మాజీ ప్రధాని అయిన హర్లీమ్ బ్రంట్లాండ్ను ఛైర్మన్ గా వేశారు .

    * ఈ కమిషన్ 1987 లో తన నివేదికను " మన ఉమ్మడి భవిష్యత్తు " ( Our Common Feature ) అనే శీర్షికతో సమర్పించింది . ఈ కమిషన్ యొక్క సూచనలు 1988 నుండి అమల్లోకి వచ్చాయి .

    * ఈ కమిషన్ సభ్యుడిగా ఉన్న భారతీయుడు నాగేంద్రసింగ్ .

    మాంట్రియల్ ప్రొటోకాల్ ::

    * ఓజోన్ పొరకు జరుగుతున్న హానిని అరికట్టేందుకు 1987 , సెప్టెంబర్ 16 న కెనడాలోని మాంట్రియల్లో ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి .

    * ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ 1989 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది .

    * ఓజోన్ పొరను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలిపేందుకు 1994 లో యూఎన్ శాఖ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ ( డబ్ల్యూఎంఓ ) సెప్టెంబర్ 16 ను మాంట్రియల్ ప్రొటోకాల్ గుర్తుగా ఓజోన్ దినోత్సవంగా ప్రకటించింది .

    * ఈ ప్రొటోకాల్పై భారత్ 1992 లో సంతకం చేసింది .

    కిగాలి ఒప్పందం - 2016 ::

    * ఈ ఒప్పందం మాంట్రియల్ ప్రొటోకాల్ ఒప్పందానికి జరిగిన సవరణ . 2016 అక్టోబర్ రువాండా రాజధాని కిగాలిలో 197 దేశాల మధ్య కుదిరింది .

    * ఇది 2019 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది .

    * ఇది లీగల్లి బైండింగ్ అగ్రిమెంట్ .

    * గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే హెచ్ఎఫ్సీ ల ఉత్పత్తి , వినియోగాన్ని ఆపివేయడం ఫలితంగా 2100 నాటికి 0.4 ° C ఉష్ణోగ్రత తగ్గింపు .

    ధరిత్రీ సదస్సు ( Earth Summit ) ::

    * దీనినే UNCED ( United Nations Conference on Environment & Development ) అని పిలుస్తారు .

    * 1992 జూన్ 3-14 తేదీల మధ్య బ్రెజిల్ రాజధాని రియోడిజేనీరోలో యూఎన్ ఆధ్వర్యంలో జరిగింది .

    * Save the Earth అనే నినాదంతో ఈ సదస్సును ప్రారంభించారు .

    * ఈ సదస్సు ఇచ్చిన పిలుపు : భౌగోళికంగా ఆలోచించండి - స్థానికంగా . స్పందించడండి ( Think Globally Act Locally ) .

    * ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం 21 వ శతాబ్దంలో భూగోళాన్ని కాలుష్య కోరల నుండి విముక్తి చేయడం , జీవవైవిధ్య పరిరక్షణను చేపట్టడం మరియు వారసత్వ సంపదను కాపాడటం . అందువల్ల దీనిని ‘ ఏజెండా - 21'గా పిలుస్తారు .

    * ఈ సదస్సులో UNFCCC ( United Nations Frame Work Conservation on Climate Changes ) మరియు CBD ( Convention on Biological Diversity ) ఏర్పాటు చేయాలని గుర్తించారు .

    UNFCCC ::

    * ఇది 1994 మార్చి 21 న అమలులోకి వచ్చింది.

    * ఇది ఒక చట్టబద్ధ ఒప్పందం .

    * గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని హాని కలుగజేయని స్థాయికి నియంత్రించడం .

    * UNFCCC పై సంతకాలు చేసిన దేశాలన్నీ 1995 మొదలుకొని ప్రతి ఏటా పర్యావరణ సమస్యలపై సదస్సులు నిర్వహించాలని నిర్ధారించడమైంది . ఈ సదస్సులనే COP ( Conference of Parties ) అని పిలుస్తారు .

    CBD ( Convention on Biological Diversity ) ::

    * ఇది 1993 డిసెంబర్ 23 నుండి అమల్లోకి వచ్చింది .

    * ఇది జీవవైవిధ్య సంరక్షణ , సుస్థిర ఉపయోగం , వారసత్వ విజ్ఞానం.

    క్యోటో ప్రోటోకాల్ ::

    * గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించాలని 1997 , డిసెంబర్ 11 న జపాన్ లోని క్యోటో నగరంలో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం జరిగింది .

    * 2005 ఫిబ్రవరి 16 నుండి ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది . ఈ ఒప్పందం ప్రకారం గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని 5.2 % తగ్గించాలి .

    World Summit on Sustainable Development ::

    * 2002 దీనిని Rio + 10 అని కూడా అంటారు.

    * ఇది జరిగిన ప్రదేశం జోహెన్స్బర్గ్ ( దక్షిణాఫ్రికా ) ' జోహెన్సెస్బర్గ్ డిక్లరేషన్ ' అంటారు .

    * 12 రకాల విషవాయువులపై నిషేధించాలని ఉద్దేశం . దీనిని డర్టీడజన్స్ అంటారు .

    బాలి సదస్సు :: 

    * 2007 డిసెంబర్ ఇండోనేషియాలోని బాలీలో జరిగింది .

    * బాలీరోడ్ మ్యాప్ పేరుతో 2012 లో ముగిసే క్యోటోప్రోటోకాల్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఒప్పందం గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది .

    * అభివృద్ధి చెందుతున్న దేశాలు కాలుష్యరహిత పరిశుభ్ర ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టడానికి ధనిక దేశాలు Adaption Fund ఏర్పాటు చేశాయి .

    రియో +20 ( రియోడీజెనిరో ( బ్రెజిల్ ) - 2012 ::

    * 2012 లో జరిగే ధరిత్రీ సదస్సు లక్ష్యాలు నిలకడగల ఆర్ధికాభివృద్ధి రాజకీయ , అంతర్జాతీయ , పర్యావరణ ఒప్పందాలు అమలు చేసే విధంగా ఒత్తిడి తేవడం .

    * ఈ సదస్సులో భాగంగా The Future we want అనే నివేదికను విడుదల చేయడమైంది .

    * ఈ సదస్సులో భాగంగా యుఎన్ పర్యావరణ అసెంబ్లీని ఏర్పాటు చేశారు .

    డర్బన్ సదస్సు -2011 ::

    * 2011 డర్బన్లో నిర్వహించిన Durban Climate Conference క్యోటో ప్రోటోకాల్ నిబంధనలను 2013 నుంచి రాబోయే 5 నుంచి 8 సంవత్సరాలు అమలుకు కృషి చేసింది .

    దోహా సదస్సు ::

    * నవంబర్ 2012 దోహా ( ఖతార్ ) లో 12 రోజుల పర్యావరణ చర్చలు క్యోటో ప్రోటోకాల్న మరొక 8 సంవత్సరాలు పొడిగించారు .

    పారిస్ ఒప్పందం -2015 ::

    * పారిస్ నగరంలో 2015 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది .

    * భూగోళం వేడెక్కడంలో ఉష్ణోగ్రతను 2 ° C తగ్గించాలని ఈ సదస్సులో నిర్ణయించారు .

    * ఇటీవల ఈ ఒప్పందం నుండి అమెరికా వైదొలగినది .

    * భారతదేశం ప్రపంచ వాతావరణ మార్పిడి లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 33-35 % తగ్గిస్తున్నాయని పేర్కొంది .

    * ఇది అంతర్జాతీయ చట్టంగా రూపొందించారు.

    మరకేష్ ఒప్పందం ::

    * మొరాకోలోని మరకేష్ నగరంలో 2016 నవంబర్ లో జరిగింది .

    * వాతావరణ మార్పులపై పోరాటానికి గాను అత్యున్నత స్థాయిలో రాజకీయ నిబద్ధత అవసరమని ఆదేశాలు ఈ సదస్సులో పిలుపునిచ్చారు .

    ప్రపంచ పర్యావరణ సంరక్షణ సదస్సు ::

    * 2016 సెప్టెంబర్ 1 నుండి 10 వ తేదీ వరకు అమెరికాలోని హవాయి రాజధాని హోనలూలు నగరంలో ప్రపంచ పర్యావరణ సంరక్షణ సదస్సు జరిగింది .

    * ఈ సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రారంభించారు .

    * ఈ సమావేశంలో ఉబికి వస్తున్న సముద్రాల కారణంగా రానున్న కొన్ని దశాబ్దాల్లో కొన్ని ద్వీప దేశాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉండటంపై క్రాస్లెడ్స్ భూగ్రహం పేరిట ఒక చర్చ జరిగింది .

    వాతావరణ మార్పు సదస్సు -2018 ::

    * 2018 లో వాతావరణ మార్పు సదస్సును ( UNFCCC ) పోలెండ్లోని కతావీజ్ నగరంలో నిర్వహించారు .

    * కతావీజ్ నగరం బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తూ యూరప్లోనే అత్యంత కలుషిత ప్రాంతంగా పేరు పొందింది .

    * వాతావరణ మార్పులపై 26 వ ఐక్యరాజ్యసమితి సదస్సు ( కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా కాప్ -26 ) యూకేలోని గ్లాస్గోలో 2021 అక్టోబర్ 31 వ తేదీ నుంచి నవంబర్ 12 వ తేదీ వరకు జరిగింది .

    ముఖ్యాంశాలు ::

    * పర్యావరణాన్ని , భూగోళాన్ని కాపాడుకునేందుకు బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని ఈ సదస్సు ప్రధానంగా సూచించింది .

    * భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి ( ఐఎస్ఏ ) , ఐపీసీసీల మధ్య కుదిరిన కీలకమైన ఒప్పందం మీద ఈ సదస్సు సందర్భంగా రెండు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు . దీని ప్రకారం - దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందిస్తాయి .

    * భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ వద్దే పెరగకుండా ఉంచాలని పారిస్ ఒప్పందం ప్రతిపాదించింది . ఆ చేరుకోవాలంటే ప్రపంచ దేశాలు వేగంగా కర్బన ఉద్గారాలు తగ్గించాలని తాజా సదస్సు ముసాయిదా ప్రతిపాదించింది .

    * ఈ సదస్సులో దాదాపు 120 దేశాలకు చెందిన ప్రతినిధులు , ప్రభుత్వాధి నేతలు , వాతావరణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు . అయితే ఈ సదస్సుకు చైనా , రష్యా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కాకపోవడం గమనార్హం . ప్రతీ ఏటా జరిగే ఈ సదస్సు 2020 లో కోవిడ్ 19 సంక్షోభం కారణంగా రద్దయింది . రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు జరిగింది . 2015 లో పారిస్ వాతావరణ సదస్సులో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఏకాభిప్రాయం సాధించడంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కార్బన్ ఉద్గారాలు తగ్గించే దిశగా కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఈ సదస్సు నిర్వహించ డం జరిగింది .

    * కాప్ 26 సదస్సు సందర్భంగా అంటార్కిటికాలోని వంద కిలోమీటర్ల పొడవైన ఒక హిమానీనదానికి ' గ్లాస్గో గ్లేసియర్ ' అని బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేరు పెట్టారు . ఇది వేగంగా కరిగిపోతోంది . దాని పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను గుర్తు చేస్తూ దానికి ఈ పేరు పెట్టడం జరిగింది .

    * ప్రపంచంలోని వివిధ దేశాలను సౌర శక్తి రంగంలో అనుసంధానం చేసేందుకు గ్రీన్ గ్రిడ్స్ ఇనీషియేటివ్ ' పేరుతో భారత్ , బ్రిటన్ దేశాలు నవంబర్ 2 వ తేదీన ఈ సదస్సులో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి . ఈ గ్రిడ్ ద్వారా సౌరశక్తి సరఫరాకు అంతర్జాతీయంగా అనుసంధానం కల్పించడం సాధ్యపడుతుందని అంతర్జాతీయ సౌర కూటమి డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ పేర్కొన్నారు .

    * 2030 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్ర సాంకేతికతలను అందు బాటులోకి తెచ్చేందుకు ‘ గ్లాస్గో బ్రేక్ డ్రూస్ ' పేరుతో బ్రిటన్ రూపొందించిన అంతర్జాతీయ ప్రణాళికపై భారత్ సహా మొత్తం 40 దేశాలు సంతకాలు చేశాయి .

    పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థలు ::

    1.UNDP ( United National Development Programme )

    2. UNEP ( United Nations Environmental Programme )

    3. WCMC ( World Conservation Monitoring Centre )

    4. World Research Institute ISSD ( International Institute for Sustainable Development )

    5. CSD ( Centre for Sustainable Development )

    6. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ

    7. పెటా ( PETA )

    8. IPCC ( ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ) WNO ( World Nature Organisation )

    9. గ్రీన్ పీస్

    10. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ( WWF )

    11. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ( GCF )

    12. Climate Investment Fund బర్డ్ ఫ్ ఇంటర్నేషనల్ Conservation International

    భారత దేశంలో పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న సంస్థలు ::

    1. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్టు అకాడమీ

    2. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ

    3. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా * బిసి పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్

    4. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్

    5. నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్

    6. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ

    7. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

    8. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా

    9. జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్

    10. మద్రాసు కొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్

    11. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా

    Post a Comment (0)
    Previous Post Next Post