రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయవచ్చు ?

1. గవర్నర్కు సంబంధించి సరియైన రాజ్యాంగ స్థానం ఏదనగా ?
1. ప్రధానమంత్రి సలహాపై గవర్నర్ తన అధికారాలను నిర్వహిస్తాడు .
2 . రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ తన అధికారాలను నిర్వహిస్తాడు .
3 . రాష్ట్ర మంత్రి మండలి సలహాపై గవర్నర్ తన అధికారాలను నిర్వహిస్తాడు .
4. భారత రాష్ట్రపతి సలహాపై గవర్నర్ తన అధికారాలను నిర్వహిస్తాడు .

2 . గవర్నర్ అతని అధికారాల నిర్వహణలోను మరియు విధుల నిర్వహణలోను ?
1. విధాన సభకు జవాబుదారీ అయి ఉంటాడు .
2. విధాన సభ అభిశంసించ బడవచ్చును .
3. న్యాయస్థానంలో జవాబుదారీ అయి ఉంటాడు
4. న్యాయస్థానంలో జవాబుదారీ కాడు

3. ఒక రాష్ట్ర గవర్నర్కు కల్పించబడిన అధికారం , ప్రకరణ 213 క్రింది ?
1. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని నియమించడం
2. అత్యవసర అధికారాలను చలాయించడం
3. వివేచనా అధికారాలను చలాయించడం
4. శాసన వ్యవస్థ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేయడం

4 . ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. భారత రాజ్యాంగలోని ప్రకరణ 167 క్రింద , ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు మరియు శాసన ప్రతిపాదనలు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయాలి
2. రాష్ట్ర కార్యనిర్వహక అధికారం గవర్నరు అప్పగించబడినది మరియు రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వహక చర్యలన్నీ గవర్నర్ పేరు మీదగా జరగాలి .
3. మంత్రి మండలి సమిష్టిగా గవర్నర్కు బాధ్యత వహిస్తుంది
4. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పర్యాలోచనకై ప్రత్యేకించిన తరువాత , ఆ బిల్లు యొక్క తదుపరి ఆమోదం రాష్ట్రపతి చేతిలో ఉంటుంది మరియు గవర్నర్ దాని విషయంలో ఇక ఎటువంటి తదుపరి పాత్ర ఉండదు .

5 . ఈ క్రింది వాటిని పరిశీలింపుము ? భారత రాజ్యాంగంలోని ప్రకరణ 200 ప్రకారం గవర్నర్ ?
ఎ . రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లుకు అతని ఆమోదంను నిలిపి ఉంచవచ్చును
బి . ద్రవ్య బిల్లును ఇతర బిల్లు శాసన సభ పునఃపరిశీలన కొరకు తిప్పి పంపవచ్చును
సి . రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పర్యాలోచన కొరకు ప్రత్యేకించవచ్చును.
పై వానిలో ఏవి సరియైనవి...
1 ) ఎ మరియు బి
2 ) బి మరియు సి
3 ) ఎ మరియుసి
4 ) ఎ , బి మరియు సి

6 . రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయవచ్చు ?
1. రాష్ట్ర శాసన సభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర చర్య తీసుకోవలిసిన అవసరం మేర్పడినదని గవర్నర్ భావించినపుడు
2. న్యాయస్థానం అతనికి సలహా ఇచ్చినప్పుడు
3. కేంద్ర ప్రభుత్వం అతనిని కోరినపుడు .
4. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య చోటు చేసుకున్నప్పుడు

7. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగడం లేదని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక అందజేస్తే , ప్రకరణ 356 ప్రకారం భారత రాష్ట్రపతి ?
1. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు నిరాకరించవచ్చు
2. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలి
3 . ప్రభుతాన్ని తొలగించి కాని రాష్ట్ర శాసన సభను సుప్తచేతనవస్తలో ఉంచాలి .
4. రాష్ట్ర ప్రభుతాన్ని తొలగించి మరియు రాష్ట్ర శాసన సభను రద్దు చేయాలి

8. పతిపాదన ( బి ) : ముసాయిదా రాజ్యాంగం గవర్నరు ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని పొందుపరిచింది
హేతువు : ( సి ) రాజ్యాంగ నిర్మాణ సభ ప్రసుత్త పద్దతి అయిన రాష్ట్రపతిచే గవర్నర్ నియామకానికి ప్రాధాన్యత ఇచ్చింది .
1 ) బి సరైనది కాని సి తప్పు
2 ) బి తప్పు కాని సి సరైనది
3 ) బి & సి రెండూ విడివిడిగా సరైనది కాని సి , బికు సరైన వివరణ కాదు
4 ) బి మరియు సి రెండూ విడివిడి సరైనవి మరియు సి , బి సరైన వివరణ

9 . ఈ కింది వాటిని పరిశీలించుము ? ఒక రాష్ట్ర గవర్నర్
ఎ . భారత ముసాయిదా రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడాలని ఉండేది
బి . భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన వర్గముల నుండి మాత్రమే ఎంపిక చేయబడుతాడు .
సి . భారత రాజ్యాంగం కింద కార్య నిర్వహణాధికారం సంక్రమింపచేయబడి ఉంటాడు
డి . ప్రభుత్వం సమాఖ్య నిర్మాణం కారణంగా అవశ్యకమైన వాడు పై వానిలో ఏవి సరైనవి
1 ) బి మరియు సి
2 ) బి , సి మరియు డి
3 ) ఎ మరియు డి
4 ) ఎ , సి మరియు డి

10. క్రింది వాటిలో దేనిపై ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చును ?
1. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం యొక్క వైఫల్యం ప్రకటన
2. రాష్ట్ర శాసన సభ రద్దు
3. రాష్ట్ర మంత్రి మండలి బర్తరఫ్
4. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు
క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించుము .
1 ) ఎ , బి మరియు డి
2 ) ఎ , బి మరియు సి
3 ) ఎ , సి మరియు డి
4 ) బి , సి మరియు డి

11. ఈ కింది వానిలో ఏది సరియైనది ?
1. రాష్ట్ర యొక్క ఏ విధిని , అది అనుమతించినప్పటికీ , భారత ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒక రాష్ట్ర గవర్నర్కు ఎటువంటి అధికారం లేదు
2. ఒకే వ్యక్తి మూడు రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించవచ్చును .
3. 30 సం || రాల వయస్సు పూర్తి అయిన ఒక వ్యక్తి మాత్రమే ఒక రాష్ట్ర గవర్నర్ గా నియమించవచ్చు .
4. సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించి మాత్రమే ఆ రాష్ట్రానికి గవర్నర్ను నియమించాలి

Answers ::

1 ) 3 , 2 ) 4 , 3 ) 4 ,4 ) 3 , 5 ) 4 , 6 ) 1 , 7 ) 2 , 8 ) 3 , 9 ) 4 , 10 ) 2 , 11 ) 2

Post a Comment (0)
Previous Post Next Post