పర్యావరణ GK ముఖ్యమైన అంశాలు... నోట్స్...


    తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు రానుండటంతో తెలుగు రాష్ట్రాలలోని పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని అందరికి కామన్గా ఉండే అంశాలను గత కొన్ని సంచికల నుంచి ఉచిత బుక్లెట్ రూపంలో అందజేస్తున్నాము . అదేవిధంగా ఈ సంచికలో అతిముఖ్యమైన అంశమైన ' పర్యావరణం ' గురించి అందిస్తున్నాము . ఈ ప్రత్యేక సంచిక మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము .

    * Environment అనే పదం Environ అనే ' ఫ్రెంచ్ ' భాషా పదం నుండి వచ్చింది . ఫ్రెంచ్ భాషలో Environ అనగా చుట్టూ ఆవరించి ఉన్న లేదా చుట్టుకొని ఉండుట అని అర్ధం .

    * పర్యావరణంలోని వివిధ జాతి జీవుల మధ్య మరియు జీవులకు వాటి పరిసరాలకు మధ్య జరిగే సంబంధాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని  ' ఆవరణశాస్త్రం ( Ecology ) ' అంటారు .

    * ఎకాలజీ అనే పదం రెండు గ్రీకు పదాలైన Oikas ( ఆవాసం ) మరియు Logos ( అధ్యయనం ) పదాల కలయిక . అంటే ' ఆవాస అధ్యయనం ' అంటారు . ‘

    *  జీవులు , వాటి నిర్జీవ పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల అధ్యయనం జీవావరణ శాస్త్రం ' అని ఎర్నెస్ట్ హెకెల్ నిర్వచించారు . ' జీవ సమాజాల విజ్ఞానం , జీవావరణ శాస్త్రం ' అని క్లెమెంట్స్ నిర్వచించాడు .

    * ' పర్యావరణ నిర్మాణ , క్రియాశీల చర్యల అధ్యయనం ఆవరణశాస్త్రం అని యూజిన్ ఓడమ్ నిర్వచించాడు . '

    * ఆవరణ శాస్త్ర పితామహుడు ( Father of Ecology )  అని యూజిన్ ఓడము పేర్కొంటారు . భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ( Father of Indian Ecology ) గా రామ్ దేవ్ మిశ్రాను పేర్కొంటారు .

    * ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ నిర్జీవ అంశాల మొత్తమే ' ఆవరణ వ్యవస్థ ' .

    ఆవరణ శాస్త్రం పరిభాష పదాలు ::

    * జాతి : తమలో తాము అంతర ప్రజననం చెందగల సమాన లక్షణాలు ఉన్న జీవుల సమూహాన్ని ' జాతి ' అంటారు .

    * జనాభా : ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని ' జనాభా ' అంటారు .

    *  జీవ సమాజం : ఏదైనా నిర్దిష్ట ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందిన సూక్ష్మజీవులు , వృక్షాలు , జంతువుల సమూహాన్ని ' జీవ సమాజం ' అంటారు .

    *  ఆవాసం ( Habitat ) ; ఒక జీవి నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు .

    * ఎకలాజికల్ నిచ్ ( Ecological Niche ) : జీవ సమాజంలో ఒక జీవి క్రియాత్మక స్థాయిని Ecological Niche అంటారు .

    * జీవ మండలం ( Biome ) : ఒక నిర్దిష్ట వాతావరణం గల విశాల లోని అన్ని జీవ సమాజాల సముదాయాన్ని జీ వ మండలం అంటారు .

    జీవగోళం : ( Biosphere ) : జీవులు , జీవం విస్తరించి ఉన్న భూభాగాన్ని జీవగోళం అని అంటారు . భూమి మీద ఉన్న అన్ని రకాల జీవ మండలాలను కలిపి జీవగోళం అంటారు . సముద్ర మట్టానికి 7-8 కి.మీ. ఎత్తు వరకు , సముద్రంలో 5 కి.మీ. లోతు వరకు జీవులు విస్తరించి ఉన్నాయి .

    * పర్యావరణం : భారత పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం జీవుల పెరుగుదలను , ప్రత్యుత్పత్తిని ప్రభావితం చేసే బాహ్యకారకాలను ' పర్యావరణం ' అని అంటారు .

    * కారకం ( Factor ) : జీవులపై ప్రభావం చూపే ఏదైనా పదార్థం , స్థితి లేదా బాహ్య బలమునే ' కారకం ' అంటారు . ఉదా : కాంతి , ఉష్ణం , నీరు మొదలైనవి . వేజిటేషన్ : ఒక ప్రాంతంలో నిరంతరంగా పెరిగే మొక్కల సమూహం .

    * ఫ్లోరా : ఒక ప్రాంతంలో నిరంతరంగా పెరుగుతున్న మొత్తం మొక్కల జాతుల సంఖ్యాపరమైన సమూహం . ఫానా : ఒక ప్రాంతంలో నిరంతరంగా పెరుగుతున్న మొత్తం జంతు జాతుల సమూహం .

    *  జీవద్రవ్యరాశి ( Bio - mass ) : ఒక ప్రమాణ ఆవాసంలో గల జీవరాశిలోని పొడి జీవ పదార్థ బరువునే ' జీవ ద్రవ్యరాశి ' అంటారు .

    * ఎకోటోన్ ( Ecotone ) : సమీపంలో ఉన్న రెండు ' బయోమ్'లను లేదా ఆవరణ వ్యవస్థలను వేరు చేస్తూ ఉండే ఒక విధమైన లేదా సన్నని మధ్యంతర ప్రాంతాన్ని లేదా పరివర్తన మండలాన్ని ' ఏకోటోన్ ' అంటారు .

    *  బయోటా ( Biota ) : ఒక నిర్దిష్ట ప్రదేశం లోని జంతు , వృక్షజాతుల మొత్తమే ' బయోటా ' .

    *  బయోస్టాసీ ( Biostasy ) : బయోస్టాసీ అనగా సాధారణ వృక్ష సంపద గల కాలం .

    *  రెక్సిస్టాసీ ( Rhexistasy ) : ఎలాంటి వృక్ష సంపద లేని ప్రదేశం .

    * ఆహార గొలుసు ( Food Chain ) ; జీవావరణ వ్యవస్థలో ఒక పోషణ స్థాయి నుండి మరొక పోషణ స్థాయికి ఒక నిర్దిష్ట అనుక్రమంలో ఆహారరూపంలో శక్తి ప్రసరించే విధానాన్ని ఆహారగొలుసు అంటారు .

    * బయో రెమిడియేషన్ : సూక్ష్మజీవులను ' వాటి ఉత్పత్తులను వాడి పర్యావరణ శుభ్రతను చేపట్టడాన్ని ' బయో రెమిడియేషన్ ' అంటారు .

    పర్యావరణ విభాగాలు ::

    జీవుల మనుగడకు దోహదం చేస్తున్న ఒకే ఒక గ్రహం భూమి . ఎందుకంటే భూమిలో ప్రధానంగా 4 ఆవరణాలున్నాయి . అవి :
    1. వాతావరణం ( Atmosphere )
    2. జలావరణం ( Hydrosphere )
    3. శిలావరణం ( Lithosphere )
    4. జీవావరణం ( Biosphere )

    1. వాతావరణం ( Atmosphere ) ::

    * భూమిని ఆవరించి ఉన్న వాయు పరివేష్టనం వాతావరణం . ఇది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల నిలిచి ఉంది .

    * భూమి ఉపరితలంపై 300 కి.మీ. ఎత్తు వరకు మందమైన వాయు పొర ఉంటుంది .

    * భూమిపై నివసించే వివిధ రకాల జీవుల పెరుగుదలకు , వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి . ఈ వాతావరణంలో ముఖ్యంగా ఐదు పొరలు ఉంటాయి . అవి :

    * పొరల ఆరోహణ క్రమం : ట్రోపోస్పియర్ , స్ట్రాటోస్పియర్ , మీసోస్ఫియర్ , ఐనోస్పియర్ మరియు ఎక్సోస్పియర్ .

    * పొరల అవరోహణక్రమం : ఎక్సోస్ఫియర్ , ఐనోస్ఫియర్ , మీసోస్ఫియర్ , స్ట్రాటోస్ఫియర్ మరియు ట్రోపోస్ఫియర్ .

    ఎ . ట్రోపోస్పియర్ ::

    * భూవాతావరణంలో భూమికి దగ్గర ఉన్న పొర . ఇది భూ ఉపరితలం నుంచి సుమారు 20 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది .

    * ధృవాల వద్ద ఈ ట్రోపోస్పియర్ మందం తగ్గి 8 కి.మీ.గా ఉంటుంది .

    *  ట్రోపోస్పియర్లోనే మేఘాలు , మెరుపులు ఏర్పడటం , పిడుగులు పడటం , తుఫానులు ఏర్పడటం లాంటి ప్రకృతి సహజమైన మార్పులు జరుగుతాయి .

    *  ట్రోపోస్పియర్లో ప్రతి కి.మీ.కు 6.5 ° C చొప్పున ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉంటుంది .

    * ట్రోపోస్పియర్ జీవులకు అతి ముఖ్యమైన వాతావరణ భాగం ( అన్ని వాయువులు ఇందులోనే ఉంటాయి ) ట్రోపోస్పియర్ పైపొరలలో ఉష్ణోగ్రత -60 ° C వరకు ఉంటుంది.

    * ట్రోపోస్పియర్ తర్వాత ప్రాంతమైన స్ట్రాటోస్పియర్తో కలిసే చోటును ‘ ట్రోపోపాస్ ' అంటారు .

    బి. స్ట్రాటోస్పియర్ ::

    * ట్రోపోస్పియర్ వెలుపలి వైపు ఉండే పొరను స్ట్రాటోస్పియర్ అంటారు .

    * ఈ పొర 30 కి.మీ. మందం కలిగి ఉంటుంది .

    * దీనిలోని వాయువుల సంఘటన ట్రోపోస్పియర్ను పోలి ఉంటుంది .

    * స్ట్రాటోస్పియర్లోనే ' ఓజోన్పర ' ఉంటుంది . ఈ పొర సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలను శోషించడం వలన ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత అధికంగా ( 90 ° C ) ఉంటుంది .

    * ఓజోన్ పొర భూమిపై ఒక మందమైన కవచంలాగా పని చేసి అతినీలలోహిత కిరణాల నుండి జీవరాశిని రక్షిస్తుంది .

    * స్ట్రాటోస్పియర్ , తర్వాత ప్రాంతమైన మీసోస్పియర్తో కలిసే చోటును ‘ స్ట్రాటోపాజ్ ' అంటారు .

    * ఈ పొరలో ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది .

    * జెట్ విమానాలు స్ట్రాటోస్పియర్ ఆవరణం లోనే ప్రయాణిస్తాయి .

    సి. మీసోస్పియర్ ::

    * స్పోయ స్ట్రాటోస్పియర్ వెలుపలి వైపు ఉండే పొరను ' మీసోస్పియర్ ' అంటారు .

    * ఈ పొరలో అతి తక్కువ శాతంలో వాయువులు ఉంటాయి . నీటి ఆవిరి ఉండదు .

    * మీసోస్పియర్ ని ఉల్కలు , ఉల్కపాతాలు భూమికి వచ్చే సమయంలో ఈ పొరలోకి వచ్చాక అవి మాడిమసైపోతాయి . అవి భూమి పైకి రాకుండా ఈ పొర కాపాడుతుంది .

    * మీసోస్పియర్ తర్వాత ప్రాంతమైన అయనోస్పియర్తో కలిసే చోటును ' మీసోపాజ్ ' అంటారు .

    * ఈ పొరలోనే ధ్వని చేసే రాకెట్లు , రాకెట్ శక్తి గల ఆ వాయు నౌకలు ఈ పొరను చేరుకోగలవు.

    డి. ఐనోస్పియర్ ::

    * మీసోస్పియర్ వెలుపలి వైపు ఉన్న పొరను ఐనోస్పియర్ అంటారు .

    * అత్యంత తేలికైన వాయువులు , అత్యంత ఉష్ణోగ్రత ఈ ఆవరణంలోనే ఉంటాయి . సమాచార తరంగాలను ఈ ఆవరణంలో ప్రవేశపెడతారు .

    * ఈ పొరలో వాయువులు అణుస్థితిలో ఉంటాయి .

    * ఈ పొరలో నత్రజని , ఆక్సిజన్లు సమాన నిష్పత్తిలో ఉంటాయి .

    * ఈ పొరలో పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతుంది .

    * ఈ పొరలో అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ కక్ష్య ఉంది .

    ఇ. ఎక్సో స్పియర్ ::

    * అత్యంత తేలికైన వాయువులు ఉంటాయి . హీలియం అధికంగా ఉంటుంది .

    * ఈ పొరలో ఉష్ణోగ్రత 200 ° C నుండి 5600 ° C వరకు ఉంటుంది .

    * ఈ పొరలో భూమి యొక్క ఉపగ్రహాలు ఈ ఆవరణంలో పరిభ్రమిస్తాయి .

    2. జలావరణం ::

    * భూగర్భంలోను , భూమి ఉపరితలం మీద వ్యాపించి ఉన్న నీటి పొరను ' జలావరణం ' అంటారు .

    * భూమిలో 71 % సముద్రాలతో ఆక్రమించి ఉంది . ఇందులో సముద్రాలలోని ఉప్పునీటి శాతము 97.3 % గా ఉంది . మిగిలిన 2.71 % నీరు మంచి నీరు ఉంది . ఇందులో 2.14 % ఆర్కిటిక్ సముద్రంలో మంచుతో కప్పబడి ఉంది .

    * భూమి మీద లభించే నీటిలో కేవలం 0.014 % మాత్రమే వినియోగానికి పనికి వచ్చే స్వచ్ఛమైన జలం ఉంది .

    * మహాసముద్రంలోని అత్యంత లోతైన ' మేరి యానా ' ట్రెన్స్ ( Trench ) జలావరణంలోనే ఉంది .

    3. శిలావరణం ::

    * భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ. లోతు గల బాహ్యపొరను శిలావరణం అంటారు .

    * అభిసరణ , అపసరణ , సమాంతర ప్రక్రియలు ( పొరలలో ) జరిగి విభిన్న ప్రాంతంలో ఎత్తయిన వాటిని పర్వతాలు , పీఠభూములు , మైదానాలు , శిలలుగా ఏర్పడతాయి .
    ఉదా : హిమాలయాలు , పశ్చిమ కనుమలు , వింధ్య సాత్పూర పర్వతాలు .

    4. జీవావరణం ( Biosphere ) ::

    * భూమిపై జీవులు ఉండే ప్రాంతం ఇది . దీనిలో శిలావరణం , జలావరణం , వాతావరణం కలిసే ఉంటాయి .

    ఆవరణ వ్యవస్థ ( Ecosystem ) ::

    * ఒక ప్రమాణ ఆవాసంలో జీవ సముదాయాలు , పరిసరాల మధ్య నిర్మాణాత్మకమైన చర్య , ప్రతిచర్యల మూలంగా జరిగే సజీవ , నిర్జీవ పదార్థాల వినిమయమే ‘ ఆవరణ వ్యవస్థ ' .

    * ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎ.జి. టాన్స్ .

    * ప్రతి ఆవరణ వ్యవస్థలో రెండు భాగాలు ఉంటాయి అవి జీవ , నిర్జీవ అనుఘటకాలు .

    * జీవ పదార్థాలు నిర్జీవ పర్యావరణంతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవించలేవు . ఎందుకంటే జీవులకు కావలసిన పదార్థాలను , శక్తిని అందించి వాటి మనుగడకు ఆధారంగా ఉండేవి నిర్జీవ పదార్థాలే .

    * జీవ అంశాలు : జీవ ప్రక్రియలు జరిపే సజీవులను జీవ అంశాలు అంటారు . వీటి యొక్క నాలుగు ప్రాథమిక అవసరాలు నీరు , ఆక్సిజన్ , ఆహారం , ఆవాసం . జీవ అంశాలను మూడు ప్రధాన భాగాలుగా విభజిస్తారు . అవి :
    1. ఉత్పత్తిదారులు
    2. వినియోగదారులు
    3. విచ్ఛిన్నకారులు

    1. ఉత్పత్తిదారులు ( Producers ) : ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని పిండి పదార్థాలను తయారు చేసుకొనే వాటిని ఉత్పత్తిదారులు అంటారు . ఉదా : మొక్కలు , శైవలాలు మొదలైనవి .
    * ఆవరణ వ్యవస్థలో శక్తి ఉత్పత్తికి మూలం సూర్యుడు .

    2. వినియోగదారులు ( Consumers ) : ఇవి శక్తి కొరకు ఉత్పత్తిదారుల పై ఆధారపడి ఉంటాయి . కావున ఇవి ‘ పరపోషకాలు ' . ఇవి నాలుగు రకాలు . అవి :

    * ప్రాథమిక వినియోగదారులు : ఇవి నేరుగా మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి . కావున ఇవి శాఖాహారులు ( Herbivores ) అంటారు . ఉదా : కుందేలు , పశువులు , మిడతలు , జంతు ప్లవకాలు మొదలైనవి .

    * ద్వితీయశ్రేణి వినియోగదారులు : శాకాహారులను ( ప్రాధమిక వినియోగదారులను ) తిని జీవించే జంతువులను ద్వితీయ శ్రేణి వినియోగదారులు ( మాంసాహారులు ) అంటారు . ఉదా : కోడి , పిల్లలు , కుక్క .

    * తృతీయశ్రేణి వినియోగదారులు : మాంసాహారులైన ( ద్వితీయ శ్రేణి వినియోగదారులు ) పై ఆధారపడి ఉంటాయి . ఉదా : తోడేలు , గ్రద్ద , హైనాలు , పాములు .

    * సర్వభక్షకాలు : ఇవి తృతీయ శ్రేణి భక్షకాలను ఆహారంగా కలిగి ఉంటాయి . అయితే ఇవి ఏ ఇతర జంతువులకు ఆహారం కావు . ఉదా : సింహాలు , పులులు .

    3. విచ్ఛిన్నకారులు : వీటినే సూక్ష్మ వినియోగదారులు లేదా రూపాంతరకరణలు అంటారు . ఇవి ఉత్పత్తి కారకాలు , భక్షకాల ( జంతువుల ) మృత జీవ పదార్థాలను విచ్ఛేదం చేసి ఆహారంగా స్వీకరిస్తాయి . ఉదా : బాక్టీరియాలు , వాన పాములు , కీటకాలు .

    * సహజ ఆవరణ వ్యవస్థ : ప్రకృతిలో సహజ పరిస్థితుల ద్వారా ఆవిర్భవించిన సాధారణ ఆవరణ వ్యవస్థకు సహజ ఆవరణ వ్యవస్థ అంటారు . పరిసరాల అనుగుణంగా ఇది రెండు రకాలు అవి : జల , భౌమ ఆవరణ వ్యవస్థ .

    ఎ . జలావరణ వ్యవస్థ : నీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి , నీటిలోని రసాయనాలను అనుసరించి రెండు రకాలు అవి : 1. మంచినీటి ఆవరణ వ్యవస్థ ( Fresh water Ecosystem ) .

    * మంచినీటి జీవావరణ వ్యవస్థల అధ్యయనంను లిమ్నాలజీ అంటారు . కుంటలు , కొలను , సరస్సు వంటి నిశ్చల నీటి వ్యవస్థను ' లెంటిక్ ' అంటారు . చిన్న కాలువలు , నదీ ప్రవాహాలు వంటి ప్రవాహ వ్యవస్థను ' లోటిక్ ' అంటారు . చిన్న కాలువలు , నదీ ప్రవాహాలు వంటి ప్రవాహ వ్యవస్థను ' లోటిక్ ' అంటారు .

    2. ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ ( Marine Water Ecosystem ) .

    * నదీ ముఖద్వారాలు , లోతు తక్కువ సముద్ర జలాలు , మహాసముద్రాలు ఉప్పునీటి ఆవరణ వ్యవస్థకు చెందినవి .

    * నదీ ముఖ ద్వారాలలో నివసించే జీవులు లవణీయతలోని హెచ్చు తగ్గులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండును .

    * సముద్ర నీటి ఆవరణ వ్యవస్థ అతిపెద్ద , అత్యంత స్థిరమైన ఆవరణ వ్యవస్థ .

    * నీటిలో నివసించే మొక్కలను ' హైడ్రోఫైట్స్ ( Hydro phytes ) అంటారు .

    * జంతువుల ఆకారం సాధారణంగా ' కదురు ' వలె ఉండి ఈదడానికి తోడ్పడును .

    * కొన్ని చేపలు శరీరంలోని రక్తం గడ్డకట్ట కుండా ప్రవహించేలా చేయడానికి ' యాంటీ ఫ్రీజింగ్ ' వంటి పదార్ధాలను కలిగి ఉండును .

    * ఎడారి / ఇసుక నేలలో " Xerophytes " ( జీరోఫైట్స్ ) బ్రహ్మజెముడు , నాగజెముడు , అలోవీరా నివసించే మొక్కలను అంటారు .

    ఉదా : కృత్రిమ ఆవరణ వ్యవస్థ : మానవుడు తన అవసరాలకు సహజ ఆవరణ వ్యవస్థలను అనేక మార్పులకు గురి చేస్తున్నాడు . ఇలా మార్పులు చేయడం వల్ల ఏర్పడిన వాటినే ' కృత్రిమ ఆవరణ వ్యవస్థ ' అంటారు .

    * అత్యధిక ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే గల జీవులను ' యూరీ థర్మల్ జీవులు ' అంటారు . అత్యల్ప ఉష్ణోగ్రత మార్పులను తట్టుకునే గల జీవులను ' స్టినోథర్మల్ జీవులు ' అంటారు .

    * ఆహారపు గొలుసు : ఉత్పత్తి కారకాల నుండి ఆహారశక్తిని బదిలీ చేసుకుంటూ , తమకు తాము తమ ఆహారాన్ని స్వీకరిస్తూ , తాము ఆహారంగా మారుతూ , జీవులలో పరస్పర సంబంధ క్రమం కలిగిన విధానాన్ని ఆహారపు గొలుసు ' అంటారు.

    * పర్యావరణ పిరమిడ్ : శక్తి , సంఖ్య , జీవ పదార్థాల ఉత్పాదకతల ఆధారంగా , ఆహారపు గొలుసులలోని విభిన్న పోషక స్థాయిల మధ్య గల సంబంధాన్ని రేఖా చిత్ర రూపంలో ప్రదర్శించేవే పర్యావరణ పిరమిడ్లు .

    * ఒక జాతికి చెందిన జీవులు , చుట్టూ ఉన్న జీవ మరియు నిర్జీవ పరిసరాల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడం ' ఆటెకాలజీ ' అంటారు .

    * జీవావరణ అనుక్రమం : భౌతిక పరిస్థితుల వలన కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని ' జీవావరణ అనుక్రమం ' అని అంటారు .

    * కుంటలలో , సరస్సులలో , బురద ప్రదేశాల్లో ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమాన్ని హైడ్రార్క్ అంటారు .

    * ఎడారిలో ప్రారంభమయ్యే జీవావరణ అనుక్రమాన్ని ' జీరార్క్ ' అంటారు .

    * 1868 లో కార్లోరైటిల్ అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రం అని ఉపయోగించాడు .

    * 1869 లో ఎర్లెస్ హెగన్ అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు .

    * మానవ నిర్మిత పర్యావరణమును సామాజిక సాంస్కృతిక పర్యావరణము అంటారు .

    * చాప చుట్టలా భూమండలాన్ని ఆవరించి ఉన్న వాయు మండలాన్ని ' వాతావరణం ' అంటారు .

    * అంతరిక్షం నుండి వెలువడే కాస్మిక్ కిరణాలను భూమిపై ప్రసరించకుండా వాతావరణం అడ్డుకొని జీవకోటిని కాపాడుతుంది . అందుచేతనే వాతావరణాన్ని భూమండలా నికి రక్షణ కవచం అంటారు .

    * ఓజోన్ సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిపై ఉన్న జీవరాశిని రక్షిస్తుంది .

    * వాతావరణంలోని ఆక్సిజన్ మానవులకు , మరియు జంతువులకు ప్రాణవాయువు .

    * వాతావరణంలోని ' నైట్రోజన్ ' వృక్ష సంతతిని పెంపు చేస్తుంది .

    * వాతావరణంలోని ' కార్బన్ డై ఆక్సైడ్ ' కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనడం ద్వారా చెట్లు తమ ఆహారాన్ని తయారు చేసుకుం టాయి . అంతేకాకుండా ' కార్బన్ డై ఆక్సైడ్ ' భూగోళం యొక్క సమశీతోష్ణస్థితిని కాపాడి వర్షాలు కురవడానికి దోహదం చేస్తుంది .

    * ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల మధ్య జరిగే శక్తి ప్రవాహాన్ని అధ్యయనం చేయడాన్ని ' జీవశక్తి శాస్త్రం ( Bio Energetics ) అంటారు .

    * ప్రకృతిలో సహజ సిద్ధంగా 3000 kcal సూర్యకాంతి ప్రతిరోజూ ఉత్పత్తి దారులైన ఆకు పచ్చని మొక్కలపై పడుతుంది . దానిలో 1500 k.cal ( కాలరీస్ ) శక్తిని ఉత్పత్తి దారులు శోషించుకొని , కిరణజన్య సంయోగ క్రియలో కేవలం 15 k.cal శక్తిని ( 10 % ) రసాయన శక్తిగా మార్పు చేస్తాయి .

    * బ్రిటీష్ శాస్త్రవేత్త Charles Elton ( చార్లెస్ ఎల్టన్ ) 1927 లో మొట్టమొదటిసారిగా ' జీవావరణ పిరమిడ్'ల గురించి వర్ణించాడు .

    * ఏక పరాకాష్ట సిద్ధాంతం ( Mono Climax Theory ) ; దీనిని 1916 వ సంవత్సరంలో ఫ్రెడరిక్ క్లెమెంట్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు . దీని ప్రకారం ఒక నిర్దిష్టమైన భూభౌగోళిక ప్రాంతంలో స్థిరత్వం కలిగిన ఒక్కొక్క పరాకాష్ట సమాజం ఉంటుంది .

    * బహుపరాకాష్ట సిద్ధాంతం ( Polyclimax Theory ) : 1953 లో విట్టేకర్ ప్రతిపాదించారు . దీని ప్రకారం ఒక వాతావరణ ప్రాంతంలో అనేక స్థిరత్వం పొందిన భిన్న సమాజాలు ఉంటాయి .

    * కుంట జీవావరణ వ్యవస్థ ( Pond Ecosystem ) ను ఆదర్శ జీవావరణ వ్యవస్థగా పరిగణించవచ్చు .

    * సెలాజిక్ ప్రాంతం అనగా సముద్ర తీరం వెంట ఉండే జల ప్రాంతం .

    * బెంథిక్ ప్రాంతం అనగా సముద్రంలోని అగాధ జల ప్రాంతం .

    జీవవైవిధ్యం ( Biodiversity ) ::

    * మన భూ ఆవరణంలో ఉండే విభిన్న జాతులు , వాటి జన్యువులు అవి నెలకొని ఉన్న జీవావరణ వ్యవస్థలను వివరించడాన్ని ' జీవ వైవిధ్యం ' అంటారు .

    * జీవ శాస్త్రజ్ఞుల ప్రకారం ' ఒక ప్రాంతంలోని జన్యు , జాతి , ప్రజాతులు , పర్యావరణ వ్యవస్థల సమస్తమే జీవవైవిధ్యం ' అంటారు .

    * IUCN మరియు UNEP ప్రకారం ఒక భౌగోళిక ప్రాంతంలోని మొత్తం జన్యువుల , జాతుల , జీవావరణ వ్యవస్థల సముదాయాన్ని జీవవైవిధ్యం ' అంటారు .

    * ధరిత్రీ సమావేశం ( 1992 ) ప్రకారం వివిధ జీవరాసుల మధ్య భూమి మీద , సముద్రంలో , జలావరణంలో , జాతిలో మరియు జాతులలో కనిపించే వైవిధ్యాన్ని జీవవైవిధ్యం అంటారు .

    * జీవ సంబంధ వైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా Norse & MC Manus ( 1980 ) లో ఉపయోగించారు .

    * జీవ సంబంధ వైవిధ్యాన్ని 1985 లో W.G.Rosen ( రోసెన్ ) . ' జీవవైవిధ్యంగా మార్పు చేసి ఉపయోగించారు .

    * ఒక్క మాటలో చెప్పాలంటే జీవవైవిధ్యం అనగా ' భూగోళములోని సమస్త ప్రాణికోటి ' అని అర్ధము .

    * జీవ వైవిధ్యాన్ని మూడు స్థాయిలుగా వర్గీకరించారు . అవి :
    1. జన్యువుల వైవిధ్యం
    2. జాతుల వైవిధ్యం
    3. జీవావరణ వైవిధ్యం

    * జన్యువుల వైవిధ్యం : ఒక జాతికి చెందిన జీవ రాశుల మధ్య జన్యువులలో నెలకొని ఉన్న మార్పులనే ' జన్యువుల వైవిధ్యం ( Genetic Diversity ) అంటారు .

    * జాతుల వైవిధ్యం : ఒక జీవావరణ వ్యవస్థలో గోచరించే అనేక జాతులకు చెందిన మొక్కలు , సూక్ష్మ జీవరాశులు మరియు జంతువుల సముదాయాన్ని జాతుల వైవిధ్యం ( Species Diversity ) అంటారు .

    * జీవావరణ వ్యవస్థ వైవిధ్యం ( Eco system diversity ) : ఒక ఆవరణ వ్యవస్థలోని ఉనికి మరియు జీవావరణ పద్ధతులలో మార్పులను గాని తెలిపేదే జీవావరణ వ్యవస్థ వైవిధ్యం అంటారు .

    * జాతుల ఆధిక్యత అనగా సంఖ్యాపరంగా ఒక యూనిట్ విస్తీర్ణంలో ఉండే జాతుల సముదా యాన్ని ' జాతుల ఆధిక్యత ' అంటారు .

    * జాతుల సమానత్వం అనగా ఒక ఆవాసంలో ఉండే వివిధ జాతులకు చెందిన జీవరాశుల సంఖ్య సమానంగా ఉండటమే జాతుల సమానత్వం .

    * జాతుల బహిర్గత్వం అనగా ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ జాతులకు చెందిన జీవరాశులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అయితే అది జాతుల బహిర్గత్వాన్ని తెలియజేస్తుంది .

    * జీవ వైవిధ్యం మూడు రకాలుగా విభజించారు . అవి :
    1 . ఆల్ఫా ( ax ) వైవిధ్యం
    2. బీటా ( B ) వైవిధ్యం
    3. గామా ( y ) వైవిధ్యం

    * ఆల్ఫా వైవిధ్యం : ఒక సమాజంలో గోచరించే జాతుల వైవిధ్యం .

    * బీటా వైవిధ్యం : ఒక ఆవరణ వ్యవస్థలో సమాజాల మధ్య జరిగే మార్పులే బీటా వైవిధ్యం .

    * గామా వైవిధ్యం : మొత్తం భూవిస్తీర్ణంలో కాని , ఒక భౌగోళిక ప్రాంతంలో గాని వివిధ ఆవాసాలు వ్యక్తపరిచే మార్పులనే గామా వైవిధ్యం అంటారు .

    Post a Comment (0)
    Previous Post Next Post