పంచాయతీరాజ్ చట్టం వర్తించని ప్రాంతాలు ఏవి?

1. పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్డు కులాలు , తెగల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది ?
1. 243 ( సి )
2.243 ( డి )
3.240 ( ఐ )
4.211 ( ఎ )

2. పంచాయతీరాజ్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు ?
1. జిల్లా కలెక్టర్లు
2. కేంద్ర ఎన్నికల సంఘం
3. రాష్ట్ర స్థాయిలో ఏర్పడ్డ స్వతంత్ర ఎన్నికల కమిషన్
4. ఎవరూ కాదు

3. 73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ వర్గాల వారికి పంచాయతీ రాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కేటాయించారు .
1. ఎస్సీ
2. ఎస్టీ
3. మహిళలు
4. పై అందరికీ

4. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమలులో ఉన్న రాష్ట్రం ఏది ?
1. త్రిపురా
2. రాజస్థాన్
3. పశ్చిమ బెంగాల్
4. బీహార్

5. మన రాష్ట్రంలో రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
1. నీలం సంజీవరెడ్డి
2. ఎన్.టి.రామారావు
3. టి.అంజయ్య
4. చంద్రబాబు నాయుడు

6. గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్యను ఎలా నిర్ధారిస్తారు .
1. గ్రామ సభ తీర్మానం
2. జనాభాను బట్టి
3. రాజ్యాగం ప్రకారం
4.పంచాయతీ తీర్మానం

7. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మొదటి అంచె ఏది
1. జిల్లా పరిషత్
2. పంచాయతీ సమితి
3. గ్రామ పంచాయతీ
4. ఏదీ కాదు

8. పంచాయతీలను చిన్న , చిన్న గణతంత్ర రాజ్యాలుగా అభివర్ణించినదెవరు ?
1. మొరార్జీ దేశాయ్
2. జయ ప్రకాశ్ నారాయణ
3. ఛార్లెస్ మెట్కాఫ్
4. మహాత్మాగాంధీ 

9. జిల్లా పరిషత్ సభ్యులకు ఎన్నుకోవడానికి అశోకెమెహతా కమిటీ ఎన్ని రకాల మార్గాలు ప్రభుత్వానికి సూచించింది ?
1. మూడు
2. పది
3. ఆరు
4. ఐదు

10. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విధానం ఏమిటీ
1. ప్రత్యక్షం
2. పరోక్షం
3. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం
4. రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా

11. పంచాయతీరాజ్ చట్టం వర్తించని ప్రాంతాలు ఏవి
1. ఢిల్లీ
2. మేఘాలయ , మిజోరాం , నాగాలాండ్
3. జమ్మూ & కాశ్మీర్
4. పైవన్నీ

12. నగర పంచాతీయలు అనగా ?
1. మున్సిపల్ కౌన్సిల్
2. మున్సిపల్ కార్పొరేషన్
3. చిన్న పట్టణ ప్రాంతం
4. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయికి పరివర్తన చెందుతున్న ప్రాంతం

Answers ::
1 ) 2 , 2 ) 3 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 2 , 6 ) 2 , 7 ) 3 , 8 ) 3 , 9 ) 3 , 10 ) 4 , 11 ) 4 , 12 ) 4

Post a Comment (0)
Previous Post Next Post