హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరిది?

1. ఏదైనా కేంద్రపాలిత ప్రాంతానికి ఒక హైకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరింపచేయునది లేదా మినహాయించునది ఎవరు ?

1. భారత ప్రధాన న్యాయమూర్తి 

2. భారత రాష్ట్రపతి 

3. భారత ప్రధానమంత్రి 

4 . హైకోర్టు స్థానం ఎక్కడ కలదో ఆ రాష్ట్ర శాసనసభ శాసనం ద్వారా పార్లమెంట్ 


2. 32 వ ప్రకరణ భారత రాజ్యాంగంలోని సుప్రీంకోర్టు యొక్క రిట్ అధికార పరిధి , 226 ప్రకరణ క్రింది హైకోర్టు రిట్ అధికార పరిధి కంటే విస్తతమైనవి కాదు ఎందుకంటే హైకోర్టులు వీటికి సంబంధించి ఈ అధికారంను చేలాయించును ? 

1. ప్రాథమిక హక్కుల & అప్పీళ్ల విషయాలు 

2. ప్రాథమిక హక్కుల & స్టే విషయాలు 

3. ప్రాథమిక హక్కులు & ఇతర చట్టబద్ద హక్కులు 

4. సివిల్ మరియు క్రిమినల్ విషయాలు 


3 . ప్రాథమిక హక్కుల అమలు కొరకు రిట్లును జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణల కింది అప్పగించబడింది ? 

1. ప్రకరణ 226 మాత్రమే 

2. ప్రకరణ 32 & ప్రకరణ 226 రెండు

3. ప్రకరణ 32 మాత్రమే 

4. ప్రకరణ 32 కాదు & ప్రకరణ 226 కాదు 


4. అతని పదవీ కాలంలో పదవి నుండి ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించువారు ? 

1. పార్లమెంట్ యొక్క సిఫారుసుపై భారత ప్రధాన న్యాయమూర్తి 

2. రాష్ట్ర శాసనసభ సిఫారుసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

3. మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానాన్ని రాష్ట్ర శాసన సభ ఆమోదించినపుడు గవర్నర్ 

4. మూడింట రెండు వంతుల మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించిన ఒక తీర్మానంపై ఆధారపడి , రాష్ట్రపతి 


5. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో భారత రాష్ట్రపతిచే సంప్రదించబడు అధికారం భారత రాజ్యాంగం యొక్క నిబంధనల ప్రకారం అధికారం కలవారు ఎవరు ? 

1. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ 

2. రాష్ట్ర ముఖ్యమంత్రి 

3. కేంద్ర న్యాయశాఖ మంత్రి

4. గవర్నర్ 

5. భారత అటార్నీ జనరల్ 


6. అత్యధిక కేంద్ర పాలిత ప్రాంతాలకు , అత్యధిక రాష్ట్రాలకు సంబంధించిన న్యాయ విషయాలపై అధికార పరిధి కలిగియున్న హైకోర్టు ? 

1. కేరళ హైకోర్టు

2. గోవా హైకోర్టు 

3. గువాహాటి హైకోర్టు 

4. కలకత్తా హైకోర్టు 


7 . న్యాయ సమీక్షాధికారం అనగా ? 

1. శాసనాలను నిర్వచించటానికి మరియు అర్థ వివరణ చేయటానికి న్యా వ్యవస్థకు గల అధికారం 

2. రాజ్యాంగాన్ని నిర్వచించుందుకు మరియు అర్థ వివరణకు న్యాయ వ్యవస్థ గల అధికారం 

3. మరే చట్టపరమైన నిబంధన లేనప్పుడు శాసనాలు చేయడానికి కోర్టులకు గల అధికారం 

4 . రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఏదైనా శాసనపరమైన లేదా కార్య నిర్వాహక చట్టాన్ని చెల్లనిధిగా ప్రకటించుటకు న్యాయస్థానాలకు గల అధికారం


8. పదవీ విరమణ చేసిన ఒక హైకోర్టు న్యాయమూర్తి .

1. భారతదేశంలోని ఏ కోర్టులోనూ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు  

2. భారత దేశంలోని ఏ హైకోర్టులోనూ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు 

3. భారతదేశంలోని ఏ కోర్టులోనూ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు 

4. అతను ఏ హైకోర్టులో పదవీ వివరణ చేశాడో హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టరాదు 


9. ఈ క్రింది వాటిని గమనించుము ఒక హైకోర్టు ఈ అధికార పరిధి కలిగి ఉంటుంది .

ఎ . భారత రాష్ట్రపతి దానిని సంప్రదించిన వాటి న్యాయ సందేహంపై సలహానివ్వటం 

బి . రాష్ట్ర గవర్నర్ దానిని సంప్రదించిన వాటి న్యాయ సందేహంపై సలహా ఇవ్వటం 

సి . ప్రాథమిక హక్కుల అమలు లేదా మరేదైనా ఇతర ప్రయోజనాల కొరకు కొన్ని రిట్లును జారీ చేయుట 

డి . దాని ధిక్కారానికి శిక్షించటం 

1 ) సి మరియు డి 

2 ) ఎ , బి మరియు డి 

3 ) ఎ మరియు డి 

4 ) బి మరియు , సి 


10. ఒక హైకోర్టు న్యాయమూర్తులను మరోక హైకోర్టుకు బదిలీ ఎవరు చేయవచ్చును ?

1. ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి భారత రాష్ట్రపతి

2. భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదించి భారత రాష్ట్రపతి 

3. భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఆ రాష్ట్ర గవర్నర్ 

5. ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 


11. క్రింది వాటిని పరిశీలించుము ? 

ఎ . హైకోర్టు అప్పిళ్లు అధికార పరిధి క్రింద ఉన్న అన్ని న్యాయస్థానాలు మరియు ట్రిబ్యునళ్లపై ( సైనిక ట్రిబ్యునళ్లు వినహాయించి ) ప్రతి హైకోర్టుకి పర్యవేక్షణాధికారం ఉంటుంది 

బి . భారత రాజ్యాంగంలో ఒక హైకోర్టులోని న్యాయమూర్తుల గరిష్ట సంఖ్య నిర్థిష్టంగా పేర్కొనబడినది .

 పై వివరణలో ఏది / ఏవి సరైనవి ? 

1 ) ఎ మాత్రమే

2 ) బి మాత్రమే 

3 ) ఎ మరియు బి , కూడా 

4 ) ఎ కాదు మరియు బి , కాదు 


12. హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపు యొక్క స్వభావమును దీనిగా చెప్పవచ్చును ? 

1. ప్రధాన న్యాయమూర్తి యొక్క సమ్మతి 

2. ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో అనుగుణ్యత 

3. ప్రధాన న్యాయమూర్తి కొరకు కట్టుబడకుండా అధికారిక నివేదిక 

4. ప్రధాన న్యాయమూర్తి చేత ఫైలు పరిశీలన 


Answers ::

1 ) 5 , 2 ) 3 , 3 ) 2,4 ) 4 , 5 ) 4 , 6 ) 3 , 7 ) 4 , 8 ) 4 , 9 ) 1 , 10 ) 2 , 11 ) 4 , 12 ) 2

Post a Comment (0)
Previous Post Next Post