ఇటీవల భారత దేశంతో రష్యా చేసుకున్న ముఖ్యమైన ఒప్పందాలు... నోట్స్...

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021 డిసెంబర్ 6 వ తేదీన భారత్కు ఒకరోజు పర్యటనకు వచ్చారు . ఏటా భారత్ , రష్యా దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేటందుకు ఆయన ఈ పర్యటన జరిపారు . ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 20 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి . తాజాగా జరిగినది 21 వ శిఖరాగ్ర సదస్సు . రక్షణ , ఇతర రంగాలలో పలు ఒప్పందాలపై సంతకాలు చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన జరిగింది.

    * ఈ పర్యటనలో పుతిన్ భారత ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు . భారత సరిహద్దుల్లో చైనాతో వివాదాలు , ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన , మధ్యాసియాలో పరిణామాలు , ఉగ్రవాదం , ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారం తదితర అంశాలపై చర్చించారు . భారత్ బలమైన శక్తి అనీ , కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన తమ మిత్ర దేశమనీ పుతిన్ ఈ సందర్భంగా ప్రశంసించారు . ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడి కొనసాగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు .
    * మోదీ మాట్లాడుతూ - ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా , భారత , రష్యాల మధ్య సంబంధాలు దృఢంగా , స్థిరంగా కొనసాగుతున్నాయన్నారు . రెండు దేశాల మధ్య సహకారం ఇక ముందు కూడా ఇలా కొనసాగుతుందని చెప్పారు .
    * ఇరు దేశాల నేతలు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు . ఇందులో ఇరు దేశాల మధ్య సహకారం ముఖ్యంగా రక్షణ రంగ సహకారం , రక్షణ , విదేశాంగ మంత్రుల మధ్య 2 + 2 చర్చలు , కోవిడ్ 19 పై పోరాటం , వ్యాక్సిన్లు , కోవిడ్ అనంతర పరిస్థితులు , ద్వైపాక్షిక వాణిజ్యం ( 2020 సంవత్సరంతో పోలిస్తే 2021 మొదటి అర్ధ భాగంలో ఇది 38 శాతం పెరిగింది ) మరింత పెంపు , అన్ని రంగాలలోను సహకారం పెంపు , ఇంకా పలు అంశాలపై రెండు దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి .
    * 2020 సంవత్సరంలో కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాల నేతలెవరూ విదేశీ పర్యటనలు జరపలేదు . 2021 లో పుతిన్ ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం కోసం జెనీవాకు వెళ్లారు . తర్వాత ఆయన విదేశీ పర్యటన జరపడం ఇదే . పుతిన్ విదేశీ పర్యటనలు ఎక్కువగా పరు . అయినా కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో కూడా భారత్కు రావడం వల్ల ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది . దీంతో మన దేశానికి రష్యా ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోందని విశ్లేషణలు కూడా వెలువడ్డాయి .

    ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ::

    * ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ , రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం భారత రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చాలా ముఖ్యమని రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్ పేర్కొన్నారు . ' ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నించినా ఇది ముందుకు కొనసాగుతోందని ప్రశంసించారు . దాదాపు రూ .37,675 కోట్ల విలువైన అయిదు ఎస్ -400 వ్యవస్థల కొనుగోలుకు మన దేశం 2018 లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది . దీనిపై ముందుకు వెళ్తే కాట్సా పేరిట ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు .
    * ప్రాంతీయంగా చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు రక్షణ సామర్ధ్యాలను పెంపొందించుకోవడంలో భాగంగా భారత్ ఈ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది . ఇవే కాకుండా ఇంకా పలు రకాల ఆయుధాలను సేకరిస్తోంది . అయితే మరోవైపు ఇండో - పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు కొన్నేళ్ల క్రితం అమెరికా , ఆస్ట్రేలియా , భారత్ , జపాన్ లు కలిసి ఏర్పాటు 5 చేసిన చతుర్భుజ కూటమి ' క్వాడ్ ' పట్ల రష్యా అసంతృప్తితో ఉంది . అందుకే ఇటీవల చైనాతో సాన్నిహిత్యం పెంచుకుంటోంది .
    * స్వాతంత్య్రం తర్వాత నుంచీ ఆయుధాల కొనుగోలుకు రష్యా మీద అత్యధికంగా ఆధారపడిన భారత్ తర్వాత ఇజ్రాయెల్ , ఫ్రాన్స్ , తదితర దేశాల నుంచి కూడా రక్షణ ఉత్పత్తులను దిగుమతులు చేసుకోవడం ప్రారంభించింది . అయినా ఇప్పటికీ మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు , రక్షణ ఉత్పత్తులలో 62 శాతం రష్యా నుంచే వస్తున్నాయి .
    * గతంలో బ్రహ్మోస్ క్షిపణులు , జలాంతర్గాములు , యుద్ధ ట్యాంకులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ వచ్చింది . ప్రస్తుతం అత్యాధునిక ఎస్ -400 క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు రూ .5000 కోట్ల విలువైన 6.7 లక్షల ఏకే -203 ఎసాల్ట్ రైఫిళ్ల కొనుగోలుకు కూడా ఒప్పందంపై సంతకాలు జరిగాయి .
    * వీటి తయారీ ఉత్తరప్రదేశ్లోని అమేథీలో నెలకొల్పనున్న ఇండో - రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జరుగుతుంది . రష్యా మొదట 70 వేల రైఫిళ్లను అక్కడ తయారుచేసి సరఫరా చేస్తుంది . తర్వాత ఆ సాంకేతికతలు బదిలీ చేసి మిగిలిన వాటిని పై కర్మాగారంలో తయారుచేస్తారు .

    మొదటి 2 +2 చర్చలు ::

    శిఖరాగ్ర సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు , విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవరోవ్లతో 2 + 2 తరహా సమావేశాలు జపా దేశాలకు చెందిన విదేశాంగ , రక్షణ మంత్రుల మధ్య 2 ప్లస్ 2 తరహా చర్చలు జరగడం ఇదే మొదటిసారి . ఈ సందర్భంగా రెండు దేశాలు రక్షణ రంగంలో నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి . గతంలో భారత్ ఇదే తరహా సమావేశాలను చతుర్భుజ కూటమి ( క్వాడ్ ) సభ్య దేశాలైన అమెరికా , జపాన్ , ఆస్ట్రేలియాలతో మాత్రమే నిర్వహించింది.

    28 ఒప్పందాలు ::

    * పుతిన్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య మొత్తం 28 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి . అవి...
    1. శాస్త్ర సాంకేతిక నవావిష్కరణల రంగంలో సహకారానికి మార్గ సూచి పత్రం
    2. మేధోసంపత్తి రంగంలో సహకారానికి అవగాహనా ఒప్పందం
    3. 2021-2031 మధ్య కాలంలో సైనిక , సాంకేతిక సహకారానికి ఒప్పందం . ఈ పదేళ్ల కార్యక్రమం ప్రస్తుతం రెండు దేశాల మధ్య నడుస్తున్న రక్షణ సహకారంలో భవిష్యత్ అవకాశాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది . ఈ రకమైన ఒప్పందాలు రెండు దేశాల మధ్య 1994 నుంచి అమలవుతూ వస్తున్నాయి .
    4. భూ సంబంధిత శాస్త్రాల రంగంలో సహకారానికి ఒప్పందం
    5. వాణిజ్య నౌకా రవాణా ఒప్పందంలో సవరణ కోసం అంగీకార పత్రం
    6. రెండు దేశాల మధ్య 2021 2024 సంవత్సరాల మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాల మార్పిడికి ఒప్పందం
    7. 2022-23 సంవత్సరాలలో ఇరు దేశాల మధ్య సాంస్కృతిక ఉత్సవాలు జరిపేందుకు అంగీకారం
    8 . పరిశోధనా రంగంలో సహకారానికి , అంతరిక్ష రంగంలో తియుత ప్రయోజనాల కోసం కలిసి పని చేయడానికి కుదిరిన ఒప్పందం
    9. దేశాలలోనూ పరస్పరం దౌత్య కార్యాలయాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించే అంగీకార పత్రాలు

    వాణిజ్య , ఇతర ఒప్పందాలు ::

    10. డెహ్రాడూన్లోని ఆప్టో ఎలక్ట్రానిక్స్ కర్మాగారానికి , రష్యా కంపెనీకి మధ్య ఒప్పందం
    11. భారతీయ రిజర్వు బ్యాంకుకు , రష్యా బ్యాంకుకు మధ్య సైబర్ దాడులకు సంబంధించిన ఒప్పందం
    12. భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్కు , రష్యాలోని అదే తరహా సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం
    13. విద్యుత్ రంగంలో ఎన్టీపీసీకి , రష్యాలో అదే తరహా సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం
    14. భారత ఉక్కు కర్మాగారం సెయిల్కు , రష్యాలో ఇదే మాదిరి సంస్థకు మధ్య సహకార ఒప్పందం 15. జిందాల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు , రష్యా కంపెనీకి మధ్య సహకార ఒప్పందం
    16. జెఎస్ డబ్ల్యూ సంస్థకు , రష్యా సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం
    17. భారత సంస్థ ఐఓసీఎల్కు , రష్యా చమురు సంస్థకు మధ్య అంగీకార పత్రం
    18. ఇంఫాల్లోని భారత జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం , రష్యా అంతర్జాతీయ ఒలింపిక్ విశ్వవిద్యాలయాలకు మధ్య అవగాహన ఒప్పందం
    19. కలకత్తాలోని శాస్త్ర విజ్ఞాన సంస్థకు , రష్యాలోని సముద్ర జీవశాస్త్రాల జాతీయ కేంద్రానికి మధ్య అవగాహన ఒప్పందం
    20. భారత్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం , రష్యాలోని దక్షిణ విశ్వవిద్యాలయానికి మధ్య అవగాహన ఒప్పందం
    21. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి , మధ్య ఒప్పందం మాస్కోలోని స్కాల్టెక్ విశ్వవిద్యాలయానికి
    22. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి , రష్యాలోని వైద్య విశ్వవిద్యాలయానికి మధ్య ఒప్పందం
    23. ఉత్తరప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలు , వాణిజ్యవేత్తల సమాఖ్యకు , రష్యాలోని అదే తరహా సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం
    24. మానవ వనరుల సరఫరా కోసం భారత్కు చెందిన మ్యాజిక్ బిలియన్ సంస్థకు , రష్యాకు చెందిన కంపెనీతో అవగాహన ఒప్పందం
    25. భారత్కు చెందిన ఐఓసీఎల్ , రష్యాలోని చమురు సంస్థల మధ్య అంగీకార పత్రం
    26. రష్యాకు చెందిన రోజ్నప్ట్ , భారత్కు చెందిన ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ సంస్థకు మధ్య శిక్షణా సహకారాల కోసం అవగాహన ఒప్పందం
    27. భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థకు , రష్యాలోని సంబంధిత సంస్థకు మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం
    28. భారత చమురు సంస్థ ఐఓసీఎలు , రష్యాకు చెందిన రోజ్సెప్ట్ సంస్థకు ముడి చమురు సరఫరా ఒప్పందం

    భారత్ - రష్యా సంబంధాల ప్రాధాన్యత ::

    * చైనాతో సమతుల్యత : ఇటీవలి కాలంలో భారత్ - చైనా సరిహద్దుల మధ్య - లడక్ , తదితర ప్రాంతాలలో తరచుగా వివాదాలు , ఘర్షణలు రేకెత్తుతూ వస్తున్న నేపథ్యంలో రష్యా ఈ అంశంలో చైనాతో ఉద్రిక్తతలు తగ్గించి , సమతుల్యతకు సహాయపడగలదని భారత్ ఆశిస్తోంది . గతంలో లడక్ ప్రాంతంలోని గాల్వన్ లోయ వద్ద ఉన్న వివాదాస్పద ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు రష్యా మూడు దేశాల విదేశాంగ మంత్రుల త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది .
    * కొత్త ఆర్థిక అవకాశాలు : మొదటి నుంచీ భారత్ - రష్యా సంబంధాలలో ఆయుధాలు , రక్షణ ఉత్పత్తులు , హైడ్రోకార్బన్లు , అణు సహకారం మొదలైనవి ప్రధానంగా ఉంటూ వస్తున్నాయి . ప్రస్తుతం అవే కాకుండా కొత్త రంగాలలో కూడా సహకారం అభివృద్ధి చేసుకోవాలనీ , ప్రత్యేకించి గనులు , వ్యవసాయ పరిశ్రమలు , అత్యున్నత సాంకేతికతలు , రోబోటిక్స్ , నానోటెక్ , బయోటెక్ మొదలైన రంగాలలో సహకారం పెంచుకోవాలనీ రెండు దేశాలూ ఆశిస్తున్నాయి .
    * రష్యా తూర్పు ప్రాంతం , ఆర్కిటెక్ ప్రాంతాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ఇటీవల భారత్ ఆశిస్తోంది . అక్కడ అనుసంధాన ప్రాజెక్టులు కూడా నిర్మించే అవకాశం ఉంది . తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ , ఆఫ్ఘనిస్తాన్లో సరైన పాలన ఏర్పాటు చేయడంలోనూ కలిపి కృషి చేయాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి . ఇంకా బహుళ దేశాల వేదికలపై కూడా కలిసి పని చేయాలని రెండు దేశాలూ ఆశిస్తున్నాయి . ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు , అందులో భారత్కు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనలకు రష్యా మద్దతు ఇస్తోంది .
    * భారత్కు అత్యధికంగా ఆయుధాలు , రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాలలో రష్యా మొదటి నుంచీ ముందు స్థానంలో ఉంటూ వస్తోంది . గత ఐదేళ్ళలోనూ అంటే 2016-20 మధ్య కాలంలో అంతకు ముందు 5 ఏళ్ల కంటే , అంటే 2011-15 మధ్య కాలం కంటే ఇరు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల వాణిజ్యం సగానికి సగం తగ్గిపోయింది . అయినా ఇప్పటికి కూడా భారత్కు ఆయుధాలు , రక్షణ ఉత్పత్తులు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా రష్యా నిలిచింది .
    * గత 20 ఏళ్లలో భారత్ రష్యా నుంచి దాదాపు 35 బిలియన్ డాలర్ల ఆయుధాలు , రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని అంతర్జాతీయ ఆయుధాల వాణిజ్యంపై స్టాక్ మ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది .
    * అయితే రష్యా జలాంతర్గాములు , పెద్ద యుద్ధనౌకలు మొదలైన వాటిని సరఫరా చేయడానికి మొదట నిర్ణయించిన కాలం కంటే చాలా ఎక్కువగా జాప్యం చేస్తూ వస్తోంది . అందువల్ల ఆయా ఉత్పత్తుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి . ఈ జాప్యాన్ని నివారించేందుకు రష్యా చర్యలు తీసుకోవాల్సి ఉంది .
    * ఇవే కాకుండా రష్యా సరఫరా చేసే ఇతర సైనిక పరికరాలు , రక్షణ ఉత్పత్తుల్లో జాప్యం అత్యధికంగా ఉండటం కూడా భారత సైన్యానికి సమస్యగా ఉంటూ వస్తోంది . ఈ సమస్యను ఎదుర్కోవడానికి 2019 లో రష్యా తమ దేశంలో చట్టపరమైన చర్యలు తీసుకు వచ్చింది . భారత్కు ఉత్పత్తులను అందించే కంపెనీలు , ఉమ్మడి ప్రాజెక్టుల విషయంలో చట్టబద్ధమైన మార్పులు తీసుకువచ్చింది . కానీ ఈ ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయడం
    * వచ్చే పలు దశాబ్దాల కాలం వరకు రష్యా భారత్కు కీలకమైన రక్షణ భాగస్వామిగా ఉండనుంది . అందువల్ల ఇలాంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సి ఉంటుంది . రష్యా భారత్లో కలిపి ఉమ్మడి సైనిక ఉత్పత్తులను అభివృద్ధి చేసి వాటిని భారత్లో ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు అమ్మాలనే ప్రణాళిక కూడా ముందుకు సాగవలసి ఉంది .

    Post a Comment (0)
    Previous Post Next Post