పర్యావరణ కాలుష్యం ముఖ్యమైన అంశాలు... నోట్స్...

    పర్యావరణ కాలుష్యం ::

    * భూమిపై నివసించే మానవులకు , మానవేతర జీవులకు , భూమిపై చోటు చేసుకున్న నిర్జీవ పదార్థాలకు హానికలిగించే విధంగా పర్యావరణ సమతుల్యంలో అలజడులు సృష్టించడం అనే దానిని కాలుష్యంగా భావించవచ్చు . 

    * పర్యావరణ పరిరక్షణ చట్టం ( EPA ) 1986 ప్రకారం జీవ లేదా జీవుల చుట్టూ పరివేష్టితమైన పరిస్థితే పర్యావరణం . 

    * పర్యావరణంలో కొన్ని అన్య పదార్థాలు ఉండవలసిన గాఢతలకంటే ఎక్కువగా ఉండి తగిన కాల పరిమితిని కలిగి ఉండి మానవుడు , ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించడాన్ని పర్యావరణ కాలుష్యం అంటారు . 

    * కాలుష్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించ వచ్చు . అవి : 

    1. సహజ కాలుష్యం - ప్రకృతిలో సహజ ప్రక్రియల వల్ల కలిగేది 

    2. కృత్రిమ కాలుష్యం - మానవుని కృత్యాల వల్ల కలిగేవి 

    1. ప్రాథమిక కాలుష్యకాలు : ఇవి ఏ స్థితిలో పర్యావరణంలోకి ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . 

    2. ద్వితీయ కాలుష్యకాలు : ప్రాధమిక కాలుష్యకాలు మార్పు చెందడం ఫలితంగా ఈ కాలుష్యకాలు ఏర్పడును .

    గాలి కాలుష్యం ::

    * ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్లూహెచ్ ) ప్రకారం గాలిలో ఉండే భౌతిక , రసాయన జీవ సంబంధ కారకాలు పరిమితికి మించితే గాలి సహజత్వంలో మార్పులు కలిగి మానవునికి , పర్యావరణానికి హాని కలగడమే వాయు కాలుష్యం . 

    ప్రాథమికమైన గాలి కాలుష్య కారకాలు ::

    1. కార్బన్ మోనాక్సైడ్ ( CO ) 

    2. హైడ్రో కార్బన్లు ( HC ) 

    3. నైట్రోజన్ ఆక్సైడ్లు ( NOx ) 

    4. సల్ఫర్ డై ఆక్సైడ్లు ( SO2 ) 

    * వాయు కాలుష్యం వల్ల ప్రాణులకే కాకుండా ప్రాచీన కట్టడాలను , శిల్పకళాఖండాలకు నష్టం వాటిల్లుతుంది . 

    కార్బన్ మోనాక్సైడ్ ( CO ) ::

    * ఇది విషవాయువు . ఇంధనాలు , కర్బన సమ్మేళనాలు పాక్షికంగా దహనం చెందడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది . 

    * మొక్కలు కార్బన్ మోనాక్సైడ్ను గ్రహించి ప్రోటీన్లను తయారు చేసుకోవడం మూలంగా -అవి కొంత కాలుష్యాన్ని తగ్గించ గలుగుతున్నాయి . 

    * కార్బన్ మోనాక్సైడ్ మానవులకు హాని కలిగిస్తుంది . ఇది రక్తములోనికి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది .

    * కార్బన్ మోనాక్సైడ్కి రంగు , రుచి , వాసన లేని మండే వాయువు .

    * కార్బన్ మోనాక్సైడ్ వాహన ఉద్ఘారాల నుండి అత్యధిక స్థాయిలో విడుదలవుతుంది . దీని జీవిత కాలం 3 సంవత్సరాలు . 

    * వాయు కాలుష్యంలో ఇది 50 % ప్రమాదకర కాలుష్యంగా పరిగణించబడుతుంది .

    సల్ఫర్ డై ఆక్సైడ్ ( SO2) ::

    * కార్బన్ మోనాక్సైడ్ తరువాత అత్యధిక మోతాదులో విడుదలయ్యే గాలి కాలుష్య కారకం సల్ఫర్ డై ఆక్సైడ్ . 

    * థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి సల్ఫర్ డై ఆక్సైడ్ అధికంగా విడుదల అవుతుంది . 

    * SO2 జీవిత కాలం 2-4 రోజులు . SO2 ప్రభావం ద్వారా మొక్కల్లో పత్రహరిత నష్టం ( క్లోరోసిస్ ) సంభవిస్తుంది . 

    * మనిషి కంటిలో దురద , ఆస్తమా , బ్రాంకైటీస్ , SO2 వల్ల సంభవిస్తాయి . 

    * సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యం వలన ఆమ్ల వర్షాలు ఏర్పడతాయి . 

    * సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్య ప్రభావం వలన చారిత్రాత్మక కట్టడాలు కూడా కళావిహీనం అయిపోతున్నాయి . 

    * ప్రపంచంలో అత్యధికంగా SO2 ను విడుదల చేస్తున్న దేశం ' ఇండియా '.

    నైట్రోజన్ ఆక్సైడ్ ( NO2 ) ::

    * బొగ్గు , చమురు , సహజ వాయువులు మొదలగు శిలాజ ఇంధనాలు పరిశ్రమలలో వాహనాలలో , దహింపబడటం వలన నైట్రోజన్ ఆక్సైడ్లు విడుదలై గాలిని కలుషితం చేస్తున్నాయి.

    * నత్రజని ఎరువుల వాడకం ద్వారా వాహనాల పొగలో పరిశ్రమల నుండి నత్రజని ఆక్సైడ్లు విడుదలవుతాయి . 

    * ఇది ద్వితీయ కాలుష్య కారకాలు . 

    * నత్రజని ఆక్సైడ్లు , సల్ఫర్ ఆక్సైడ్లు వాతావరణంలోకి చేరి , ఆమ్ల వర్షాలుగా భూమిని చేరుతాయి . 

    హైడ్రోకార్టన్లు ( HC ) ::

    * హైడ్రోజన్ , కార్బన్తో నిర్మితమైన సమ్మేళనాలను హైడ్రోకార్బన్స్ అంటారు . 

    * ఇవి వాహనాలలో వాడినప్పుడు అసంపూర్ణ దహనం వల్ల వెలువడుతుంది .

    కార్టన్ డై ఆక్సైడ్ ( CO2 ) ::

    * శిలాజ ఇంధనాల వాడకం వల్ల ( CO2 ) వాతావరణంలోకి  విడుదలవుతుంది . ( CO2 ) ప్రధాన గ్రీన్ హౌస్ వాయువుగా వ్యవహరించి సూర్యరశ్మిలో శక్తిని గ్రహించి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది . 

    * ( CO2 ) తోపాటు మిథేన్ ( CH4 ) , క్లోరోఫ్లోరో కార్బన్లు , నైట్రస్ ఆక్సైడ్ , హైడ్రోప్లోరో కార్బన్లు ( HFC ) మరియు సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ ( SF2 ) గ్రీన్ హౌస్ వాయువులుగా వ్యవహరిస్తారు.

    * క్లోరోఫ్లోరో కార్బన్స్ ( CFC's ) లు ఏసీల నుండి విడుదలై వాతావరణంలో కొన్ని సంవత్సరాలు ఉండి స్ట్రాటోస్పియర్కు హాని చేసే వాయువులు ఫలితంగా ఓజోన్ మందం తగ్గును.

    * పరిశ్రమల నుండి మెర్క్యురీ , కాడ్మియం , పెట్రోల్ దహనం వల్ల లెడ్ వాతావరణం లోకి విడుదలగును . నగరాలలో వాయు కాలుష్యానికి కారణమయ్యేది లెడ్ ( సీసం ) .

    * పొగ మంచు ఆమ్ల స్వభావాన్ని కలిగి క్షయీ కరణ ధర్మాన్ని కలిగి ఉండటం వల్ల దీన్ని క్షయీకరణ పొగమంచు అంటారు . అస్బెస్టాస్ పీల్చుకోవడం వల్ల  ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి . 

    * కార్బన్ మోనాక్సైడ్ - రక్త ప్రసరణ వ్యవస్థ.

    * నైట్రోజన్ డయాక్సైడ్ - ఎంఫిసియా వ్యాధి.

    * పొగమంచు - ముక్కు , కంటి సమస్యలు కార్బన్ డై ఆక్సైడ్ - గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సల్ఫర్ డై ఆక్సైడ్- రాతి కట్టడాలు శిథిలం అవుతాయి . 

    * కాడ్మియం - హృదయంపై ప్రభావం చూపును .

    * లెడ్ - మెదడు , మూత్రపిండాలు దెబ్బతినడం.

    * పాదరసం - నాడీ సంబంధిత సమస్యలు.

    * దేశ వ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఒక జాతీయ కాలుష్య సూచిక అనివార్యమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6 న జాతీయ వాయుకాలుష్య సూచిక ( National Air Quality Index , AQI ) ను ప్రారంభించింది .

    * World Health Organisation ( WHO ) ప్రకారం ప్రపంచంలోనే 20 మొదటి అత్యంత కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారత్లోనే ఉన్నట్లు గుర్తించారు .

    * జాతీయ కాలుష్య సూచిక ప్రకారం 8 కాలుష్యకాలను సూచిస్తుంది . అవి : ఓజోన్ ( Particular Ematter ( PM2.5 ) , PM10 . నైట్రోజన్ డై ఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్ , లెడ్ , అమోనియా . 

    * మన దేశంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 ఏప్రిల్ 1 నుండి జాతీయ స్థాయిలో BS ( Bharath Stage ) -VI_ ను వాడుతున్నారు . 

    * భోపాల్ దుర్ఘటన : ఇది డిసెంబర్ 2 , 1984 లో రాత్రి లేదా డిసెంబర్ 3 న తెల్లవారు జామున మధ్యప్రదేశ్లోని భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే పెస్టిసైడ్ తయారీ కంపెనీలో మిథైల్ ఐసో సయనేట్ అనే వాయువు విడుదలైంది . ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్ర పారిశ్రామిక దుర్ఘటన . ఈ దుర్ఘటన ఫలితంగా 1986 లో పర్యావరణ పరిరక్షణ చట్టం తీసుకురావడమైనది . 

    జలకాలుష్యం ::

    * డబ్ల్యూహెచ్ వారి ప్రకారం ప్రస్తుతం లేదా భవిష్యత్లో మానవుడు తన అవసరాలు అన్నింటికీ ఉపయోగించుకోవడానికి పనికి రాని , కనీస నాణ్యత లేని నీటిని కలుషిత నీరు అంటారు . 

    * అవాంఛిత కారకాలు నీటిలో చేరడం వల్ల నీటి యొక్క భౌతిక , రసాయన , జీవ సంబంధ స్థితులు మారడాన్ని నీటి కాలుష్యం అంటారు .

    * గాలి కాలుష్యం తరువాత పేర్కొనదగిన ప్రమాదకరమైన కాలుష్యం నీటిదే . 

    * మన దేశంలో నదులు , సరస్సులు చాలా వరకు కలుషితమైపోయాయి . త్రాగడానికి పనికిరాకపోగా నీటి నుండి ఎన్నో వ్యాధులను కలిగించేవిగా పరిణమిస్తున్నాయి .

    * ఆర్సెనిక్ , ఫ్లోరైడ్ , నైట్రేట్ల వంటి వానిలో కలుషితమైన భూగర్భ జలం అతి ప్రమాద కరంగా తయారవుతున్నాయి . 

    * మురుగు : నగరాల్లో , పట్టణాల్లో గృహ సంబంధ ముగురు పదార్థాలు నీటిలో చేరిపోవటం వలన ఇది ఏర్పడుతుంది .

    * కలుషితమైన నీటిలోని మిథైల్ మెర్క్యురితో కలుషితమైన చేపల ఆహారాన్ని స్వీకరించడం వల్ల వారికి ' మినిమాటా ' వ్యాధి సోకింది ( జపాన్లో ).

    * జపాన్లోనే కాడ్మియంతో కలుషితమైన వరి ఆహారం తీసుకున్న కారణంగా ' ఇటాయ్- ఇటాయ్ ' అనే వ్యాధి సోకింది . 

    * త్రాగునీటిలో అధిక నైట్రేట్ ఉన్న కారణంగా ' మిథేయోగ్లోబినేమియా ( బ్లూ బేబీ సిండ్రోమ్ ) ' వ్యాధి సంక్రమిస్తుంది . 

    * త్రాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటే దంతాలు , ఎముకలు క్షీణించిపోయే ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది . 

    * భారతదేశంలో 85 % మంది మురికి నీటిని త్రాగుతున్నారు . 

    * పారిశ్రామిక కాలుష్యం ద్వారా మంచి నీరు కాలుష్యం చెందుతుంది . పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన , అకర్బన రసాయనాలు వెలువడి నీటిని కలుషితం చేస్తున్నాయి .

    * చమురు నీటి ఉపరితలంపైన ఉన్న చమురు గాలి నుంచి ఆక్సిజన్ను నీటిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది . ఫ్లవకాల పెరుగుదలలో అడ్డు ఏర్పడుతుంది . 

    * కలుషితమైన నీటిలో ఆక్సిజన్ తగ్గించే చర్యనే యూట్రోఫికేషన్ " అంటారు . 

    * గంగానది కాలుష్యాన్ని తగ్గించడానికి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గంగా యాక్షన్ ప్లాన్ పేరిట వెయ్యి కోట్ల రూపాయలతో హరిద్వార్ నుండి కలకత్తా వరకు గంగా జలాలను శుద్ధిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు . 

    * నీటిలో ఫ్లోరిన్ శాతం 1.5 పీపీఎం దాటినప్పుడు మానవులకు ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది . 

    * కొలిఫాం ఎక్కువగా ఉండటం మానవ వ్యర్థాలు అధికంగా నీటిలో ఉన్నాయనడానికి సూచిక . గంగానది అత్యధిక కాలుష్యానికి కారణం .

    * నీటిలో కరిగి ఉన్న ఆక్సిజనన్ను ' విలీన ఆక్సిజన్ ' అంటారు . ఇది సాధారణంగా 5 పీపీఎం కంటే ఎక్కువగా ఉండాలి . 5 పీపీఎం కంటే తగ్గితే నీటిలో చేపలు జీవించలేవు . 

    * క్లోరినేషన్ : నీటికి క్లోరిన్ వాయువును లేదా బ్లీచింగ్ పౌడర్ను కలిపి సూక్ష్మజీవులను , ముఖ్యంగా బాక్టీరియాను తొలగించడం .

    * ఓజోనైజేషన్ : నీటిలో తేలియాడే ఘణరూప రేణువులను ఓజోన్ ను కలిపి తొలగించడం . 

    నేల కాలుష్యం ::

    * వివిధ రకాలైన వ్యర్ధ పదార్థాలు భూమిలోకి చేరడం వలన నేల తన యొక్క సహజ లక్షణాలను కోల్పోయే ప్రమాదముంది . దీనినే నేల కాలుష్యం అంటారు .

    * వ్యర్థ పదార్థాలు చేరడం వల్ల భూమి కొంత వరకు తట్టుకోగలుగుతుంది . కాని ప్రతిరోజు అదే పనిగా వ్యర్థాలను చేర్చడం వలన అది కాలుష్యానికి దారి తీస్తుంది . 

    * అధిక ఆహార ఉత్పత్తి కొరకు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు విచక్షణారహితంగా వాడుతున్నారు . దీని ఫలితంగా నేల కాలుష్యం ఏర్పడుతుంది . 

    * పెట్రోలియం శుద్ధి కర్మాగారాలలోని వ్యర్థ పదార్థాల వలన కూడా నేల కలుషితం అవుతుంది.

    * నేల కాలుష్యం పారిశ్రామిక వ్యర్థాలు , నగర , పురపాలక వ్యర్థాలు , వ్యవసాయ వ్యర్థాలు రేడియోధార్మిక పదార్థాలు , ఆమ్ల వర్షాలు , గనుల తవ్వకం , జీవసంబంధ కారకాల వల్ల కాలుష్యం అగును . 

    * కలుషితమైన నేలను శుభ్రం చేయడానికి కొన్ని ప్రత్యేక మొక్కలు పెంచాలి . దీనిని ' ఫైటో రెమిడియేషన్ ' అంటారు .

    * జీవవిచ్ఛిన్నం చెందే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలి . 

    ధ్వని కాలుష్యం ::

    * కంపించే వస్తువుల ఉపరితలం నుండి వెలువడే యాంత్రిక శక్తిని ' ధ్వని ' అంటారు .

    * కాని సమయంలో , అవాంఛిత ప్రదేశంలో , అసమ్మతమైన , శ్రావ్యయోగ్యం కాని ధ్వనుల వల్ల జీవుల ఆరోగ్యానికి హానికలగడాన్ని " ధ్వని కాలుష్యం " అంటారు .

    * ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం - ' డెసిబెల్ ' ( db ) . 

    * WHO ప్రకారం పరిశ్రమల నుండి వెలువడే ధ్వని తీవ్రతకు అవధి 75 ( db ) గా పేర్కొంటారు . రవాణాకు సంబంధించిన వాహనాల వల్ల అధిక ధ్వని కాలుష్యం కలుగుతోంది .

    * ప్రపంచం అత్యధిక ధ్వని కాలుష్యం గల పట్టణం - గాంగ్జూ ( చైనా ).

    * ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని మార్చి 3 న జరుపుకుంటారు . పరిశ్రమలలో పనిచేసే వారిలో ఎక్కువ మందికి శాశ్వత చెవిటితనం రావడాన్ని - " ఆక్యుపేషనల్ హియరింగ్ లాస్ " అని అంటారు.

    * ధ్వని కాలుష్య ప్రభావానికి సంబంధించి వాయు కాలుష్య ( నివారణ - నియంత్రణ ) చట్టం -1974 మరియు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని 1986 లో ప్రవేశపెట్టింది . 

    * 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం “ ది నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్స్ " అనే నియమాన్ని రూపొందించారు . 

    * నిశ్శబ్ధ ప్రాంతాలు ( Silent Zones ) అనగా పాఠశాలలు , కళాశాలలు , హాస్పిటల్స్ మరియు కోర్టులకు 100 మీటర్ల లోపు గల ప్రాంతాలు . 

    * కేంద్ర ప్రభుత్వం 2011 లో Ambient Noise Monitering Network ను తీసుకొచ్చింది . 

    ప్రపంచ పర్యావరణ ప్రమాదాలు ::

    * నీటి ఉష్ణోగ్రత పెరిగిన కొలది D.O. ( Dissolved Oxygen ) విలువలు తగ్గిపోతాయి . ఉదా : 32 ° F వద్ద నీటిలో D.O. విలువ 14.6 పీపీఎం ఉండగా 64 ° F వద్ద 6.6 పీపీఎంకు తగ్గిపోతుంది . 

    * రేడియోధార్మిక పదార్థాల వల్ల గాలి . నీటితో పాటు ఇతర ప్రాంతాలు కలుషితం అవుతాయి . ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు . 

    1. అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు 

    2. యురేనియం , థోరియం వంటి ఖనిజాల వెలికితీత 

    3. అణువ్యర్థాల రవాణా 

    4. రేడియోధార్మిక రసాయనాలు వెదజల్లడం 

    5. రేడియో ఐసోటోప్స్ వాడకం 

    6. అణు ఆయుధాలు వాడడం 

    * ప్రపంచంలో మొదటగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై ఆగస్టు 6 న 1945 లో లిటిల్ భాయ్ అనే యురేనియం అణు బాంబును వేసింది . ఆగస్టు 9 న నాగసాకిపై ‘ ఫాట్మాస్ ' అనే ప్లుటోనియం అణుబాంబును వేసింది . 

    * బ్రిటీష్ అటామిక్ బాంబు ప్రాజెక్టు దుర్ఘటన ( 1957 ) ఇది బ్రిటన్లో ని సెల్లపీల్డ్ లో గల అణుబాంబు ప్రాజెక్టులో మంటలు చెలరేగడం వల్ల అత్యధికంగా రేడియో థార్మిక వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదల అయినవి . త్రీమైల్ దీవి దుర్ఘటన ( 1979 ) ఇది అమెరికాలో జరిగిన అణు దుర్ఘటన . 

    * చెర్నోబిల్ అణు దుర్ఘటన ( 1986 ) ఇది ఉక్రెయిన్ రేడియోధార్మిక పదార్థాల వల్ల జరిగిన అణు దుర్ఘటన . 

    * పుకుషిమా దైచీ అణు విస్పోటం ( జపాన్ ) ఇది ప్రకృతి అంశమైన సునామీ వల్ల 2011 మార్చి 11 న సంభవించింది .

    * 5 ఎంఎం కన్నా తక్కువ పొడవు గల ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్ అంటారు . వీటి వల్ల కలిగే కాలుష్యాన్ని ' మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ’ అంటారు . ఇది ఎక్కువగా సముద్ర ఆవరణ వ్యవస్థలో ఉంటుంది . 

    * ఐక్యరాజ్యసమితి 2017 లో ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం చేసేందుకు ' క్లీన్ నీ క్యాంపెయిన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది . 

    * ఇండోనేషియా బాలీ సముద్ర వ్యర్థాల కారణంగా గార్బేజ్ ఎమర్జెన్సీని విధించింది . 

    * ప్రపంచంలో సముద్ర వ్యర్థాలను అధికంగా విడుదల చేస్తున్న మొదటి దేశం చైనా కాగా , రెండవ దేశం ఇండియా .

    * సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం తెలుపురంగు ఇచ్చిన పరిశ్రమలు కాలుష్యరహితం . వీటి ఏర్పాటుకు ఎటువంటి పర్యావరణ అనుమతి అవసరం లేదు . 

    * హీలీ ఫర్ రివర్స్ ( నదుల కోసం యాత్ర ) . దీనిని ఈశా ఫౌండేషన్ ( జగ్గీవాసుదేవ్ ) ప్రారంభించారు . నదులను రక్షించడం కోసం . కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు యాత్ర చేశారు . 

    ఘన వ్యర్థ పదార్థాలు - నిర్వహణ ::

    * ఆధునిక కాలంలో మనిషి అభివృద్ధి చర్యల ద్వారా అధికమొత్తంలో ఘనవ్యర్ధం విడుదల అవుతోంది . 

    * ఫ్యాకింగ్ పదార్థాల ఉత్పాదన మరింత దీనికి కారణమవుతోంది . సరైన రీతిలో నియంత్రించకపోవడం వల్లే ఘన వ్యర్థ పదార్ధ సమస్యలు పెరుగుతున్నాయి . 

    * ఘనవ్యర్ధ పదార్థాలు ఎక్కువైతే తాగునీటి సరఫరాలో హానికర రసాయనాలు కలుస్తాయి . దీంతో కలుషిత నీటిని తాగడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయి .

    లాండ్ ఫిల్లింగ్ ::

    * ఘన వ్యర్ధ నిర్వహణలో వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు . ఈ విధానంలో నేలలో గోతులు తవ్వి ప్రతి రెండు మట్టి పొరల మధ్య చెత్తపొరను వేసి కాంపాక్టింగ్ చేస్తారు . 

    * కంపోస్టింగ్ : పశువుల పేడ , ఆహార వ్యర్థాన్ని పోగుచేసి వినియోగం చెందించడమే కంపోస్టింగ్ . దీనిని సేంద్రియ ఎరువు అంటారు.

    * ఇన్సినరేషన్ : ఘన వ్యర్థాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో మండించి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారు . ఈ విధానం ద్వారా ఘనవ్యర్థ పరిమాణాన్ని బాగా తగ్గించవచ్చు .

    * రీసైక్లింగ్ : వినియోగించిన నిరర్ధక వ్యర్థాల నుండి తిరిగి మనిషి ఉపయోగించే సరికొత్త పదార్థాల తయారీని ' రీసైక్లింగ్ ' అంటారు . 

    * హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు దాదాపు 1500 టన్నుల చెత్త వెలువడుతుంది . దీని నుండి 200 టన్నుల చెత్త నుండి విద్యుత్ను తయారు చేసే యూనిట్స్ను షాద్నగర్లో నెలకొల్పడం జరిగింది . 

    ప్రకృతి వనరులు ::

    మానవుడు ఈ భూమిపై పుట్టక ముందే ప్రకృతి వృక్ష , జంతు జాలాలను సృష్టించింది . జీవావరణంలో ఉన్న జీవులన్నీ ప్రకృతి వనరుల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి . జీవుల మనుగడకు ముఖ్యంగా కాలవసినవి గాలి , నీరు , ఆహారం ఇవి ప్రకృతిలో లభిస్తాయి . కాబట్టి వీటిని ప్రకృతి వనరులు ( Natural Resources ) అంటారు .

    Post a Comment (0)
    Previous Post Next Post