భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ?

1. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్కు ఏవి శోషక నెలవులుగా ఉంటాయి ?
1. అడవులు
2. వాతావరణం
3. మొక్కలు
4. సముద్రాలు

2. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది ?
1. 1984
2 . 1985
3 . 1986
4. 1987

3. బొగ్గు గనులలో పనిచేసే కార్మికులలో ఏ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది ?
1. సిలికోసిన్
2. న్యూమోనియాసిస్
3. బెరీలియాసిస్
4. ఆస్బెస్టోసిస్

4. వాయు కాలుష్యకాలంలో 50 % ఏ వాయువు ఉంటుంది ?
1. హైడ్రోజన్
2. కార్బన్ మోనాక్సైడ్
3. నైట్రోజన్
4. కార్బన్ డై ఆక్సైడ్

5. ఈ - వేస్ట్ ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1. తెలంగాణ
2. గుజరాత్
3. మహారాష్ట్ర
4. తమిళనాడు

6. సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ కట్టడానికి తీవ్ర స్థాయిలో హాని కలుగుతుంది ?
1. ఎర్రకోట
2. ఫలక్నామా ప్యాలెస్
3. చార్మినార్
4. తాజ్మహల్

7. కంప్యూటర్ లో వలయాన్ని శుభ్ర పరచడానికి వేటిని వాడతారు ?
1. క్లోరోఫ్లోరో కార్బన్
2. హైడ్రోజన్ సల్ఫైడ్
3. సల్ఫ్యూరిక్ ఆమ్లం
4. అమ్మోనియా

8. ఒక క్లోరోఫ్లోరో కార్బన్ అణువు సుమారుగా ఎన్ని ఓజోన్ అణువులను విఘటనం చెందించగలుగుతుంది ?
1. ఒక లక్ష
2. ఒక వెయ్యి
3. పది లక్షలు
4. ఒక వంద

9. నాలుగు శాతం ఓజోన్ తగ్గుదల వల్ల భూమిని చేరే UV కిరణాల సంఖ్య
1. 1-5 %
2. 1-3 %
3. 1-8 %
4. 1-10 %

10. కాలుష్యస్థితి మధ్యస్థంగా ఉన్నప్పుడు ( 101-200 ) ( National Air Quality Index ( AQI ) ఏ రంగును సూచిస్తుంది .
1. ఎరుపు
2. పసుపు
3. నారింజ
4. నలుపు

11. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు ?
1. 1972
2. 1973
3. 1974
4. 1975

12. పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1972 లో సదస్సును ఎక్కడ నిర్వహించారు ?
1. ప్యారిస్
2. స్టాకోం
3. దోహా
4. బాలి

13. ఏ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి వాతావరణం , అభివృద్ధిల మీద ప్రపంచ కమిషన్ను ఏర్పాటు చేసింది ?
1. 1985
2. 1984
3. 1983
4. 1982

14. చారిత్రక కట్టడాలను ఆమ్లవర్షాల నుండి కాపాడటానికి ఏ విధమైన  కుండీలను ఏర్పాటు చేయాలి ?
1. క్షారజల
2. ఆమ్లజల
3. స్వచ్ఛమైన జల
4. ఏదీకాదు

15. ఓజోన్ అనేది లేతనీలం రంగులో ఉండే ఏ పదార్ధం ?
1. ఘన
2. ద్రవ 
3. తటస్థ
4. వాయు

Answers ::

1.4 2.1 3.2 4.2 5.3 6.4 7.1 8.1 9.2 10.2 11.3 12.2 13.3 14.1 15.4

Post a Comment (0)
Previous Post Next Post