ఓజోన్ యొక్క మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు ?

1. 1985 లో ఓజోన్ పొర క్షీణతకు సంబంధించిన పలు సూచనలు చేసిన మొట్టమొదటి కన్వెన్షన్ ఏది ?
1. మాంట్రియల్ ప్రొటోకాల్
2. క్యోటో ప్రొటోకాల్
3. లండన్ కన్వెన్షన్
4. వియన్నా కన్వెన్షన్

2. మాంట్రియాల్ ఒప్పందం జరిగిన ఏ తేదీన ఓజోన్ దినంగా ప్రకటించారు ?
1. సెప్టెంబర్ 16
2. అక్టోబర్ 16
3. నవంబర్ 16
4. డిసెంబర్ 16

3. వియన్నా సమావేశంలో భారత్ ఏ సంవత్సరానికి ఓజోన్ క్షీణతకు కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని చెప్పింది ?
1. 2030
2. 2020
3. 2025
4. 2050

4. గ్లోబల్ వార్మింగ్కు ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏది ?
1. నైట్రోజన్
2. కార్బన్ డై ఆక్సైడ్
3. ఆర్గాన్
4. ఆక్సిజన్

5. మార్ష్ గ్యాస్ అని ఏ వాయువును పిలుస్తారు ?
1. మీథేన్
2. నైట్రోజన్
3. ఆక్సిజన్
4. ఆర్గాన్

6. గ్రీన్స్ వాయువుల విడుదల తగ్గింపునకు సంబంధించిన మార్పులు చేయడాన్ని ఏమంటారు ?
1. కార్బన్ ట్రేడింగ్
2. పల్వరైజేషన్
3. కార్బన్ ట్యాక్స్
4. యుట్రిఫికేషన్

7. ఓజోన్ యొక్క మందాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు ?
1. డాబ్సన్
2. వాట్సన్
3. సెంటిగ్రేడ్స్
4. మిల్లిగ్రేడ్స్

8. అతినీల లోహిత కిరణాల వడపోత మాధ్యమంగా దేనిని పిలుస్తారు ?
1. నియాన్
2. ఆర్గాన్
3. ఓజోన్
4. ఆక్సిజన్

9. దేశంలో పర్యావరణాన్ని , వన్యజాతి , వృక్ష జంతు జాలాలను కాపాడటం , మెరుగుపరచడం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనను చేర్చారు ?
1.21 ( ఎ )
2.48 ( ఎ )
3. 76 ( ఎ )
4. 108 ( ఎ )

10. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏ సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు ?
1. 1980
2. 1981
3. 1990
4. 1995

11. పర్యావరణ పరిరక్షణ కొరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా ఏర్పాటు అయిన మొట్టమొదటి సమావేశం ఏది ?
1. రామార్ కన్వెన్షన్
2. స్టాక్ హోమ్ సమావేశం
3. బ్రంట్లాండ్ కమిషన్
4. మాంట్రియల్ ప్రోటోకాల్

12. ఏ సంవత్సరంలో యునెస్కో MAB ( Man and Biosphere Programme అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ?
1. 1971 
2. 1972
3. 1973
4. 1975

13. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల సంరక్షణకు ఏర్పాటైన ఒకే ఒక అంతర్జాతీయ ఒప్పందం ఏది ?
1. బ్రంట్లాండ్ కమిషన్
2. రామార్ కన్వెన్షన్
3. మాంట్రియల్ ప్రోటోకాల్
4. యునెస్కో

14 . రామ్సార్ ఒప్పందం 1971 లో రామ్సార్ నగరంలో జరిగింది . అయితే ఈ నగరం ఏ దేశంలో ఉంది ?
1. ఇరాన్
2. ఇరాక్
3. అమెరికా
4. ఇండియా

15. Montreax Record దేని కొరకు ఉద్దేశించబడినది ?
1. అంతరించే దశలో ఉన్న చిత్తడి నేలలకు సంబంధించింది
2. అంతరించే దశలో ఉన్న జంతువులకు సంబంధించింది
3. అంతరించే దశలో ఉన్న వృక్షాలకు సంబంధించింది
4. ' అంతరించే దశలో ఉన్న అడవులకు సంబంధించింది

Answers ::

1.4 2.1 3.1 4.2 5.1 6.1 7.1 8.3 9.2 10.1 11.2 12.1 13.2 14.1 15.1 

Post a Comment (0)
Previous Post Next Post