పట్టణ స్థానిక సంస్థల ఆదాయ వనరులు ఏవి ?

1. ఈ క్రింది వివరణలను పరిశీలింపుము
ఎ . రాష్ట్ర ఆర్థిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘం నుండి నేరుగా గ్రాంట్లను పొందుతాయి .
బి . రాష్ట్రాలలోని వివిధ పంచాయతీరాజ్ సంస్థలు మరియు పురపాలక సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక సంఘాలు సమీక్షిస్తాయి .
పై వివరణలలో ఏది ఏది సరియైనవి ?
1. ఎ మరియు బి
2. ఎ మాత్రమే
3. బి మాత్రమే
4. ఏదీకాదు

2. స్థానిక ప్రభుత్వానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
1. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పథకాలను అమలు చేయడం మున్సిపాలిటీల యొక్క రాజ్యాంగబద్ధ విధి
2. మున్సిపాలిటీల ఆర్థిక స్వయం భరణశక్తిని చేకూర్చుటకు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రాల యొక్క ఒక రాజ్యాంగ బద్ధనిధి .
3. రాజ్యాంగం స్థానిక స్వప్రభుత్వ అంశాన్ని రాష్ట్రాల బాధ్యతగా ఉంచినది .
4. స్వ ప్రభుత్వ యూనిట్లుగా విధులు నిర్వర్తించడం గ్రామ పంచాయతీలు యొక్క ఒక రాజ్యాంగ బద్ధనిధి .

3. ఈ క్రింది వానిలో పట్టణ స్థానిక సంస్థల ఆదాయ వనరులు ఏవి ?
ఎ . ఆస్తిపన్ను
బి . అక్ట్రాయ్
సి . అమ్మకం పన్ను
డి . జంతువుల పన్ను
ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము.
1. ఎ మరియు బి
2. బి , సి మరియు డి
3. ఎ , బి మరియు డి
4. ఎ , సి మరియు డి

4. పంచాయతీలు మరియు మున్సిపాలిటీల యొక్క విధులు రాజ్యాంగ షెడ్యూల్ను ఏ జతలో పొందు పరచబడినది ?
1. 11 వ మరియు 12 వ
2. 9 వ మరియు 10 వ
3. 8 వ మరియు 9 వ
4. 10 వ మరియు 11 వ

5. మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ ముసాయిదా ప్రణాళికను రూపొందించునపుడు దృష్టిలో ఉంచుకొనవలసినది ?
ఎ . మున్సిపాలిటీలు మరియు పంచాయతీల మధ్య ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు .
బి . కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అన్ని లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలు .
సి . మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పంచాయతీలు తయారు చేసిన ప్రణాళికలు .
డి . ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులు .
క్రింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరియైన జవాబును గుర్తింపుము ?
1. ఎ , బి , సి మరియు డి
2 . బి మరియు డి
3. ఎ మరియు సి
4 . ఎ , బి మరియు సి

6. ఒక జిల్లా ప్రణాళికా కమిటీ వైర్పర్సన్ కమిటీ సిఫారసు చేసిన అభివృద్ధి ప్రణాళికను ఈ క్రింది వారిలో ఎవరికి పంపిస్తారు ?
1. జిల్లా అభివృద్ధి అధికారి
2. రాష్ట్ర ప్రభుత్వం
3. ఛైర్పర్సన్ , జిల్లా పరిషత్
4. జిల్లా కలెక్టర్

7. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు ?
మున్సిపాలిటీలకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని IX- ఎ భాగం కల్గుజేయునది ?
1. మున్సిపాలిటీల కొరకు ఒక ప్రత్యేక ఆర్థిక సంఘము ఏర్పాటు
2. జిల్లా ప్రణాళిక కొరకు కమిటీ ఏర్పాటు
3. రాష్ట్ర సంచిత నిధి నుండి మున్సిపాలిటీలకు గ్రాంట్స్ - ఇన్ - ఎయిడ్ను సమకూర్చుట
4. మెట్రో పాలిటన్ ప్రణాళిక కొరకు కమిటీ ఏర్పాటు

8. రాజ్యాంగ ( 74 వ సవరణ ) చట్టం ప్రకారం , రాష్ట్ర శాసన సభలకు మున్సిపాలిటీలకు ఈ బాధ్యతలతో సాధికారానికి అధికారం అప్పగించబడలేదు .
1. శాంతి భద్రతల నిర్వహణ
2. ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం కొరకు ప్రణాళికను తయారుచేయుట
3. వాటికి అప్పగించబడిన పథకాల అమలు
4. పన్నులు , సుంకాలు , టోల్స్ మొదలైన వాటి విధింపు వసూలు మరియు వినియోగించుకొనుట

9. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ఆర్థిక అధికారాలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరైనది .
1. స్థానిక ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా కేటాయించబడిన పన్ను విధింపు అధికారాలను కలిగి ఉంటాయి .
2. స్థానిక ప్రభుత్వాలకు చట్టం క్రింద అనుమతింపబడిన పన్నులను విధించే అధికారం ఇవ్వబడినది .
3. స్థానిక ప్రభుత్వాలకు వాటి కార్యకలపాలు పరిధిలోని అన్ని అంశాలపై ఛార్జీలు విధించే అధికారం ఇవ్వబడినది .
4. స్థానిక ప్రభుత్వాలకు సంబంధిత శాఖల అనుమతితో పన్నులు విధించే అధికారం కల్పించబడినది .

10 . ఈ క్రింది వానిలో వేటిపైన 74 వ రాజ్యాంగ నిబంధన దృష్టి సారించలేదు ?
ఎ . మున్సిపల్ సిబ్బంది వ్యవస్థ
బి . మున్సిపాలిటీ ఏర్పాటు మరియు కూర్పు
సి . మున్సిపాలిటీ సభ్యత్వం కొరకు అనర్హతలు
డి . ఎన్నికైన కార్యనిర్వహక వ్యవస్థ మరియు ఉద్యోగిస్వామ్యం మధ్య సంబంధాలు
ఈ క్రింది సరియైనది గుర్తించండి ?
1. ఎ మరియు డి మాత్రమే
2. బి , సి మరియు డి మాత్రమే
3. ఎ , బి మరియు సి
4. ఎ మరియు సి మాత్రమే

Answers ::

1 ) 3 , 2 ) , 3 ) 3 , 4 ) 1 , 5 ) 4 , 6 ) 2 , 7 ) 1 , 8 ) 1 , 9 ) 2 , 10 ) 4

Post a Comment (0)
Previous Post Next Post