రాష్ట్ర మంత్రుల యొక్క జీతభత్యాలు ఏ విధంగా నిర్ణయించబడాతాయి ?

1. ముఖ్యమంత్రి మరియు కేబినెట్ రాష్ట్ర విధాన సభకు బాధ్యత వహాంచుట ?
1. పరోక్షమైనది
2. ప్రత్యక్ష , నిరంతర & సమిష్టిగా
3. అప్పుడప్పుడు జరుగునది
4. ఎన్నికల సమయంలో

2. రాష్ట్ర మంత్రి మండలిలోని మంత్రులను నియమించునది
1. రాష్ట్రపతి
2. ముఖ్యమంత్రి
3.గవర్నర్
4. పార్టీ అధ్యక్షుడు

3 . ఈక్రింది రాజ్యాంగ నిబంధనలలో దేనియందు రాష్ట్ర మంత్రి మండలి యొక్క సమిష్టి బాధ్యత సూత్రం ప్రతిష్టించబడినది ?
1. ప్రకరణ 167
2. ప్రకరణ 163
3. ప్రకరణ 162
4. ప్రకరణ 164

4. భారత రాజ్యాంగం ప్రకారం ఒక మంత్రి ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకున్న , దానిని మంత్రిమండలి
పరిశీలించకపోతే , మంత్రి మండలి పరిశీలనకు గవర్నర్ కోరిన విధంగా సమర్పించటం ముఖ్యమంత్రి విధి దీనిని నిర్ధారించునది ?
1. సమానులో ప్రధమునిగా ముఖ్యమంత్రి యొక్క హెూదా
2. రాష్ట్ర మంత్రి మండలితో సంబంధం లేకుండా మంత్రి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వత సిద్ద అధికారం
3. సమిష్టి బాధ్యత
4. మంత్రి నిర్ణయమును రద్దు చేయుటకు గవర్నరు గల అధికారం .

5 . క్రింది వాటిలో వేటిని రాజ్యంగంలో ప్రస్తావించ లేదు ?
ఎ . రాష్ట్ర మంత్రి మండలి యొక్క సమిష్ట బాధ్యత
బి . రాష్ట్ర మంత్రుల యొక్క రాజీనామా
సి . ముఖ్యమంత్రి నేతృత్వం లోని మంత్రి మండలి
డి . ఉపముఖ్యమంత్రి పదవి.
పై వాటిలో సరైనది...
1. ఎ మరియు బి
2. బి మరియు సి
3. ఎ మరియు సి
4. బి మరియు డి

6. రాష్ట్ర మంత్రుల యొక్క జీతభత్యాలు ఏ విధంగా నిర్ణయించబడాతాయి ?
1. న్యాయ శాఖ ద్వారా
2. హెూంశాఖ ద్వారా
3. రాష్ట్ర శాసన వ్యవస్థ ద్వారా
4. ఆర్థిశాఖ ద్వారా ద్వారా

7 . గవర్నర్ మంత్రుల ఇచ్చిన సలహా మేరకు రాజ్యాంగంలోని ప్రకరణ 163 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది సరైనది ?
1. దానిని హైకోర్టులో విచారించరాదు
2. దానిని సుప్రీంకోర్టులో విచారించవచ్చును
3. అన్ని న్యాయస్థానంలో విచారించవచ్చును
4. ఏ న్యాయస్థానంలో విచారించరాదు

8. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి జీతభత్యాలు వీటి నుండి చెల్లింపబడతాయి ?
1. రిజర్వు బ్యాంకు నుండి
2. రాష్ట్ర సంఘటిత నిధి
3. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా
4. రాష్ట్ర ఆగంతుక నిధి

9. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ మంత్రులు మరియు కేబినేట్ మంత్రులతో పాటు పార్లమెంట్ కార్యదర్శులను కూడా కలిగి ఉంటుంది . రాష్ట్ర శాసన సభలో సభ్యులు కూడా అయిన ఈ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించునది ?
1. గవర్నర్
2. ముఖ్యమంత్రి
3. స్పీకర్
4. అధికార పార్టీ చీఫ్ విప్

10. రాష్ట్ర మంత్రి మండలిలో గవర్నర్ గల సంబంధంతో వ్యవరించు నిబంధనలను విశ్లేషించటానికి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ సంబందిచినవి ?
1. ప్రకరణలు 164 , 165 మరియు 168
2. ప్రకరణలు 162 , 163 మరియు 169
3. ప్రకరణలు 163 , 164 మరియు 167
4. ప్రకరణలు 161 , 165 మరియు 166

11. గిరిజన సంక్షేమ శాఖకు ఇంఛార్జ్ మంత్రి ఉండవలసిన రాష్ట్రాలు రాజ్యాంగ నిర్దేశానుసారం
1. మణిపూర్ , అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర
2. రాజస్థాన్ , హర్యానా మరియు మేఘాలయ
3. అస్సాం , నాగాలాండ్ మరియు మిజోరాం
4. మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్ , జార్ఖండ్ & ఒడిషా

12. గవర్నర్ యొక్క అనుమతితో మాత్రమే రాష్ట్రంలో మంత్రులపై నేర విచారణ జరుపవలెను ఎందుకంటే వారు
1. గవర్నర్ తరుపున కార్యనిర్వహక అధికారాలను చలాయిస్తారు
2. రాజ్యాంగంలోని నిబంధనల క్రింద కొన్ని రక్షణలను కలిగి ఉంటారు .
3. ప్రజా ప్రతినిధులు
4. మంత్రిత్వ శాఖలకు అధినేతలు

13. క్రింది వాటిని పరిశీలించుము ?
ఎ . ముఖ్యమంత్రి మరణం లేదా రాజీనామా తరువాత కూడా కొంతకాలం పాటు రాష్ట్ర మంత్రి మండలి విధులలో కొనసాగుతుంది
బి . ముఖ్యమంత్రి లేనప్పుడు , రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశాలకు హెూంశాఖ మంత్రి మాత్రమే అధ్యక్షత వహిస్తాడు
సి . రాష్ట్ర మంత్రి మండలి లేకుండా గవర్నర్ విధులు నిర్వహించలేడు
డి . రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా నియమింపబడడు పైవానితో ఏది / ఏవి సరైనవి...
1 ) ఎ , బి మరియు డి
2 ) ఎ , బి , సి , డి
3 ) సి మాత్రమే
4 ) ఎ , బి సమిష్టిగా ఎవరికి బాధ్యత

14. రాష్ట్ర మంత్రి మండలి వహిస్తుంది ?
1. రాష్ట్ర విధానసభ
2. రాష్ట్ర విధాన పరిషత్తు
3. గవర్నర్
4. ముఖ్యమంత్రి

15. మంత్రి మండలి సంఖ్య మొత్తం శాసన సభ్యులలో 15 శాతమునకు మించరాదని తెలిపే రాజ్యాంగ సవరణ ?
1. 90
2.91
3.92
4.93

Answers ::

1 ) 2 , 2 ) 3 , 3 ) 4 ,4 ) 3,5 ) 4 , 6 ) 3 , 7 ) 4 , 8 ) 2 , 9 ) 1 , 10 ) 3 , 11 ) 4 , 12 ) 2 , 13 ) 3 , 14 ) 1 , 15 ) 2

Post a Comment (0)
Previous Post Next Post