షెడ్యూల్డ్ కులానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? జనరల్ పాలిటి బిట్స్...

1. రాష్ట్ర శాసన సభలో ఏ పార్టీ ఆధిక్యం రాకపోతే , రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అంశం
1. శాసనసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ
2. సభలో స్థిరమైన మెజారిటీని నిరూపించు కునేందుకు ఆ వ్యక్తి గల సామర్థ్యం
3 .వారి పార్టీ కార్యక్రమాలు మరియు విధానాలకు ఆయా పార్టీ సభ్యుల యొక్క విధేయత మరియు మద్దతు
4. ఒక యూనిట్గా ఏర్పడిన చాలా రాజకీయ పార్టీ కలయిక

2. ఒక ముఖ్యమంత్రి యొక్క రాజ్యాంగ బాధ్యత క్రింది వానిలో ఏది ?
1. మంత్రులందరూ గవర్నర్ చేత నియమింపబడతారు కావున , మంత్రులకు బాధ్యతలు కేటాయించటం విషయంలో ముఖ్యమంత్రి గవగ్నర్ యొక్క విచక్షణ ప్రకారం నడచుకోవాలి
2. ముఖ్యమంత్రి తగిన మోజారిటీ లేని పార్టీ నాయకుడైతే , గవర్నర్ నిర్దేశించిన కాలం లోపల రాష్ట్ర శాసనసభలో తన బాలాన్ని నిరూపించుకోవాలి
3p. గవర్నర్ రాజ్యాధినేతగా ఉంటాడు కాబట్టి , పరిపాలనకు సంబంధించిన అన్ని ప్రధాన నిర్ణయాలను గవర్నర్ యొక్క ముందస్తు ఆమోదం తరువాతనే ముఖ్యమంత్రి తీసుకోవాలి
4. రాష్ట్ర పరిపాన వ్యవహారములు మరియు శాసన నిర్మాణ ప్రతిపాదనలను సంబంధించి కేబినేట్ తీసుకున్న అన్ని నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కు తెలియజేయాలి

3. భారత రాజ్యాంగం ప్రకారం శాసన ప్రతిపాదనలను గవర్నర్కు తెలియపరుచున్నది ?
1. న్యాయశాఖమంత్రి
2. హైకోర్టు న్యాయమూర్తి
3. ముఖ్యమంత్రి
4. శాసనసభ స్పీకర్

4. ప్రతిపాదన ( కె ) : మంత్రుల నియామకం మరియు తొలగింపు విషయంలో ముఖ్యమంత్రి యొక్క మాటే అంతిమమైనది
హేతువు ( ఎల్ ) : మెజార్టీ పార్టీ నాయకున్ని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు మరియు అతని సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు .
1 ) కె , మరియు ఎల్ , రెండూ విడివిడిగా సరైనవి కాని ఎల్ , కె , కు వివరణ కాదు
2 ) కె మరియు ఎల్ రెండూ విడివిడిగా సరైననవి మరియు ఎల్ , కె కు సరైన వివరణ
3 ) కె , సరైనది కాని ఎల్ , తప్పు
4 ) కె తప్పు కాని ఎల్ సరైనది .

5. క్రింది వాటిలో భారత రాజ్యాంగం ప్రకారం ఏది సరియైనది ?
1. రాష్ట్ర పరిపాలన వ్యవహారములకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను గవర్నర్ తెలియచేయుట ముఖ్యమంత్రి విధి
2 . ప్రభుత్వం యొక్క అన్ని ప్రధాన విధాన ప్రకటన ముఖ్యమంత్రి చేస్తాడు
3. మంత్రుల మధ్య శాఖల కేటాయింపునకు ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు .
4. ఎప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడో , మంత్రిమండలి రద్దయిపోతుంది .

6 . క్రింది విధులను / అధికారాలు గమనించుము ?
ఎ . కేబినేట్ సమావేశాలకు అధ్యక్షత వహించటం .
బి . గవర్నర్కు సమాచారం అందచేయుట
సి . మంత్రుల మధ్య భేదాభిప్రాయాలను పరిష్కరించటం
డి . మంత్రులను నియమించటం మరియు వారికి శాఖలను కేటాయించడం .
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారాలు / విధులను పరిశీలించుము ?
1 ) బి , సి మరియు డి
2 ) ఎ , మరియు డి
3 ) బి , సి మరియు ఎ
4 ) ఎ , బిసి మరియు డి

7. ఈ క్రింది సంస్థలలో దేనిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్రింది సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంటాడు .
ఎ . అంతర్రాష్ట్ర మండలి
బి . జాతీయాభివృద్ధి మండలి
సి . జోనల్ మండలి
డి . జాతీయ సమగ్రతా గుర్తింపుము సరైన జవాబును గుర్తింపుము.
1 ) ఎ , బి మరియు సి
2 ) బి , మరియు సి
3 ) సి , బి మరియు డి
4 ) ఎ , బి , సి & డి

8 . ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధులను సంబంధించి వివరింపుము ?
ఎ . ఒక మంత్రి ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్న , దానిని మంత్రి మండలి పరిశీలించకపోతే గవర్నర్ కోరిన విధంగా దానిని మంత్రి మండలి పరిశీలనకు పంపటం
బి . ప్రభుత్వం కార్యకలాపాలు ఎక్కువ సౌలభ్యంగా నిర్వహించటానికి నిబంధనలు రూపొందిస్తాడు & ఆ కార్యకలాపాలను మంత్రుల మధ్య కేటాయిస్తారు.
పై వివరణలో ఏది / ఏవి సరైనవి .
1 ) ఎ మత్రమే
2 ) బి మాత్రమే
3 ) ఎ కాదు బి కాదు
4 ) ఎ మరియు బి

9 . కథనం 1 : ఒక సలహాదారుల బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలోని ఇతర శాఖలపై నియంత్రణ చేయవచ్చును .
కథనం- 2 : ముఖ్యమంత్రి మరియు అతని కేబినేట్ సమిష్టి బాధ్యత అనే ప్రాతిపదికపై విధులు నిర్వహిస్తాడు .
1. కథనం 1 తప్పు కాని , కథనం 2 సరైనది
2. కథనం 1 సరైనది కాని కథనం - 2 తప్పు
3. రెండు కథననములు విడివిడిగా సరైన కాని కథనం 2 అనేది కథనం - 1 సరైన వివరణ
4. రెండు కథనములు విడివిడిగా సరైనవి కాని కథనం - 2 అనేది కథనం -1 కి సరైన వివరణ కాదు

10. ప్రతిపాధన ( ఎ ) : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రి మండలి యొక్క ఆధినేత .
హేతువు ( బి ) : ముఖ్యమంత్రి శాసనసభకు బాధ్యత వహిస్తాడు మరియు మెజారిటీ మద్దతు అనుభవిస్తాడు .
1. ఎ , సరైనది కాని బి తప్పు
2. ఎ , తప్పు కాని బి సరైనది
3. ఎ మరియు బి రెండూ విడివిడిగా సరైనది కాని బి , ఎ కు సరైనది వివరణ కాదు
4. ఎ , మరియు బి రెండూ విడివిడిగా సరైనవి మరియు బి , ఎకు సరైన వివరణ

11. అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వారు ?
1. నీలం సంజీవరెడ్డి
2. జలగం వెంగళరావు
3. కాసు బ్రహానందరెడ్డి
4. ఎవరు కాదు

12. భారతదేశ మొదటి మహిళ ముఖ్యమంత్రి అయినా సుచేతా కృపలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు ?
1. మధ్యప్రదేశ్
2. హిమచల్ ప్రదేశ్ 
3 . కేరళ
4 . ఉత్తరప్రదేశ్

13. విధానపరిషత్ నుండి ముఖ్యమంత్రి అయిన వారు ?
1. భవనం వెంకట్రామిరెడ్డి మరియు అంజయ్య
2. భవనం వెంకట్రామిరెడ్డి మరియు దామోదరం సంజీవయ్య
3. రోశయ్య మరియు భవనం వెంకట్రామిరెడ్డి
4. ఎవరూ కాదు

14. భారతదేశంలో అతి తక్కువ కాలం పని చేసిన మహిళా ముఖ్యమంత్రి ?
1. నందినీ శతపతి
2. రబీదేవి
3. జానకీ రాంచంద్రన్
4. షీలాదీక్షిత్

15. షెడ్యూల్డ్ కులానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు.
1. బాలయోగి
2. దామోదరం సంజీవయ్య
3. మయావతి
4. ఎవరూ కాదు

Answers ::
1 ) 2 , 2 ) 4 , 3 ) 3,4 ) 2 , 5 ) 1 , 6 ) 3 , 7 ) 4 , 8 ) 1 , 9 ) 1 , 10 ) 4 , 11 ) 3 , 12 ) 4 , 13 ) 3 , 14 ) 3 , 15 ) 2

Post a Comment (0)
Previous Post Next Post