విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది ?

1. ఏ రాష్ట్రంకు అయినా గరిష్టంగా అనుమతించబడిన విధాన సభ సభ్యులు సంఖ్య ఎంత ?
1. 545 మంది సభ్యులు
2. 420 మంది సభ్యులు
3. 400 మంది సభ్యులు
4. 500 మంది సభ్యులు

2. ఈ క్రింది రాష్ట్రంలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది ?
1. రాజస్థాన్
2. సిక్కిం
3. మహారాష్ట్ర
4. గుజరాత్

3 . ఒక ద్రవ్యేతర బిల్లును రాష్ట్ర శాసన సభ పునఃపరిశీలనకు గవర్నర్ ఎంత కాలవ్యవధిలోగా తిప్పిపంపవలెను ?
1.14 రోజులు
2. కాలవ్యవధి నిర్ణయించబడలేదు
3. ఒక నెల
4. రెండు నెలలు

4. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన ఒక బిల్లు విషయంలో గవర్నర్ యొక్క అధికారాలకు సంబంధించి క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. అతడు బిల్లుకు అతని ఆమోదాన్ని ఇవ్వవచ్చును
2. అతడు బిల్లును నిలిపి ఉంచవచ్చును
3. బిల్లుకు ఆమోదం తెలపడం తప్ప అతనికి మరే ప్రత్యాయామం లేదు
4. అతడు బిల్లును రాష్ట్రపతి పరిశీలన కొరకు ప్రత్యేకించవచ్చును

5. ఈ క్రింది వాటిని పరిశీలింపుము ?
ఎ . భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులోని ఏ న్యాయమూర్తి ప్రవర్తన సంబంధించి ఒక రాష్ట్ర శాసన సభలో చర్చ జరుపుటకు వీలులేదు
బి . భారత రాజ్యాంగలోని నిబంధనల ప్రకారం హైకోర్టులోని ఏ నాయ్యమూర్తి ప్రవర్తన సంబంధించి రాష్ట్ర శాసన సభలో చర్చ జరుపుటకు ఎటువంటి ఆంక్ష లేదు .
సి . భారత రాజ్యంగం ప్రకారం చట్టం సభల కార్యక్రలాపాలపై కోర్టులు విచారణ జారుపజాలవు ?
పై వాటిలో సరైనవి
1 ) బి మరియు సి
2 ) ఎ మరియు బి
3 ) ఎ మరియు సి
4 ) ఎ , బి మరియు సి

6. ప్రతిపాదన ( ఎ ) రాష్ట్ర చట్ట సభ ఆమోదించిప ఒక ద్రవ్యేతర బిల్లు గవర్నర్ నిలిపి ఉంచవచ్చును ?
హేతువు ( బి ) ఆ విధంగా చేసేందుకు భారత రాజ్యాంగ ప్రకరణ 200 ప్రకారం గవర్నరు అధికారం కల్పించబడినది ?
1. ( ఎ ) మరియు ( బి ) రెండు విడివిడిగా సరైనవి మరియు బి , ఎ లకు సరైన వివరణ
2. ( ఎ ) మరియు ( బి ) రెండు విడివిడిగా సరైనవి కాని బి , ఎ కు సరైన వివరణ కాదు
3. ( ఎ ) తప్పుకాని ( బి ) సరైనది
4. ( బి ) తప్పు ( ఎ ) సరైనది

7 . ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ?
ఎ . ఒక రాష్ట్ర శాసన సభలో పెండింగ్ లో ఉన్న ఒక బిల్లు సభ లేదా సభలు సమాపనం చేయబడినది అనే కారణం చేత కాల దోషం చెందదు .
బి . రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందని ఒక బిల్లు రాష్ట్ర శాసన మండలిలో ఆ నిర్ణీతిలో ఉన్నప్పుడు శాసన సభ రద్దు అయితే ఆ బిల్లు కాల దోషం చెందరు . పై వివరణలలో సరైనవి ఏవి ?
1 ) ఎ మాత్రమే
2 ) బి మాత్రమే
3 ) ఎ మరియు బి
4 ) ఎ కాదు మరియు బి కాదు

8 . రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు ఉండునది ?
1. 1/12 వంతు నమోదైన పట్టభద్రుల చేత ఎన్నుకోబడినవారు 1/12 వంతు స్త్రీల చేత ఎన్నికయినవారు 1/12 వంతు నమోదైన పట్టభద్రుల చేత ఎన్నుకోబడినవారు / ఉపాధ్యాయుల చేత ఎన్నికయినవారు
2. 1/12 వంతు ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడినవారు 1/3 వంతు మున్నిపాలిటీల చేత ఎన్నుకోబడినవారు 1/12 వంతు నమోదైన పట్టభద్రుల చేత ఎన్నుకోబడిన వారు .
3. 1/12 వంతు స్త్రీల చేత ఎన్నుకోబడిన వారు 1 / 12 వ వంతు నమోదు చేసుకున్న పట్టభద్రుల చేత ఎన్నుకోబడిన వారు 1/12 వంతు సహకార బ్యాంకులు , మహిళా సంస్థలు & ఇతర సహకార సంస్థల చేత ఎన్నుకోబడినవారు .
4. 1 / 3 వ వంతు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడినవారు ; 1 / 12 వ వంతు నమోదు చేసుకున్న పట్టభద్రుల చేత ఎన్నుకోబడినవారు ; 1 / 12 వ వంతు సహకార బ్యాంకులు , మహిళా సంస్థలు మరియు తర సహకార సంస్థలచేత ఎన్నుకోబడినవారు .

9. ప్రతిపాదనలు ఎ ) ఒక బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే , దాని కారణంగా రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఖర్చ చేయవలసి ఉంటే అటువంటి బిల్లును పరిశీలించవలసినదిగా రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభకు సిఫారసు చేసి వుండవలెను .
బి ) రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లును పరిశీలించమని సిఫారసు చేయనిదే , అట్టి బిల్లును శాసనసభ ఆమోదించరాదు .
1. ఎ మరియు బి రెండు విడివిడిగా సరైనవి మరియు బి , ఎకు సరైన వివరణ
2. ఎ మరియు బి రెండు విడివిడిగా సరైనవి కాని , ఎ , బికు సరైన వివరణ కాదు .
3 . ఎ తప్పు కాని , బి సరైనది .
4. ఎ సరైనది కానీ , బి తప్పు . హేతువు

10. ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయుటకు లేదా రద్దు చేయుటకు , ఆ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించుటకు అవసరమైనవి .
1. శాసనసభకు హాజరై ఓటింగ్ చేసిన సభ్యులలో మూడింట 2 వంతుల మంది సభ్యులకు తక్కువ కాకుండా మెజారిటీ
2. శాసనసభకు హాజరై ఓటింగ్ చేసిన సభ్యులలో మూడింట ఒక వంతు సభ్యులకు తక్కువ కాకుండా మెజారిటీ
3. రాష్ట్ర శాసన సభ్యులకు సాధారణ మెజారిటి
4. శాసనసభలోని మొత్తం సభ్యులో మెజారిటీ మరియు ఓటింగ్ చేసిన సభ్యులలో మూడింట రెండు వంతులు తక్కువ కాకుండా

Answers ::
1 ) 4 , 2 ) 1 , 3 ) 2,4 ) 3,5 ) 3 , 6 ) 1 , 7 ) 3 , 8 ) 2 , 9 ) 1 , 10 ) 4

Post a Comment (0)
Previous Post Next Post