హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు ?

1. సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు ?
1 ) నైరుతి ఋతుపవనాలు
2 ) ఆగ్నేయ ఋతుపవనాలు
3 ) ఈశాన్య ఋతుపవనాలు
4 ) వాయువ్య ఋతుపవనాలు

2. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ?
1 ) బార్లి
2 ) వరి
3 ) మొక్కజొన్న
4 ) గోధుమ

3. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు ?
1 ) రోపార్ , లోథాల్
2 ) రంగ్పూర్ , లోథాల్ ( గుజరాత్ )
3 ) రంగపూర్ , ధోలావీర
4 ) మొహందారో , కాళీ బంగన్

4. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిని పండించినవారు ఎవరు ?
1 ) మెసపటోమియా ప్రజలు
2 ) సింధు ప్రజలు
3 ) బాబిలోనియా ప్రజలు
4 ) జోర్డాన్ ప్రజలు

5. సింధు ప్రజలకు తెలియని లోహం ? 1 ) రాగి
2 ) వెండి
3 ) ఇనుము
4 ) బంగారం

6. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్లబండ్లను ఏమంటారు ?
1 ) డక్కా
2 ) జెక్కా
3 ) ఇక్కా
4 ) ఎక్కా

7. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ?
1 ) రంగపూర్
2 ) లోథాల్
3 ) సుర్కటోడా
4 ) కోజి

8. సింధు ప్రజలు వస్తువులను నౌకల ద్వారా ఏడెన్ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలించి వ్యాపారం చేసేవారు ?
1 ) దిల్మన్ ( బహ్రయాన్ )
2 ) మక్రాన్ ( సౌదీ అరేబియాలోని పట్టణం )
3 ) పై రెండూ
4 ) పర్షియా

9. సింధు ప్రజలు వర్తకానికి ఉపయోగించిన విధానం ?
1 ) వస్తుమార్పిడివిధానం
2 ) వస్తుద్రవ్య విధానం
3 ) లోహద్రవ్య విధానం
4 ) కాగితపు ద్రవ్య విధానం

10. హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది ?
1 ) పర్తమును
2 ) ప్రకృతిని
3 ) సూర్యుడిని
4 ) జంతువులను

11. సింధు నాగరికత కాలంలో దేవాలయాలు ?
1 ) ఉండేవి
2 ) ఉండేవికావు
3 ) అక్కడక్కడ ఉండేవి
4 ) ఒకేచోట ఉండేవి

12. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం ?
1 ) దేవాలయాలు
2 ) వృత్తులు
3 ) ముద్రికలు
4 ) ఉపయోగించే వస్తుసామాగ్రి

13. హరప్పా ప్రజల ముఖ్య దేవుడు ఎవరు ?
1 ) అమ్మతల్లి
2 ) పశుపతి మహాదేవుడు
3 ) పతిదేవుడు
4 ) సూర్యుడు

14. రొపార్ ఎక్కడ ఉంది ?
1 ) హర్యానా
2 ) గుజరాత్
3 ) పంజాబ్ ( ఇండియా )
4 ) రాజస్థాన్

15. యజమాని చనిపోయిన తర్వాత అతనితోపాటు తాను పెంచుకున్న కుక్కలను కూడా పూడ్చినది ఎక్కడ ?
1 ) బనవాలి
2 ) రొపార్
3 ) సుర్కటోడా
4 ) కోజ

Answers ::

1 ) 3 2 ) 1 3 ) 2 4 ) 2 5 ) 3 6 ) 3 7 ) 2 8 ) 3 9 ) 1 10 ) 2 11 ) 2 12 ) 3 13 ) 3 14 ) 3 15 ) 2 

Post a Comment (0)
Previous Post Next Post