అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు ?

1. ఈ క్రింది వాఖ్యలను వివరింపుము
ఎ . దేశ వ్యాప్తంగా స్థానిక ప్రభుత్వ నిర్మాణంలో ఏకరూపతను సాధించడం
బి . రాష్ట్ర ఆదాయం నుండి నిరంతర మరియు హేతుబద్ధ నిధుల ప్రవాహన్ని చేకూర్చటం
సి . ఒక నియమితకాల వ్యవధులలో సక్రమంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను సంస్థను కల్గి ఉండటం .
డి . నగర నిర్వహణ మరియు అభివృద్ధి కొరకు ఒక ఏకీకృత ప్రాధికార సంస్థను కలిగి ఉండటం .
భారత రాజ్యాంగానికి చేసిన 74 వ ప్రకరణ వీటిలో దేనిని పట్టణ స్థానిక సంస్థల విధులలోకి చొప్పిం చేందుకు ప్రయత్నిస్తుంది .
1. ఎ మరియు బి
2. ఎ , బి మరియు సి
3. ఎ , సి మరియు డి
4. బి , సి మరియు డి

2. ఈ క్రింది వానిలో వేటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత గవర్నర్ ఒక నగర పంచాయతీ , ఒక మున్సిపల్ కౌన్సిల్ లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో ఒక పరివర్తన ప్రాంతం " ఒక చిన్నపట్టణ ప్రాంతం లేదా ఒక పెద్ద పట్టణ ప్రాంతంగా నిర్దిష్ట పరుస్తాడు ?
ఎ . జనసాంద్రత
బి . వ్యవసాయేతర కార్యకలాపాలలో ఉద్యోగ శాతం
సి . ఆ ప్రాంతంలోని వైద్యశాలల సంఖ్య
క్రింద ఇవ్వబడిన సంకేతాల ద్వారా సరియైన జవాబు గుర్తింపుము :
1. ఎ , బి మరియు సి
2. బి మరియు సి మాత్రమే
3. ఎ మరియు బి మాత్రమే
4. ఎ మరియు సి మాత్రమే

3. ఈ క్రింది వానిలో వేటిపై 74 వ రాజ్యాంగ సవరణ దృష్టి సారించలేదు ?
ఎ . మున్సిపల్ సిబ్బంది వ్యవస్థ
బి . మున్సిపాలిటీ ఏర్పాటు మరియు కూర్పు
సి . ఎన్నికైన కార్య నిర్వహక వ్యవస్థ మరియు ఉద్యోగి స్వామ్యం మధ్య సంబంధాలు
డి . మున్సిపాలిటీ సభ్యత్వం కొరకు అనర్హతలు .
క్రింద ఇవ్వబడిన సంకేతాన్ని ఉపయోగించి సరియైన జవాబును గుర్తింపుము .
1. ఎ మరియు డి మాత్రమే
2. బి , సి మరియు డి మాత్రమే
3. ఎ , బి మరియు సి
4. ఎ మరియు సి మాత్రమే

4. ఈ క్రింది జతలను పరిశీలింపుము :
ఎ . కంటెన్మెంట్ బోర్డు : రక్షణ మంత్రిత్వశాఖచే కేంద్రీయంగా ఫలించబడుతు .
బి . నోటిఫైడ్ ఏరియా కమిటీ : కొత్తగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలను పాలిస్తుంది .
సి . మున్సిపల్ కౌన్సిల్ సంక్లిష్ట సమస్యలను కల్గి ఉన్న పెద్ద నగరాలను పాలిస్తుంది .
డి . మున్సిపల్ కార్పొరేషన్ : ఒక ఎన్నికైన మేయర్ అధ్యక్షత వహిస్తారు .
పై వాటిని సరిగా జతపరచండి
1. ఎ , బి , సి మరియు డి
2. ఎ , బి మరియు డి
3. ఎ మరియు డి
4. బి మరియు సి

5. ఈ క్రింది వారు ప్రముఖమైన స్థానిక ప్రభుత్వ విధానాలతో సంబంధం కల్గిన వారు .
ఎ . బల్వంత్య్ మెహతా
బి . లార్డ్ మేమో
సి . లార్డ్ రిప్పన్
డి . అశోక్ మెహతా
పై వాటి సరైన క్రమంతో అమర్చండి ?
1. ఎ , బి , సి , డి
2. బి , సి , ఎ , డి
3. సి , బి , డి , ఎ
4. డి , ఎ , సి , బి

6. కథనం - 1 : రాష్ట్రంలోని స్థానిక సంస్థల డైరెక్టరేట్లు మున్సిపల్ కార్పొరేషన్ల పనితీరును పర్యవేక్షిస్తాయి .
కథనం -2 : రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని స్థానిక సంస్థలపై నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది .
కోడ్లు : 1. రెండు కథనాల విడివిడిగా సరైనవి మరియు కథనం -2 అనేది కథనం -1 కు సరైనది .
2. రెండు కథనాలు విడివిడిగా సరైనవి కాని కథనం -2 అనేది కథనం -1 వివరణ కాదు .
3. కథనం -1 సరైనది కాని కథనం -2 తప్పు .
4. కథనం -1 తప్పు కాని కథనం -2 సరైనది .

7. రాజ్యాంగ ( 74 వ సవరణ ) చట్టం , 1992 కు సంబంధించి ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ఈ చట్టం ఏర్పాటు చేయునది
ఎ . మూడంచెల మున్సిపాలిటీలు
బి . వార్డు కమిటీలు
సి . జిల్లా ప్రణాళికా సంఘాలు
డి . మున్సిపాలిటీ ఛైర్పర్సనక్కు ఎన్నిక
దీనిలో ఏది / ఏవి సరైనవి ?
1. ఎ మాత్రమే
2. ఎ , బి మరియు సి
3. బి మరియు సి
4. బి , సి మరియు డి

8. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము
ఎ . పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని స్వప్రభుత్వ సంస్థలతో కూడిన స్థానిక ప్రభుత్వం , భారత రాజ్యాంగం యొక్క 7 వ షెడ్యూల్ ఉమ్మడి జాబితా .
బి . నిబంధన 243-243 ZG ద్వారా భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడిన నిబంధనలకు మౌలిక నిబంధనల స్వభావం ఉంది .
సి . ఈ నిబంధనల సంబంధిత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలతో అనుబంధం చేయబడవలెను .
పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనవి .
1. ఎ & బి మాత్రమే
2. సి మాత్రమే
3. బి & సి మాత్రమే
4. ఎ , బి & సి

9. నగర పాలక సంస్థలు చేసే అన్ని రకాల రుణ ప్రతిపాదనలు ఎవరు ఆమోదించాలి ?
1. ప్రణాళికా శాఖ
2. రాష్ట్ర ప్రభుత్వం
3. కేంద్ర ప్రభుత్వం
4. భారతీయ రిజర్వుబ్యాంక్

10. నగర పాలికా సంస్థలకు సంబంధించి ప్రత్యేక సిబ్బంది విధానం ఏయే రాష్ట్రాల్లో అమలులో ఉంది ?
1. గుజరాత్
2. పశ్చిమబెంగాల్
3. 1 & 2
4. ఆంధ్రప్రదేశ్

11. డెమోక్రాటిక్ డీ సెంట్రలైజేషన్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు ?
1. అషాకౌశిక్
2. సీతామిశ్రా
3. ఆర్.బి. జైన్
4. ఆర్.కె. ప్రభాకర్

12. సాధారణంగా మున్సిపాలిటీలో ఏ కమిటీకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది ?
1. ఫైనాన్స్ కమిటీ
2. కో - ఆర్టినేటింగ్ కమిటీ
3. 1 & 2
4. రాజకీయ వ్యవహరాల కమిటీ

13. నగరపాలిక సంస్థలకు సంబంధించిన రుణాల గురించి ఏ చట్టం వివరిస్తుంది ?
1. భారత రిజర్వు బ్యాంక్ చట్టం 1935
2. భారత రాజ్యాంగం
3. లోకల్ అథారిటిస్ లాన్స్యాక్ట్ , 1914
4. పై ఏదీ కాదు

14. నగరపాలక సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ వ్యవహరాలను ఎవరు చూస్తారు .
1. నగరపాలక సంస్థల ఆడిటింగ్ శాఖ
2. రాష్ట్రశాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ
3. 1 & 2
4. ఏదీ కాదు

15. మేయర్ - ఇన్ - కౌన్సిల్ విధానం ఏమున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతుంది ?
1. ముంబాయి
2. కలకత్తా
3. న్యూఢిల్లీ
4. చెన్నై

16. ప్రారంభంలో నగరాభివృద్ధి మంత్రిత్వశాఖ ఏశాఖ పరిధిలో పనిచేసేది ?
1. ఆరోగ్యమంత్రిత్వశాఖ
2. హెూంమంత్రిత్వశాఖ
3. ఆర్థిక మంత్రిత్వశాఖ
4. ప్రణాళికా మంత్రిత్వశాఖ

17. అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎవరు ?
1. హెచ్.ఎం. గోలాండేజ్
2. రాజ్నందా
3. అశోకముఖాపాధ్యాయ
4. అభిజిత్ దత్తా

Answers ::

1 ) 2 , 2 ) 3 , 3 ) 4 , 4 ) 2 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 3 , 8 ) 3 , 9 ) 4 , 10 ) 3 , 11 ) 2 , 12 ) 3 , 13 ) 3 , 14 ) 2 , 15 ) 2 , 16 ) 1 , 17 ) 1

Post a Comment (0)
Previous Post Next Post