యూపీఎస్సీ యొక్క వార్షిక నివేదిక ఈ వారిలో ఎవరికి సమర్పించబడును ?

1.యూపీఎస్సీ యొక్క వార్షిక నివేదిక ఈ వారిలో ఎవరికి సమర్పించబడును ?
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. పార్లమెంట్
4. కేంద్ర హెూంశాఖ

2. భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణలలో దేని ప్రకారం ప్రభుత్వం యూపీఎస్సీ యొక్క సలహాను తప్పనిసరిగా కోరవలసి ఉంటుంది ?
1. ప్రకరణ 310
2. ప్రకరణ 220
3. ప్రకరణ 120
4. ప్రకరణ 320

3. భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులను విస్తరించు అధికారం వీరికి నిహితం చేయబడినది ?
1. పార్లమెంట్
2. భారత ఉపరాష్ట్రపతి
3. యూపీఎస్సీ చైర్మన్
4. రాష్ట్రపతి

4 . ఈ క్రింది వివరణలను పరిశీలింపుము ?
ఎ . సభ్యునిగా పున్నర్నియామకం నుండి నిషేధించబడినాడు .
బి . గవర్నర్ వంటి రాజ్యాంగ అధికారి పదవిని చేపట్టడానికి అనర్హుడు.
సి . కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం క్రింది మరే ఇతర ఉద్యోగమునకు అనర్హుడు.
పై వివరణలో సరియైనది ఏవి ?
1 ) బి , మరియు సి సరైనవి
2 ) ఎ మరియు బి సరైనవి
3 ) ఎ మరియు సి సరైనవి
4 ) ఎ , బి మరియు సి

5. సరైనవి ఈ క్రింది వానిలో ఏది కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినది కాదు ?
1. పదోన్నతి
2. క్రమశిక్షణా విషయాలు
3. సర్వీసుల వర్గీకరణ
4. భర్తీ

6 . రాజ్యాంగ హెూదా దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ అనేది ?
1. ఇబ్బంది పరిష్కార సంస్థ
2. ఒక సలహ పూర్వక సంస్థ
3. రాష్ట్ర స్థాయిలో భర్తీకు దిశానిర్దేశం చేసే ఒక ఇంచార్జీ సంస్థ
4. సివిల్ సర్వేంట్ల శిక్షణను పర్యవేక్షించే ఒక సంస్థ

7. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యుల మరియు సిబ్బంది యొక్క సేవా షరతులకు సంబంధించిన నిబంధనలను చేయు అధికారాలు ఎవరికి / దేనికి అప్పగించబడినవి ?
1. కేంద్ర న్యాయ శాఖ మంత్రి
2. పార్లమెంట్
3. భారత రాష్ట్రపతి
4. ఛైర్మన్ , కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

8. 26 జనవరి 1950 కి తక్షణం ముందు కేంద్రపబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ విధంగా వ్యవహరించబడేది ?
1. ఇంపీరియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
2. పబ్లిక్ సర్వీస్ కమిషన్
3. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
4. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

9. ఈ క్రింది వానిలో దేనియందు , కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వనికి సలహానిస్తుంది .
ఎ . సివిల్ సర్వీసు భర్తీ విధానానికి సంబంధించిన విషయాలపై
బి . సివిల్ సర్వీసులకు నియామకాలు చేయునప్పుడు అనుసరించవలసిన సూత్రాలపై
సి . సివిల్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన క్రమశిక్షణా వ్యవహరాలపై
డి . దానికి సంప్రదింపు చేయబడిన సీనియారిటీ కేసులపై
1 ) బి , సి , డి
2 ) ఎ , బి , డి
3 ) ఎ , బి , సి , డి
4 ) ఎ , బి , సి

10. ప్రతిపాదన : యూపీఎస్సీ ఒక స్వతంత్ర సంస్థ హెూతువు : యూపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ
1. ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సరైనవి మరియు ఆర్ , ఎకు సరైన వివరణ
2. ఎ మరియు ఆర్ రెండూ విడివిడిగా సరైనవి కాని ఆర్ , ఎ కు సరైన వివరణ కాదు
3. ఎ సరైనది కాని ఆర్ తప్పు
4. ఎ తప్ప కాని ఆర్ సరైనది .

11. ఈ క్రింది వానిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ యొక్క విధులు ఏవి ?
ఎ . రాష్ట్రపతి లేదా గవర్నర్ దానిని సంప్రదించిన విషయాలపై సలహానిచ్చుట
బి . ఒక ప్రభుత్వ ఉద్యోగిని ప్రభావితం చేసే అన్ని క్రమశిక్షణ విషయాలపై సలహానివ్వడం
సి . కేంద్ర సర్వీసు భర్తీకి పరీక్షలు నిర్వహించడం
డి . పదోన్నతుల మరియు బదిలీలకు సంబంధించి అనుసరించవలసిన సూత్రాలపై సలహానివ్వడం
1 ) బి , సి మరియు డి
2 ) ఎ , బి మరియు సి
3 ) ఎ , బి మరియు డి
4 ) ఎ , బి , సి మరియు డి

12. క్రమశిక్షణా వ్యవహారాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంప్రదించాలని ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది
1. కేంద్ర దర్యాప్తు సంస్థ
2. పాలనా సంస్కరణల సంఘం
3. న్యాయ కమిషన్
4. కేంద్ర నిఘా సంఘం

Answers ::

1 ) 2 , 2 ) 4 , 3 ) 1,4 ) 3 , 5 ) 3 , 6 ) 2 , 7 ) 3 , 8 ) 4 , 9 ) 3 , 10 ) 1 , 11 ) 1 , 12 ) 4

Post a Comment (0)
Previous Post Next Post